గ్యాంగ్ లీడర్

1991 సినిమా

గ్యాంగ్ లీడర్, విజయ బాపినీడు దర్శకత్వంలో 1991లో మే 9న విడుదలైన తెలుగు సినిమా. చిరంజీవి, విజయశాంతి ఇందులో ప్రధాన పాత్రధారులు. చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ చిత్రం విజయం చాలా దోహదం చేసింది.[1]

‌గ్యాంగ్‌లీడర్
దర్శకత్వంవిజయ బాపినీడు
రచనవిజయ బాపినీడు (కథ, చిత్రానువాదం), పరుచూరి సోదరులు (సంభాషణలు)
నిర్మాతమాగంటి రవీంద్రనాధ్ చౌదరి
తారాగణంచిరంజీవి,
విజయశాంతి,
మాగంటి మురళీమోహన్,
రావు గోపాలరావు,
అల్లు రామలింగయ్య
సంగీతంబప్పీలహరి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1991 మే 9 (1991-05-09)
భాషతెలుగు

కథ సవరించు

రఘుపతి (మురళీ మోహన్), రాఘవ (శరత్ కుమార్), రాజారాం (చిరంజీవి) ముగ్గురూ అన్నదమ్ములు. కుటుంబంలో రఘుపతి ఒక్కడే ఉద్యోగస్తుడు. కుటుంబాన్నంతా పోషిస్తుంటాడు. రాఘవ ఐ. ఎ. ఎస్ అవడానికి ప్రయత్నిస్తుంటాడు. రాజారాం మాత్రం స్నేహితులతో కలిసి సరదాగా కాలం గడిపేస్తుంటాడు.

తారాగణం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

విశేషాలు సవరించు

 • ఈ సినిమా 100 రోజుల ఉత్సవం చిరజీవి పుట్టినరోజునాడు పెద్దయెత్తున జరిపారు. తిరుపతి, హైదరాబాదు, ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు ఈ శతదినోత్సవం జరిపారు. ప్రత్యేక విమానాన్ని వాడారు.[2]
 • ఈ సినిమా 100 రోజుల ఉత్సవాన్ని అప్పుల అప్పారావు సినిమాలో చూపారు.
 • ఆజ్ కా గూండారాజ్ అనే పేరుతో ఈ సినిమాను హిందీలో పునర్నిర్మాణం చేపట్టారు.
 • చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తాను అన్న డైలాగు ఈ చిత్రంలోనిదే

పాటలు సవరించు

 1. పాప రీటా .. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
 2. పాలబుగ్గ - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి సుందర రామమూర్తి
 3. భద్రాచలం కొండ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
 4. వానా.. వానా.. .. - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర
 5. వయసు వయసు - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: వేటూరి
 6. పనిసా ససా - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర - రచన: భువన చంద్ర

బయటి లింకులు సవరించు

 1. HMTV (9 May 2021). "చిరంజీవికి మాస్ ఇమేజ్ తెచ్చిన గ్యాంగ్ లీడర్." Archived from the original on 1 June 2022. Retrieved 1 June 2022.
 2. "సిఫీ వార్త". Archived from the original on 2007-09-30. Retrieved 2008-09-09.