తెలుగు భాష లో ఉన్న పలు యాసలలో గోదావరి యాస ఒకటి.గోదావరి ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా యాసను మాట్లాడే విధానం చూసినవారు ఎవరైనా, వారిని గోదావరి జిల్లాల వాళ్ళు అని గుర్తుపట్టేస్తారు.ఆయ్‌,అండి అన్న పిలుపులు గోదావరి ప్రాంత ప్రజలు గౌరవంతో, మర్యాదతో, ఎదుటి వాళ్ళనీ పిలిచే పలకరింపుగా ఉంటుంది.వారితో సంభాషణ ఇతర ప్రాంత ప్రజలు విసుగుపడకుండా ఎంతసేపైనా సాగిస్తారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో ఈ యాస ఎక్కువ వాడుకలో ఉంది. ఈ యాస బహు ప్రాచుర్యం పొందింది.[1][2] ముఖ్యంగా తెలుగు సినిమాలో ఈ యాసకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.గోదావరి యాసలో ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో ఒక భాగమైంది.[3]

యాస మార్చు

  • రేవు - తీరం.
  • గోదారి - గోదావరి నది
  • లంక - దీవి
  • డిబ్బ - నది పరీవాహకం వల్ల లంకలో ఏర్పడిన చిన్న మైదానం
  • మేట - పెద్ద డిబ్బ
  • పేట/పాలెం - పల్లె,పట్టణం.
  • కోత - గోదారి తాకిడి లేదా వరదకి నేల (మైదాన ప్రాంతం) అరిగి పోవడం.

గోదావరి యాస సంభాషణ మార్చు

  • నేను ముందే సెప్పేను. సంతకెళ్ళి సేపలట్రమ్మంటే సింతసిగురట్టుకొచ్చి పులుసెట్టమన్నాడు.
  • అటేపు ఎల్లొద్దంటే అటేపేఎల్తానంటాడు.
  • తేన్లో నిమ్మరసం పిండి పొద్దేల పరగడుపునే ఏణ్ణీళ్ళతో తాగితే మంచిదంట.
  • ఆడ్ని గోకితే ఊరుకుంటాడా మద్దిలోకెల్లిన ఆడ్ని నిన్ను ఇద్దర్నీ ఇరగతన్నేడు.
  • ఈ మాయదారి ఇంగిలీసు సదువులొచ్చి పడ్డాక మా పిలకాయలు కూడా మా యాస మర్సిపోతన్నారండి.

గోదారోళ్ల కితకితలు సమూహం మార్చు

గోదారోళ్లకే సొంతమైన ప్రత్యేక యాస,భాషలను, అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను ఈ తరం వారికీ పరిచయం చేయడం కోసం ఫేస్ బుక్ లో గోదారోళ్ల కితకితలు గ్రూప్‌ 2016లో ఈవీవీ సత్యనారాయణ ఏర్పాటు చేశారు.గ్రూప్లో సభ్యుల దాదాపు రెండు లక్షల యాభై వేల ఉన్నారు. వీరంతా ఏటా ఒక్కసారి కలుస్తున్నారు.ఇప్పటి వరకు నాలుగో ఆత్మీయ సమ్మేళనం జరిగాయి.[4]నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్ ఆంధ్రా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో నమోదైంది. భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ చీఫ్‌ ఎడిటర్‌ కె.అన్నపూర్ణ గ్రూప్‌ అడ్మిన్‌ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

సినిమా సంభాషణలు మార్చు

  • ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాలరావు గోదావరి యాసలో మాట్లాడి ప్రేక్షకుల చేత థియేటర్ లలో ఈలలు వేయించుకొన్నారు.[5]
  • సూర్యుడికి ఎదురుగా డాబామీద నుంచొని జరీపంచే మీద సిల్కు లాల్చీ, దానిమీద కండువా వేసుకుని ఠీవిగా తల పైకెత్తి, నారాయుడనేవాణ్ణి హత్యచేయించి, శవాన్ని కారు డిక్కీలో తేసుకొచ్చిన సెక్రెటరీతో అబ్బా సెగెట్రీ ! ఎప్పుడూ పనులూ, బిగినెస్సేనా.
  • పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్యక్ష నారాయుడి సేవ జేసుకోవద్దూ.
  • కళ్ళెట్టుకు సూడు. పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశంలో. సూరీడు నెత్తురు గడ్డలా లేడూ. .
  • ఉట్టినే తిని తొంగుంటే మడిసికీ, గొడ్డుకీ తేడా ఏటుంటది.
  • ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల.
  • తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది.
  • సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.

రంగస్థలం (సినిమా) మార్చు

  • మా ఇంజిన్‌కు కులం గోత్రాలు ఉండవు. ఏ సేనైనా తడిపెత్తదంతే'
  • 'అయ్. నా పేరు సిట్టిబాబు అండి. నన్ను అందరూ సౌండ్ ఇంజనీర్ అంటారండి.
  • కుమార్ బాబుకు సిట్టిబాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడండి వాడిని ముట్టుకోవాలంటే,ఈ సిట్టిబాబుగాడి గుండెకాయ దాటి యెల్లాలే.[6][7]

మూలాలు మార్చు

  1. "Developing villages with the help of local youth | godavari kala seva samithi". Retrieved 2020-01-02.
  2. "'తూగోజి' యాస, భాషల సొగసు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2020-01-02.
  3. "తెలుగు అందం కనిపించాలి". www.teluguvelugu.in. Retrieved 2020-01-02.[permanent dead link]
  4. "రికార్డులకెక్కిన 'గోదారోళ్ల కితకితలు'". Sakshi. 2019-09-09. Retrieved 2021-11-07.
  5. "కొంపలు కూల్చే కాంట్రాక్టర్.. రావు గోపాలరావు!". సితార. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.
  6. "భాష మురి‌సేలా.‌.‌ యాస మెరి‌సేలా!". సితార. Archived from the original on 2020-01-02. Retrieved 2020-01-02.
  7. Kumar, Bojja (2018-03-19). "'రంగస్థలం' ట్రైలర్ జోరు మామూలుగా లేదుగా..... అసలేముందని ఇంత ఆసక్తి?". telugu.filmibeat.com. Retrieved 2020-01-02.