గోపీనాథ్ బొర్దొలాయి

అస్సాం ముఖ్యమంత్రి

గోపీనాధ్ బొర్దొలాయి (1890-1950) స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, అస్సాంకు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

గోపీనాధ్ బొర్దొలాయి
గోపీనాథ్ బొర్దొలాయి


వ్యక్తిగత వివరాలు

జననం (1890-06-06)1890 జూన్ 6
రోహా, అస్సాం
మరణం 1950 ఆగస్టు 5(1950-08-05) (వయస్సు 60)
గౌహాతి, అస్సాం
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి సురవల బొర్దొలాయి
వృత్తి ముఖ్యమంత్రి, రాజకీయవేత్త, రచయిత
మతం హిందూ
పురస్కారాలు భారతరత్న (1999)

1930ల నుండి కాంగ్రేసు పార్టీలో వివిధ శ్రేణులలో పనిచేసి ఎదిగిన బొర్దొలాయి తొలి ప్రముఖ పోరాటము బెంగాల్ ముస్లింలు హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న అస్సాంను ముస్లిం-ఆధిక్య పాకిస్తాన్లో కలపమని కోరడముతో ప్రారంభమైనది. నిరసన ప్రదర్శనలను నిర్వహించడము, అత్యున్నత స్థాయిలో సామ్రాజ్యవాద ప్రభుత్వముతో చర్చలు జరపడముతో అస్సాంలో మత కల్లోలాలు జరగకుండా అడ్డుకున్నాడు, భారతదేశములో అంతర్గతంగా అస్సాం సీమా సురక్షితను పరిరక్షించాడు.

భారత స్వాతంత్ర్యము తర్వాత, ఈయన కమ్యూనిష్ఠు చైనా, తూర్పు పాకిస్తాన్ ల నుండి అస్సాంను రక్షించడానికి సర్దార్ వల్లభభాయి పటేల్తో సన్నిహితంగా పనిచేశాడు. విస్తృతమైన హింసాకాండ మూలముగా తూర్పు పాకిస్తాన్ నుండి పారిపోయి వచ్చిన లక్షల కొలది కాందిశీకులను తిరిగి పంపే పని నిర్వహించాడు. ఈయన కృషి 1971 లో తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటము జరిగే వరకు అస్సాం రాష్ట్రములో స్థిరత్వము యేర్పడి మత సామరస్యముతో ప్రజస్వామ్యము నిలదొక్కుకోవడానికి దోహదము చేసింది. ఈయనను 1999లో మరణానంతరము భారత ప్రభుత్వము భారత రత్న పురస్కారముతో గౌరవించింది. గౌహతి విమానాశ్రయానికి లోకప్రియ గోపీనాధ్ బొర్దొలాయి అంతర్జాతీయ విమానాశ్రయముగా నామకరణము చేశారు.