చిహ్నం

(గుర్తు నుండి దారిమార్పు చెందింది)


చిహ్నంను ఆంగ్లంలో సింబల్ అంటారు. చిహ్నాన్ని గుర్తు అని కూడా అంటారు. చిహ్నం ఒక ఆలోచనను సూచిస్తుంది. చిహ్నం సమాచారాన్ని తెలియజేయుటకు ఉపకరిస్తుంది. ఆష్ట భుజాలు గల ఎరుపు రంగు చిహ్నం ఆపమని సంకేతానిస్తుంది. ఒక గుడారం చిహ్నం ఇక్కడ మీరు అతిథ్యం స్వీకరించడానికి వసతి కలదు అని సూచించవచ్చు. సంఖ్యల కొరకు అంకెలను చిహ్నాలుగా వాడుతారు. వ్యక్తిగత పేర్లు వ్యక్తులను సూచించడానికి చిహ్నాలుగా ఉన్నాయి. ఎర్ర గులాబీ ప్రేమ, కరుణకు సంకేత చిహ్నాలు. చిహ్నం అనగా డ్రాయింగ్, ఆకారం, లేదా ఒక భావనను సూచించే వస్తువు, అంశం, లేదా ఏదో మొత్తం. అక్షరాలు అత్యంత సాధారణ చిహ్నాలుగా ఉన్నాయి, ఇవి పదాలకు, ధ్వనులకు చిహ్నాలుగా ఉన్నాయి. ఒక చిహ్నం వాస్తవ వస్తువు లేదా ఒక నిర్దిష్ట రంగును లేదా నమూనాను కలిగి ఉంటుంది. శిలువ క్రైస్తవ మతం యొక్క చిహ్నం, అలాగే రాజదండం రాచరిక అధికారానికి చిహ్నం. జాతీయ చిహ్నం ఒక ప్రత్యేక దేశానికి సంబంధించిన ఒక చిహ్నం.

ఆంధ్రప్రదేశ్ రచయతల సంఘం చిహ్నం.

శబ్దలక్షణం

మార్చు

సింబల్ అనే పదం, గుర్తు లేక సంకేత పదం అనే అర్థాలనిచ్చే గ్రీకు పదమైన సింబలాన్ (symbolon) నుండి ఉద్భవించింది.

మూలాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చిహ్నం&oldid=3317499" నుండి వెలికితీశారు