గౌస్ బేగ్ సాహెబ్

గౌస్ బేగ్ సాహెబ్

జననం - బాల్యం మార్చు

జనాబ్ గౌస్ బేగ్ సాహెబ్ ప్రకాశం జిల్లా, చీరాల మండలం, గంటాయపాలెంలో హాజీమొద్దీన్ బేగ్, శ్రీమతి ఫాతిమా దంపతులకు 1885 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు. బేగ్ తాతగారు దిలావర్ బేగ్కు చీరాలకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ఓడరెవులో ఆయన ఓడలు ఉండేవి. పెద్ద ఎత్తున వ్యాపరం చేసేవారు, బేగ్ తండ్రి హయాంలో ఓడరేవు వ్యాపారం స్తంభించింది. కాని బాగా ఆస్తి మిగిలింది. ఇదంతా గౌస్ బేగ్ జాతీయొద్యమం లోకి ప్రవేశించాక హారతి కర్పూరం లా కరిగిపోయింది.

చీరాల ఉద్యమం మార్చు

1920లో గోపాలకృష్ణయ్యతో కలిసి కలకత్తా కాంగ్రెస్ సమవేశానికి హాజరు కావడంతో గౌస్ రాజకీయ జీవితం ప్రారంభమయింది. ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య - పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు.

పన్నులనిరాకరణ ఉద్యమం మార్చు

1921లో మహాత్ముడు పన్నుల నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇది దేశవ్యాప్తంగా జరిగినా మొదలు నిర్ణయం తీసుకున్న ప్రాంతాలలో జరగాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ దీనిని పెదనందిపాడు ఫిర్కాలో ప్రారంభించాలని తీర్మానించింది. ఆ వెంటనే ప్రభుత్వం నాయకులను బంధించింది. ఆ తరువాత పెదనందిపాడు ఫిర్కాలో నాయుదు పర్వతనేని చౌదరి ఈ కార్యక్రమం చేపట్టారు. వందగ్రామాలలో గ్రమోద్యోగులు లేకుండా పరిపాలన బందు అయింది. వీరయ్య చౌదరి గుర్రం ఎక్కి, గ్రామాలన్నీ తనిఖీ చెస్తూ దళాధిపతిగా తిరిగి, ప్రజలను సమావేశపరిచి ఎవ్వరూ పన్నులు కట్టకుండా చేశారు. ఆ పోరాటంలో గౌస్ బేగ్, పర్వతనేని సహచరుడిగా వ్యవహరించారు. ఆ అణచివెతలో భాగంగా గౌస్ బేగ్ ను అరెస్టు చేసి, సంవత్సరం జైలు, వెయ్యి రుపాయలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపొవడంతో ఆయన భార్య శ్రీమతి ఖాతూన్ తన బంగారు ఆభరణాలను విక్రయించి ఆ డబ్బు చెల్లించింది.