గూగుల్ స్ట్రీట్ వ్యూ

గూగుల్ స్ట్రీట్ వ్యూ (Google Street View) అనేది గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఎర్త్‌లో ఉపయోగించే సాంకేతికత, ఇది వినియోగదారు స్థానం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వీధుల పారానోమిక్ వీక్షణలను అందిస్తుంది. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో మే 25, 2007న ప్రారంభించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లోని అనేక నగరాల్లో దీని సేవలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇప్పుడు పూర్తి లేదా పాక్షిక కవరేజీతో 48 దేశాలు ఉన్నాయి. గూగుల్ మ్యాప్ చూస్తున్నప్పుడు గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు స్ట్రీట్ వ్యూ చిత్రాలు కలిగి ఉన్న ప్రదేశాలు గూగుల్ మ్యాప్స్‌లో నీలి చుక్కలుగా లేదా గీతలుగా ప్రదర్శించబడతాయి. గూగుల్ స్ట్రీట్ వ్యూలో 360 డిగ్రీలలో తీసిన చిత్రాలు చుక్కల రూపంలోను, దారి వెంబడి వెళ్తూ తీసిన వీడియోలు గీతల రూపంలో కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ చూస్తున్న వినియోగదారులు తమ కర్సర్‌తో చూడాలనుకుంటున్న లొకేషన్ లేదా ఆబ్జెక్ట్‌ని అనగా నీలి రంగులో ఉన్న చుక్కను రెండుసార్లు క్లిక్ చేయడం ద్వారా పనోరమచిత్రం చుట్టూ నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.[2]

గూగుల్ స్ట్రీట్ వ్యూ
జనవరి 7, 2010న బ్రెజిల్ లో సావో పాలోలోని విల్లా-లోబోస్ స్టేట్ పార్క్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా కారు
జనవరి 7, 2010న బ్రెజిల్ లో సావో పాలోలోని విల్లా-లోబోస్ స్టేట్ పార్క్‌లో గూగుల్ స్ట్రీట్ వ్యూ కెమెరా కారు
ప్రారంభ విడుదలమే 25, 2007; 16 సంవత్సరాల క్రితం (2007-05-25)
అందుబాటులో ఉందిబహుళ భాషలు
జాలస్థలిwww.google.com/streetview/ Edit this on Wikidata

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. https://epic.org/privacy/googlespyfi/Keyes.pdf
  2. "PC World article "Google Street View Gets Smart Navigation"". Pcworld.com. June 5, 2009. Retrieved August 27, 2010.

బయటి లంకెలు మార్చు