గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్

గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చార్లేస్స్ డికెన్స్ చే రచింపబడిన ఒక నవల. ఆల్ ది ఇయర్ రౌండ్ అనే పబ్లికేషన్ లో 1861 డిసెంబర్ నుండి 1861 ఆగష్టు వరకుసీరియల్గా అచ్చు కాబడింది. ఇప్పటివరకు ఇది 250 సార్లు రంగస్థలం ఫై మరియు తెరపై ప్రదర్శింపబడింది.[1]

Great Expectations
దస్త్రం:Greatexpectations.png
Cover of first edition volumes, July 1861
రచయితCharles Dickens
దేశం United Kingdom
భాషEnglish
SeriesWeekly:
December 1, 1860 – August 3, 1861
శైలిFiction Social criticism
ప్రచురణ కర్తChapman & Hall
ప్రచురణ తేది1861 (in three volumes)
Media typePrint (Serial, Hardback, and Paperback)
పేజీలు799 pp (hardback)
ISBNN/A
Preceded byA Tale of Two Cities
Followed byOur Mutual Friend

గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ బిల్దంగ్శ్రోమన్ శైలిలో రచించబడింది. స్త్రీ కానీ, పురుషుడు కానీ,పరిణతి చెందాలనే తాపత్రయం సాధారణంగా చిన్నతనం నుండి ఉంటుంది కానీ ఆ క్రమం ముఖ్య భూమిక పెద్దతనంలో వెళ్లి ఆగుతుందని ఈ కథనం సాగుతుంది. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఒక అనాథకథ. అతని జీవితం గురించి మరియు ఏ విధంగా అతను మంచి వ్యక్తిగా మారతాడు అన్నది రచనలోని ఇతివృత్తం. దాదాపుగా చాలావరకు అతను చేసిన పనులు, అతని జీవితం మరియు మనుషులను పోలి ఉంటుంది కాబట్టి, ఈ నవల పాక్షికంగా డికెన్స్ ఆత్మకథగా కూడా పరిగణన లోకి తీసుకోబడుతుంది.

గ్రేట్ఎక్స్పెక్టేషన్స్ లోని కథ యొక్క ముఖ్య ఇతివృత్తం మొత్తం 1812 క్రిస్టమస్ పండుగకు ముందు నుండి అంటే ప్రోటగోనిస్ట్ ౭ సంవత్సరాల వయస్సు నుండి (డికెన్స్ పుట్టిన సంవత్సరం లోనే) 1840 సంవత్సరం లోపల నడుస్తుంది.[2]

కథా సారాంశంసవరించు

1812 క్రిస్మస్ రోజున పిప్ అనే ఏడు సంవత్సరాల పిల్లవాడు చర్చి ప్రదేశంలో తల్లిదండ్రుల సమాధుల వద్దకు వచ్చినపుడు పారిపోయిన ఒక అపరాధిని కలవడం జరుగుతుంది. ఆ అపరాధి పిల్లవాడిని అతని కోసం ఆహారం దొంగిలించి తెమ్మని, తన కాళ్ళకున్న బంధనాలు పగలగొట్టదానికి ఆయుధం తెమ్మని భయపెడతాడు. పైగా ఎవరికీ ఏమి చెప్పకూడదని, అంతేకాక అతను చెప్పినట్లే వినాలని, అలా చేయకపోతే తన స్నేహితుడు పిప్ ప్రాణం తీస్తాడని బెదిరిస్తాడు పిప్ ఇంటికి తిరిగి వచ్చాడు. పిప్ తన అక్క మరియు ఆమె భర్తతో కలిసి నివసిస్తుంటాడు. అతని అక్క చాలా క్రూరురాలు. అతనిని తరచుగా కొడుతూ ఉంటుంది. కానీ జో మాత్రం పిప్ తో చాలా దయతో ఉంటాడు . తరువాతి రోజు తెల్లవారుఝామునే పిప్ తన ఇంటి వంటగది నుండి ఆహారాన్నిమరియు మద్యాన్ని (క్రిస్మస్ కోసం పండుగ కోసం తయారు చేసి ఉంచిన పిండివంటలు కూడా) దొంగిలించి సమాధుల ప్రదేశానికి చల్లగా జారుకుంటాడు. పిప్ జీవితంలో తప్పు చేయడం ఇదే మొదటిసారి. పుస్తకంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఎందుకంటే అపరాధి పిప్ అతని పట్ల చూపించిన దయను (బలవంతంగా అయినా) ఎప్పటికీ మరచిపోడు. అపరాధి తన కృతజ్ఞత తెలుపుకోవడానికి చాలా సంవత్సరాలు వేచి చూస్తాడు.

మినిస్టర్, మిస్టర్ వొస్ల్, మరియు మిస్టర్ మరియు మిస్సెస్ హబ్బ్లె, మరియు అంకుల్ పంబుల్ షూక్, పిప్ మరియు మిస్టర్ మరియు మిస్సెస్ జో క్రిస్మస్ పార్టీ జరుపుకుంటున్నారు. వీరిలో ఎవరు కూడా అంకుల్ పంబుల్ షూక్ బ్రాంది త్రాగి ఉమ్మేసేవరకు ఆహారం కానీ మద్యం కానీ లేని విషయం గమనించలేదు. అప్పుడు పిప్ కు గుర్తు వస్తుంది తను బ్రాంది జుగ్ లో మాములు నీరు కాకుండా తారు నీటితో నింపి ఉంచానని. వచ్చిన చుట్టాలందరూ పిప్ ను అదృష్టవంతుడని పొగుడుతున్నారు. కానీ పిప్ ఎవరైనా ఆహారపదార్ధాలు కనిపించటం లేదని తెలుసుకుంటారేమోనని భయంతో టేబుల్ కాలును గట్టిగ పట్టుకుని కూర్చుంటాడు. ఎప్పుడైతే జో పిండివంటలు తేవడానికి వంటగది వైపు వెళ్తుందో పిప్ కూడా వెనకాలే వెళ్లి బయట నుండి తలుపు గడియ పెట్టేస్తాడు. చివరికి పోలీసు ఆఫీసర్లు అతని దారిని అడ్డుకుంటారు. వాళ్ళు జోను బేడిలను బాగుచేసి ఇమ్మని అడుగుతారు. అంతేకాక, జో, పిప్ మరియు మిస్టర్ వొస్లెను వారితో వచ్చి అక్కడి స్థానిక జైలు నుండి పారిపోఇన ఖైదీలను వెతకడంలో తమకు సహాయం చేయమని అడుగుతారు. గ్రామం బైట బురదగా ఉన్న దారుల వెంట బడి వెతకడం మొదలుపెట్టారు. గొడవ పడుతున్న ఇద్దరు అపరాధులను పిలిచారు. ఇద్దరు అపరాధులలో ఒకరు పిప్ ద్వారా సహాయం పొందిన వాడు. అతనికి ఆహారం ఆయుధం ఎక్కడినుండి వచ్చాయని నిలదీస్తారు. పిప్ ను రక్షించడానికి తనే దొంగతనం చేసానని చెప్తాడు. పోలీసులు అపరాధులిద్దరిని జైలుకు తీసుకు వెళతారు, పిప్ జో వెంట ఇంటికి వెళ్లి క్రిస్మస్ డిన్నర్ లో పాలు పంచుకుంటాడు. అపరాధిని కలిసిన మరునిముషంలోనే పిప్ జీవితం మళ్లీ సాధారణ స్థాయికి వచ్చేసింది. స్కూల్ కి వెళ్తాడు, మిస్టర్ వోసేల్స్ యొక్క ఆంటీ వెనక పరిగెడతాడు,వోసేల్స్ దత్తు తీసుకున్న అనాథ పిల్లవాడు బిడ్డితో స్నేహం చేస్తాడు. జీవితం సాధారణ స్థాయికి వచ్చేసినా కానీ, అతని మనసులో నుండి అపరాధ భావన పోలేదు. పిప్ అంకుల్ పంబుల్ షూక్ అతడిని ఒక గ్రామంలో సాటిస్ హవుస్ లో నివసించే మిస్ హేవిషం అనబడే ఒక ధనిక వృద్ధ మహిళా ఇంటికి ఆహ్వానిస్తాడు. మిస్ హవిషం ఒంటి చెప్పుతో పాత పెళ్ళి కూతురు దుస్తులు వేసుకున్న ఒక కన్య.ఆమె ఇంట్లోని గడియారాలన్నీ ఇరవై నిముషాలు తక్కువ తొమ్మిది వద్ద ఆగిపొఇ ఉన్నాయ్. హృదయం ముక్కలైనదని చెబుతుంది. ఆ కారణంగా ఆమె కొన్ని సంవత్సరాలుగా సూర్య రశ్మి ఎరుగదు. కేవలం పిప్, ఆమె పెంచుకున్న చిన్న పిల్ల ఎస్తేల్లతో కలిసి పేకలు ఆడితే చూడాలని మాత్రం కోరుకుంటుంది.

 
ఎస్తేల్ల మరియు పిపతో ఉన్న కుమారి.హవిషం H. M. బరాక్ గీసిన చిత్రం

మొదటిసారి కలిసిన తర్వాత, మానసికంగా ఆకర్షణకు లోనై పిప్ తరచుగా మిస్ హేవిషం మరియు ఎస్టేల్లాను కలిసేవాడు. తనని కేవలం ఒక పనిపిల్లవాడిగా చూసే ఎస్టేల్లా అభిమానం చూరగొనడానికి పట్టుదలతో స్కూల్ లో బిడ్డీ నుండి అన్నివిషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు, పబ్ అనే టౌన్ కు జోను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, పిప్ కలిసిన అపరాధి పంపిన సందేశకుడిని కలవడం జరుగుతుంది. దొంగిలించి తెచ్చిన ఫైల్ తో తన దగ్గరున్న మద్యాన్ని కలుపుతాడు మరియు పిప్ కు వెళ్ళిపోయే ముందు పిప్ కు రెండు పౌండ్లు ఇస్తాడు. పిప్ మిస్ హేవిషం పుట్టినరోజు రోజున ఆమెను కలవడానికి వెళతాడు. అక్కడ ఆమె అతనికి ఎలుకలు తినేసిన ఆమె పెళ్ళి కేకును, చావు గురించిన ముందు చూపుతో ఆమె చనిపోతే ఎక్కడ పడుకుంటుందో ఆ ప్రదేశాన్ని చూపిస్తుంది. అతను పాకెట్స్ ను కూడా కలుస్తాడు.

పిప్ జోతో కలిసి ఇనుప కొలిమి పనిచేసేవాడు. కానీ ఆ పని అంటే అతనికి అయిష్టం. మిస్ హవిషం పుట్టినరోజున ఒకపూట సెలవు తీసుకుని ఆమెని కలిసి వస్తానని జోతో ఒప్పందం చేసుకుంటాడు. అతను మరియు జో ఇరువురు కలిసి ఆర్లిక్ అనే పేరు గల ఒక ప్రయనికుదితో కలిసి పనిచేస్తారు. అతను ఇంటికి వచ్చిన తర్వాత జో మీద దాడి జరిగిందని తెలుసుకుంటాడు. ఆమె మెదడుకు భయంకరమైన దెబ్బ తగులుతుంది. పోలీసులు జో మీద దాడి చేసింది పరిపొఇన నేరస్థులు అయి ఉండవచ్చని అభిప్రాయ పడుతుంటే పిప్ కు మళ్లీ తప్పు చేసినట్టుగా లోనుండి భావన వచ్చింది. లండన్ నుండి వచ్చిన డిటెక్టివ్ లు అనుభవరాహిత్యం వలన ఏమీ కనుగొనలేకపోయారు. మిస్సెస్ జో ఆర్లిక్ ను పిలుచుకురావడం లోను, అతనికి పలక మీద "టి"ను వరించడం లోను తన రోజులు గడుపుతుంది.

"T" అక్షరం ఆకారం ఒక సుత్తిని పోలి ఉంటుంది కాబట్టి, జో ఫై దాడి చేసింది ఆర్లిక్ అయి ఉంటాడని బిడ్డీ ఆలోచిస్తుంటాడు. ఆర్లిక్ వచ్చినపుడు, మిస్సెస్ జో అతనికి పలక చూపించి సంతోషపెట్టాలని చూస్తుంది. బిడ్డీ గార్జేరీతో కలిసి లోనికి వస్తాడు. పిప్ ఆమెను తన విశ్వసించి తనకు ఎస్టేల్లా మీద తనకున్న భావనలను తెలుపుతాడు. మిస్టర్ వొస్సేల్ వార్తాపత్రిక నుండి హత్యాప్రయత్నాల గురించి చదువుతుంటే పిప్ మరియు జో ఆలకిస్తూ ఉంటారు. జేగ్గర్స్ అనే ఒక లండన్ లాయర్ పిప్ ను కలిసి చెప్పిన వార్తను విని పిప్ ఉలికి పడతాడు. ఆ వార్త ఈవిధంగా ఉంది: పేరు తెలియని ఒక వ్యక్తి నుండి పిప్ కు పెద్ద మొత్తంలో సొమ్ము వారసత్వంగా రాబోతుంది. ఆ డబ్బు ఇవ్వడానికి షరతులు ఏవంటే, అతను అత్యవసరంగా లండన్ వదిలి పెట్టి వెళ్లిపోవాలి, కొన్ని బట్టలు కొనుక్కుని జెంటిల్ మాన్ అయిపోవాలి.

పిప్ సమాజంలో చాలా చెడ్డగా ప్రవర్తించాడు (ముఖ్యంగా ఎస్టేల్లా మీద ఈర్ష్యతో) అంతేకాక, వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేసాడు, అప్పుల్లో కూరుకు పోయాడు. అతని 21వ పుట్టినరోజున విడుదలయ్యాడు అప్పుడు అతన్ని జేగ్గర్స్ చూడటం తటస్థించింది. అతను పిప్ కు 500 పౌండ్ల (ఈరోజు £<st.కు సమానం) రూపాయలను బహుకరించడమే కాకుండా అతని విద్యా అలవెన్స్ ను కూడా పెంచాడు. ఈ విధంగా శ్రేయోభిలాషి ప్రత్యక్షం అయ్యేవరకు నడచింది.

దస్త్రం:Pip-magwitch.jpg
మగ్విచ్ తనకి తానుగా పిప్ కి తెలిసినట్లు చేసుకున్నాడు

పిప్ చాలా సంవత్సరాల వరకు అతని నమ్మకం అతని శ్రేయోభిలాషి మిస్ హేవిషం అనే. (చదువరి కూడా అదే విషయాన్నినమ్మవచ్చు). అతను జెంటిల్ మాన్ వలె ఎలా ఉండాలో నేర్చుకోవడం ప్రారంభించాడు. అతనికి సహచరుడు, ఇప్పుడిప్పుడే పెద్దవాడవుతున్న హెర్బర్ట్ పాకెట్ సహాయం కూడా తీసుకున్నాడు. ఈ సమయంలోనే మిస్సెస్ జో మరణించింది. ఏది ఏమైనా డికెన్స్ అల్లిన కథలోని మెలిక ఏంటంటే, పిప్ శ్రేయోభిలాషి మేగ్ విచ్ అనే వ్యక్తి. అతను పిప్ ఒకప్పుడు సహాయం చేసిన అపరాధి. అతను న్యూ సౌత్ వేల్స్కు వెళ్లి అక్కడ బాగా డబ్బు గడించి సంపన్నుడయ్యాడు.

మేగ్ విచ్ అతని స్మపదనంతా పిప్ పేరుతో వ్రాసాడు. కారణం, పిప్ అతనికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మాత్రమే కాకా, పిప్ అతని చనిపొఇన కొడుకులాగా అనిపించడమే. అతను చూపించిన అభిమానానికి పిప్ కదిలిపోయాడు. గతంలో మేగ్ విచ్ నేర జీవితం గురించి సిగ్గుపడినా, మేగ్ విచ్ ఇప్పుడు తన శేష జీవితాన్ని పిప్ తో కలిసి గడపలనుకుంటున్నాడు. పిప్ కు అతనితో కలిసి ఉండటం ఇష్టం లేకున్నా ఒప్పుకుంటాడు. మేగ్ విచ్ పేరు మీద ఇంగ్లాండ్ లో అరెస్ట్ వారెంట్ ఉంది. అతను దొరికితే ఉరి తీస్తారు. సందర్భానుసారంగా, మేగ్ విచ్ చట్టం నుండి పరిపొఇన ఖైదీ,

ఈ సందర్భాలలో, పిప్ కు ఎస్టేల్లా జేగ్గర్స్ ఇంటి పనిమనిషి మోళీ కూతురు అని,జేగ్గర్ ఆమె మీద ఉన్న హత్యా నేరం గురించి వాదిస్తున్నాడని, ఆమె తన కూతురిని వదిలి వేస్తే ఆ పిల్లను అతని క్లైంట్ ఐన మిస్ హేవిషం అతనికి ఇవ్వవలసిన ఫీజుకు బదులుగా దత్తు తీసుకున్నారని తెలుసుకుంటాడు. పిప్ కు తర్వాత తెలుస్తుంది ఎస్టేల్లా తండ్రి మేగ్ విచ్ అని.

పిప్ కు ఆర్లిక్ తో జరిగిన సంఘర్షణలో అతని అక్క పై దాడి చేసింది తనే అని ఆర్లిక్ స్వయంగా ఒప్పుకుంటాడు.

ఈ మధ్యలో, ఎస్టేల్లా బెంట్లీ ద్రంపుల్ ను పెళ్ళి చేసుకుంటుంది, ఈ పెళ్ళి ఒక అసంతోషకరమైన విషయం. పిప్ మేగ్ విచ్ తో వెళ్ళిపోయే ముందు చివరిసారిగా మిస్ హేవిషాన్ని కలుస్తాడు. అతని హృదయాన్ని ముక్కలు చేసేలా ఎస్టేల్లాను క్రురంగా తాయారుచేసింది తానేనని ఒప్పుకుని బాధపడి పిప్ ను క్షమించమని వేడుకుంటుంది. పిప్ మిస్ హేవిషాన్ని ఎస్టేల్లా చేసిన ప గురించి తెలియచేయడానికి, ఆమె ఇష్టం లేని పెళ్ళి గురించి మాట్లాడటానికి, దీనికి కారణం ఐన ఎస్టేల్లాలో ప్రేమరహిత్యాన్ని నింపిన మిస్ హేవిషం మీద నిండా మోపడానికి వెళతాడు. సంఘర్షణ వేడిగా సాగుతుండగా, మిస్ హేవిషం మంటకు దగ్గరగా నుంచుని ఉంది. ఆమె బట్టలకు నిప్పు అంటుకుంది. పిప్ హీరో లాగా ఆమెని రక్షించాడు కానీ, కాలిన గాయాలతో ఆమె తర్వాత మరణించింది.

పిప్, హెర్బర్ట్ మరియు ఇంకొక స్నేహితుడు స్టార్టప్ కలిసి సాహసంతో మేగ్ విచ్ పారిపోవడానికి సహాయం చేసారు కానీ అతను పరిపోలేకపోయాడు. పోలీసులు పట్టుకుని అతన్ని జైలుకు పంపారు. మేగ్ విచ్ లో ఒక మంచి మరియు ఉదాతమైన వ్యక్తిని గుర్తించి పిప్ అతని మీద భక్తి ఏర్పడింది. పిప్ మేగ్ విచ్ ను విడుదల చెఇన్చదనికి శాయశక్తుల కృషి చేసాడు కానీ విచారణకు కొద్ది రోజుల ముందే అతను మరణించాడు. ఇంగ్లీష్ చట్టం ప్రకారం, మేగ్ విచ్ సంపద మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది. అక్కడితో పిప్ యొక్క "గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్"కు తెర పడుతుంది.

అతను ఆరోగ్యం బాగోలేక చాలా కాలం పాటు జో సంరక్షణలో ఉంటాడు. ఆరోగ్యం బాగైన తర్వాత బిడ్డీ క్షమాభిక్షను, ప్రేమను అడగడానికి ఇంటికి తిరిగి వస్తాడు. తీరా అతను వచ్చి చూసేసరికి ఆరోజు బిడ్డీ మరియు జోల పెళ్ళి రోజు. ఆరోగ్యం బాగోలేనప్పుడు జోతో బిడ్డీ గురించి తన అభిప్రాయాన్ని పంచుకోనందుకు ఊపిరి పీల్చుకుని వారి జంటకు అభినందనలు తెలుపుతాడు. పిమ్మట, పిప్ హెర్బర్ట్ తో కలిసి వ్యాపారం కోసం సముద్రాలు దాటి వెళతాడు. పదకొండు సంవత్సరాల పాటు గడిపిన తర్వాత, పిప్ తిరిగి జోను అతని కుటుంబాన్ని చూడటానికి మారిషెస్ వెళతాడు.

నిజమైన ముగింపుసవరించు

పిప్ ఎస్టేల్లాను వీధులలో కలుస్తాడు. ఆమె భర్త ద్రంలె చెడ్డవాడు. అతను చనిపోయాడు. ఇప్పుడు ఆమె ఒక డాక్టర్ ను వివాహం చేసుకుంది. పిప్ మరియు ఎస్టేల్లా పరస్పరం వారికి సంబంధించిన సంతోషాలను పంచుకున్నారు. చివరకు ఎస్టేల్లాను దక్కించుకో లేక పోయనంటాడు పిప్. కనీసం ఆమె ఇప్పుడు అదివరకు మిస్ హేవిషం పెంచిన పాషాణ హృదయం కల అమ్మాయిలానే ఉండకుండా మారినందుకు సంతోషిస్తాడు. బాధ అనేది మిస్ హేవిషం ప్రబోధనల కన్నా బలమైనది. నాకంటూ అప్పుడొక హృదయం ఉండేది దాన్ని ఆమెకి అర్ధం చేసుకోవడానికి ఇచ్చేసాను అనడంతో నవల ముగుస్తుంది.

నిజమైన ముగింపు లోని పూర్తి సారాంశం:

'It was two years more before I saw herself. I had heard of her as leading a most unhappy life, and as being separated from her husband, who had used her with great cruelty, and who had become quite renowned as a compound of pride, brutality, and meanness. I had heard of the death of her husband from an accident consequent on ill-treating a horse, and of her being married again to a Shropshire doctor who, against his interest, had once very manfully interposed on an occasion when he was in professional attendance upon Mr. Drummle, and had witnessed some outrageous treatment of her. I had heard that the Shropshire doctor was not rich, and that they lived on her own personal fortune. I was in England again - in London, and walking along Piccadilly with little Pip - when a servant came running after me to ask would I step back to a lady in a , for in her face and in her voice, and in her touch, she gave me the assurance that suffering had been stronger than Miss Havisham's teaching, and had given her a heart to understand what my heart used to be.

—New American Classics edition published by New American Library, copyright 1963

ఈ కథ 1841 లో ముగుస్తుంది.

సవరించబడిన ముగింపుసవరించు

పిప్ మరియు ఎస్టేల్లా ఇద్దరు మళ్లీ శిథిలమై పాయిన సతిస్ హవుస్ దగ్గర కలుస్తారు. ఆమె వివాహం ఐ పోయింది పైగా బిడ్డను కనబోతున్న దాని వలె కనిపిస్తుంది అందుకే ఆమె పిప్ తనను స్నేహితురాలిగా చూడాలని కోరుకుంటుంది. ఎస్టేల్లా మరియు పిప్ ఎప్పటికైనా కలుస్తారేమో అనే ఆలోచన లేకుండా ఈ విధంగా ముగింపు ఉంటుంది.

"We are friends," said I, rising and bending over her, as she rose from the bench. "And will continue friends apart". I took her hand in mine, and we went out of the ruined place; and, as the morning mists had risen long ago when I first left the forge, so the evening mists were rising now, and in all the broad expanse of tranquil light they showed to me, I saw no shadow of another parting from her.[3]

—Charles Dickens, Great Expectations

గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ లో ముఖ్య పాత్రలుసవరించు

పిప్ మరియు అతని కుటుంబంసవరించు

 • ఫిలిప్ పిర్రిప్, ఒక అనాథ మరియు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ యొక్కకథానాయకుడు చిన్నతనం అంతా కూడా పిప్ కమ్మరి శిక్షణ తీసుకుంటాను అనుకొనేవాడు. కానీ ఎటువంటి సంబంధం లేకపోఇనా కూడా మెగ్ విచ్ పోషణాభారం తీసుకోవడం వలన పిప్ లండన్ కు వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా జెంటిల్ మాన్ కూడా అయ్యాడు.
 • జో గార్జేరీ,పిప్ బావగారు మరియు అతని మొదటి తండ్రి ఫిగర్. ఒక కమ్మరి పిప్ మీద ఎంతో దయతో ఉండేవాడు అలాగే పిప్ కూడా అతని పట్ల నిజాయితితో ప్రవర్తించేవాడు. కమ్మరి అవ్వకుండా జెంటిల్ మాన్ అవ్వడానికి పిప్ లండన్ వెళ్ళదానికి నిర్ణయము తిసుకున్నపుడు జో ఎంతో బాధపడతాడు.
 • మిస్టర్ జో గార్జేరీ, పిప్ యొక్క కోపిష్టి అక్క తల్లిదండ్రులు చనిపొఇన తర్వాత పిప్ ను పెంచే బాధ్యత తీసుకున్నా అనవసర బాధ్యత నెత్తిన పడిందని ఎప్పుడు చిరాకు పడుతూనే ఉండేది. ఆర్లిక్ ఆమె భర్తచే నియమించబడిన వాడు, ఆమె ఫై దాడి చేస్తే ఆమె చనిపోయేవరకు అంగవైకల్యం తోనే ఉంటుంది.
 • మిస్టర్ పంబుల్ షూక్, జో గార్జేరీ అంకుల్, ఒక అధికారి బ్రహ్మచారి మరియు మొక్కజొన్న వ్యాపారి. పిప్ ను డిస్ డేయిన్ లో పెట్టినప్పుడు, అతను మిస్టర్ జోకు ఆమె ఎంత బాగా పెంచిందో చెబుతాడు. మొదటిసారిగా ఎవరైతే పిప్ ను మిస్ హేవిషానికి పరిచయం చేసాడో అతనే నిజానికి పిప్ యొక్క అమూల్యమైన అదృష్టానికి సృష్టికర్త. పిప్ మిస్టర్ పంబుల్ షూక్ ను నీచంగా చూసేవాడు అందువల్ల అతను ప్రతిసారి తనలో తను తరచి చూసుకుని స్వభావాన్ని మార్చుకుంటూ వచ్చాడు. అతను ఒక మోసగాడు. పిప్ అతనితో పాటు నిల్చున్నప్పుడు, మిస్టర్ పంబుల్ షూక్ తిరిగి పిప్ తో అతను అన్న మాటలన్నీ తిరిగి వినిపిస్తాడు. అతను చూపిన తృణీకారం తనకి ఎంత ఉపయుక్తంగా మారిందీ చెప్తాడు.

మిస్ హవిషం మరియు ఆమె కుటుంబంసవరించు

 • ఎవరైతే పిప్ ను ఆమె సహచరుడుగా భావించిందో, పిప్ ఎవరినైతే తన శ్రేయోభిలాషిగా అనుమానించాడో ఆమె మిస్ హేవిషం, సంపన్నురాలైనకన్య. ఆ విషయాన్ని హేవిషం ఖండించలేదు ఎందుకంటే ఆమె పన్నిన పన్నాగంలో పావుగా వాడుకుంది. తరువాత ఆమె అతనికి పశ్చాత్తాపంతో క్షమార్పణలు చెప్పుకుంది. అతను ఆమె క్షమార్పణలు స్వీకరించాడు అదే సమయంలో మంట నుండి నిప్పురవ్వ ఆమె దుస్తులకు అంటుకుని ఆమె శరీరం విపరీతంగా కాలిపోతుంది. పిప్ ఆమెను రక్షిస్తాడు కానీ ఆమె గాయాలతో తరువాత చనిపోతుంది.
 • ఎస్టేల్లా (హేవిషం), మిస్ హేవిషం యొక్క దత్త పుత్రిక. నవల మొత్తం ఆమె మీద అతని ప్రేమ చుట్టూ తిరుగుతుంది. జేగ్గర్స్ యొక్క పనిమనిషి ఐన మోలీ మరియు అబెల్ మెగ్ విచ్ ల రహస్య పుత్రిక ఆమె. కానీ హత్యా యత్నం చేసిన తర్వాత ఎస్టేల్లా మిస్ హేవిషానికి ఇచ్చివేయబడుతుంది. ఎస్టేల్లా జీవితం డబ్బు, సంస్కృతితో కూడుకుని ఉంటుంది. అందువల్లనే ఆమెను అందుకోవడానికి పిప్ శ్రమ పడవలసి వచ్చింది. ఆమెలో ప్రేమించే తత్వాన్ని నాశనం చేసింది మిస్ హేవిషం ఎంతగా అంటే ఆమె అతనికి తిరిగి అతని అంచనాలకు తగినట్లు ఏమీ ఇవ్వలేక పోయింది. ఆమె అతనికి చాలాసార్లు చెప్పింది పిప్ అంటే ఇష్టం లేదని కానీ అతను నమ్మలేదు. ఒక సమయంలో ఎస్టేల్లా ఇనుప మెట్ల మీద నడచి అతనికి చూపిస్తుంది ఆమె అతని కంటే ఎంత ఉన్నత శ్రేణికి చెందినదో.
 • ఆర్థర్ (హేవిషం), మిస్ హేవిషం యొక్క సవతి సోదరుడు. తండ్రి కుతురంటే ఉన్న ప్రేమతో తనను చిన్న చూపు చూసి తండ్రి ఆస్తి పంపకంలో మోసం చేసాడు అనుకుంటాడు. మిస్ హేవిషాన్ని మోసం చేసే ప్రణాళికలో కంపెసన్ ను కూడా భాగంగా చేసుకుంటాడు. కంపెసన్ తో పెళ్ళి జరిపించబోతున్నట్టు నటించి ఆమె దగ్గర ఉన్న చాలా పెద్ద ఆస్తిని కొట్టేయాలని పన్నాగం పన్నుతాడు. అతను వేసిన పథకాల జ్ఞాపకాలు అతణ్ణి పిచ్చివాణ్ణి చేస్తాయి. మిస్ హేవిషం ఇంకా బ్రతికి అతని గదిలోనే ఉన్నట్లు, అతణ్ణి చంపడానికి వస్తున్నట్లు ఊహించుకుని, మతిభ్రమించి ఆఖరికి చనిపోతాడు. ఆర్థర్ ఎప్పుడూ త్రాగుతూ, జుదమడుతూ ఉంటాడు.నవల ప్రథమార్థం లోనే అతను చనిపోతాడు.
 • మేథ్యు పాకెట్ , మిస్ హేవిషానికి దాయాది. అతను పాకెట్ వంశానికి చెందినవాడు కానీ, హేవిషం ఇతర రక్త సంబంధీకుల మాదిరి ఆమె సంపదను చూసి ఈర్ష్య పడేవాడు కాదు. మేథ్యు పరివారంలో తొమ్మిది మంది పిల్లలు, ఇద్దరు నుర్సులు, ఒక హవుస్ కీపర్, ఒక వంటవాడు, ఇంకా అందమైనదే కానీ పనికిమాలిన అతని భార్య (పేరు బెలిండా). అతని ఎస్టేట్ లో ఉండే ద్రంలె, స్టేర్తప్, పిప్ ఇంకా అతని కుమారుడు హెర్బర్ట్ వంటి పిల్లలకు చదువు చెప్పేవాడు.
 • హెర్బర్ట్ పాకెట్, పాకెట్ కుటుంబంలో ఒక సభ్యుడు,మిస్ హేవిషానికి వారసుడు కావలసిన వాడు, మొదటిసారి హేవిషం ఇంటికి వెళ్ళినప్పుడు పిప్ చిన్న పిల్లవాడు. అక్కడ అతనికి పాలిపోయినట్లున్న ఒక చిన్న పిల్లవాడితో కొట్లాట జరుగుతుంది. ఆ పిల్లవాడే ఇతను. అతను మేథ్యు పాకెట్ కొడుకు. మేథ్యు పాకెట్ జెంటిల్ మాన్ ఆర్ట్స్ లో పిప్ యొక్క గురువు. అంతేకాక అతను లండన్ లో పిప్ కు తన అపార్ట్ మెంట్ లో ఉండటానికి చోటు ఇచ్చాడు. పిప్ కు చాలా తొందర లోనే మంచి స్నేహితుడయ్యాడు, అతని కష్ట సుఖాలను పంచుకున్నాడు. అతనికి క్లారా అనే మహిళతో రహస్య సంబంధం ఉండేది. అతని తల్లి తమ కన్నా తక్కువ స్థితిగతులున్న క్లారాను ఒప్పుకోదనే భయంతో దాచి ఉంచాడు.
 • కేమిల్లా, ఒక వయసు అయి పోఇన వాగుడుకాయ. ఆమె మిస్ హేవిషానికి బంధువు, కేవలం హేవిషం డబ్బు మాత్రం కావాలి.
మిస్ హేవిషం చుట్టూ ఈగల్లా ముసిరే చాలామంది బంధువులలో ఆమె కూడా ఒకటి. 
 • దాయాది రేమొండ్, ఇంకొక వయస్సు మళ్ళిన బంధువు, కేవలం హేవిషం డబ్బు మీద మాత్రం మమకారం. అతను కేమిల్లాను పెళ్ళాడాడు.
 • జర్జియానా,మిస్ హేవిషం ముసలి బంధువు, ఆమె డబ్బు మీద మాత్రమే ప్రేమ.
 • సారా పాకెట్, అక్రోటు కాయ లాగా చిన్న ముఖంతో, పొడిబారి ముడతలు పడిన చర్మం కలిగి, మీసాలు లేని పిల్లి లాగా పెద్ద మూతి కలిగిన ముసలి మహిళ. హేవిషం డబ్బును ఆశించే మరొక బంధువు.

పిప్ యొక్క యువ వర్గం నుండి పాత్రలుసవరించు

 • ఎవరినైతే పిప్ దయతో ఆడరిస్తాడో, ఎవరైతే తర్వాత అతని శ్రేయోభిలాషిగా మారతాడో, ఎప్పుడైతే అతని నిజమైన పేరు అబెల్ మెగ్ విచ్ అని తెలుస్తుందో అతడే జైలు నుండి పారిపోఇన అపరాధి. ప్రోవిస్ గా మరియు మిస్టర్ కామ్బెల్ గా కథలో కనిపించి అతని గుర్తింపుని బయటపడనివ్వకుండా ఉంటారు. ఎవరూ అతణ్ణి ఎన్నో సంవత్సరాలకు ముందు ఆస్ట్రేలియాకు పంపిన అపరాధిగా ఎవరు గుర్తు పట్టకుండా పిప్ కూడా అందరికి అతణ్ణి తన అంకుల్ గా పరిచయం చేస్తాడు
  • పిప్ శ్రేయోభిలాషి ఐన అబెల్ మెగ్ విచ్ , అపరాధికి ఇచ్చిన పేరు.
  • ఈ పేరును అబెల్ మెగ్ విచ్ అతను లండన్ నుండి తిరిగివచ్చినప్పుడు ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి ఆ పేరును వాడతాడు. పిప్ కూడా ప్రోవిస్ తన అంకుల్ అని, వేరే టౌన్ నుండి తనను కలిసేందుకు వచ్చాడని చెప్తాడు.
  • మిస్టర్ కామ్బెల్, ఆ పేరును లండన్ లో అతని శత్రువు అతణ్ణి పసిగట్టిన తర్వాత వాడతాడు.
 • మిస్టర్ అండ్ మిస్సెస్ హబ్బుల్, గ్రామీణులు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఉన్నాడని కంటే ఎక్కువ ముఖ్యులమని నమ్ముతుంది. వాళ్ళు పిప్ గ్రామంలోనే నివసించేవాళ్ళు.
 • మిస్టర్ వొస్లె,పిప్ టౌన్ లోనే చర్చిలో గుమస్తాగా పని చేసేవాడు. అతను తర్వాత చర్చిలో పని మానేసి లండన్ వెళ్లి నటుడు కావాలనే తన ఆశయం పూర్తి చేసుకునే వేటలో ఉంటాడు ఐనప్పటికీ అతను అంత మంచివడెం కాదు.
 • బిడ్డీ, మిస్టర్ వొస్లె యొక్క రెండవ దాయాది. ఆమె పిప్ గ్రామంలోనే తన ఇంట్లో నుండే సాయంత్రపు పాథశాల నడుపుతుంది ఇంకా ఆమె పిప్ కు కూడా ఉపాధ్యాయిని. ఆమె చాలా దయ గలది మరియు తెలివైనది కానీ పేద మహిళ. ఆమె కూడా పిప్ మరియు ఎస్టేల్లా వలె అనాథ. ఎస్టేల్లా కంటే పూర్తి వ్యతిరేకమైన మనస్తత్వం కలది. పిప్ ఆమె అతని పట్ల చూపించే ప్రేమని నిర్లక్ష్యం చేసి ఎస్టేల్లాను స్వంతం చేసుకునే కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయాడు. అతని జీవితంలో మనుష్యులను గుర్తించడంలో చేసిన పొరపాటుని గుర్తించి బిడ్డీని పెల్లదాడమని తిరిగి వచ్చేసరికి, ఆమె జో గార్జేరీని వివాహం చేసుకుంటుంది. బిడ్డీకి జోకి తర్వాత ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు. వారిలో ఒకరి పేరు తర్వాత పిప్ ఉండటం చూసి ఎస్టేల్లా నిజమైన ముగింపులో అది పిప్ పిల్లవాడే నని పొరపాటు పడుతుంది. ఆర్లిక్ ఆమెను చూసి ఆకర్షణకు లోఅవుతడు కానీ, అతని ప్రేమ ఒకవైపు నుండే కొనసాగుతుంది.

లాయర్ మరియు అతని సంబంధీకులుసవరించు

 • మిస్టర్ జేగ్గేర్స్, వివిధ రకాలైన క్లైంట్లను అంటే క్రిమినల్ మరియు సివిల్ రెండిటిని వాదిస్తాడు. అతను పిప్ శ్రేయోభిలాషికి మరియు మిస్ హేవిషానికి ఇద్దరికీ లాయర్ గా ఉంటారు. కథ చివరిలో, అతని లా ప్రాక్టీసు చాలా పాత్రలకు సాధారణ మూల కారణం అవుతుంది.
 • "జాన్ వేమిక్, జేగ్గేర్ యొక్క గుమస్తా, అతణ్ణి మిస్టర్ వేమిక్ గాను లేక వేమిక్ గాను పిలవబదతడు ఒక్క తన తండ్రితో తప్ప. అతని తండ్రి తనకి తను ముసలి తండ్రిగా చెప్పుకుంటాడు "ద ఎజేడ్ పి " లేక ఉట్టి "ది అజేడ్". వేమిక్ పిప్ కు జేగ్గేర్స్ కి మధ్యవర్తిగా పనిచేసేవాడు అంతేకాక వ్లోన్దోన్ లో పిప్ కు సంబంధించిన మంచి చెడ్డ అన్ని చూసుకునేవాడు.
 • మొలి , మిస్టర్ జేగ్గేర్ యొక్క ఆడ పని మనిషి ఆమెను జేగ్గేర్స్ హత్యా నేరం క్రింద ఆమెకు ఉరిశిక్ష పడకుండా రక్షించాడు. ఆమె మెగ్ విచ్ మాజీ ప్రియురాలు అన్న నిజం బయట పడుతుంది. ఆమె ఎస్టేల్లాకు నిజమైన తల్లి.

పిప్ యొక్క విరోధులుసవరించు

 • కంపెసన్ ( (ఇంటిపేరు), ఇంకొక అపరాధి, మెగ్ విచ్ శత్రువు. ఒక ప్రొఫెషనల్ మోసగాడు, మిస్ హేవిషం కావాలనుకున్న భర్త, ఆర్థర్ తో కూడి మిస్ హేవిషాన్ని మోసం చేద్దామనుకున్నారు. అతనుఅబెల్ మెగ్ విచ్ను వెతుకుతూ ఉంటాడు. మెగ్ విచ్ లండన్లో ఉన్నాడని మునిగిపోయాడని తెలుసుకుని అప్పుడు అతను కూడా తేమ్స్ నదిలోకి పడిపోతాడు. పుస్తకంలోని కొన్ని భాగాలలో అతణ్ణి కొంపే అని కూడా అంటారు.
 • "దోగ్లె" ఆర్లిక్, జో గేర్జేరి యొక్క కొలిమిలో పనికి నియమింపబడినకమ్మరి. ఇతరులతో కలవడానికి ఇష్టపడని, బలమైన, కతినమైన మనిషి. అతను కూడా జో మాదిరి మోటుమనిషి ఇంకా దయ గలవాడు. అతని కోపావేశ పూరితమైన స్వభావంతో అతను తీసుకునే నిర్ణయాలు అతని జీవితంలోని కోరికలను తిర్చుకోనివ్వకుండా చేసింది కానీ అతను దానికి ఇతరులను నిందిస్తాడు. జో భార్య సాధింపుల కారణంగా అతను జోతో గొడవ పడి దెబ్బలు కూడా తింటాడు. ఈ విధమైన చాలా సందర్భాలు అతణ్ణి రహస్యంగా జో మీద దాడి చేయడానికి ఉసి గొలిపి పిప్ జీవితంలో బాధాకరమైన సంఘటనలకు కారణమయ్యాడు. తర్వాత అతని నేరం బయట పడి అరెస్ట్ చేయబడ్డాడు.
 • బెంట్లే ద్రంలె, వయస్సులో ఉన్న తెలివిలేని మోటు మనిషి. అతడిది సంపన్న కుటుంబం. అతను పొదుపు చేసుకునేది విజయం సాధించి పెరుతేచుకోవడానికి ఉపయోగిస్తాడు. పిప్ అతణ్ణి మిస్టర్ పాకెట్స్ ఇంట్లో కలిసాడు. అతను కూడా జెంటిల్ మాన్ నైపున్యాలలో శిక్షణ పొందాడు. ద్రంలె పిప్ కు మరియు ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంటాడు. అతను పిప్ ఎస్టేల్లా మీద అభిమానం చూపిస్తున్నాడని ఈర్ష్య పడి ఆమెను తనే పెళ్ళి చేసుకుంటాడు. అతను ఎస్టేల్లాను సరిగా చుసుకోలేదని చెప్తారు. ద్రంలె తర్వాత ఒక గుర్రం మీద ఎక్కి ప్రమాదవశాత్తు మరణించాడని చెప్పబడుతుంది. మిస్టర్ జేగ్గేర్స్ యొక్క ముద్దు పేరు "ద స్పైడేర్".

ఇతర పాత్రలుసవరించు

 • క్లారా బార్లీ, హెర్బర్ట్ పాకెట్ కు భార్యగా ఉండేది. ఒక పేద అమ్మాయి వాత రోగంతో బాధ పడే తండ్రితో కలిసి నివసిస్తుంది. ఆమె పిప్ను కలవకముందు అతణ్ణి ఇష్టపడేది కాదు. ఎందుచేతనంటే హెర్బర్ట్ ఖర్చు పెట్టడంలో పిప్ ప్రభావం ఉందని నమ్ముతుంది. కానీ ఎప్పటికప్పుడు అతణ్ణి హెచ్చరిస్తూ ఉండేది.
 • మిస్ స్కిఫ్ఫిన్స్, జాన్ వేమిక్ కు భార్యగా ఉండేది. నవల ఆరంభంలో ఆమె ప్రస్తావన ఉంటుంది. గూడుగా పిలవబడే మిస్టర్ వేమిక్ యొక్క కాటేజ్ దగ్గర ఆమె కనిపిస్తుంది. అంతేకాక మిస్టర్ పిప్ తో ఆడినప్పుడు ఆకుపచ్చ గ్లోవ్స్ వేసుకుంటుంది. అవే గ్లోవ్స్ టెక్స్ట్ పెళ్ళి సీనులో మాత్రం తెల్లవిగా పరస్పరం మారుతాయి. ఐనప్పటికీ అక్కడ చాల మంది "ఆఫ్ బుక్"లో దొరుకుతారు.

శైలి మరియు అంశాలుసవరించు

గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ . ఫస్ట్ పర్సన్ లో వ్రాయబడింది మరియు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లికేషన్ నుండి వాడబడిన భాష మరియు గ్రామర్ ఇప్పుడు ఎవరూ వాడట్లేదు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ పేరు పిప్ తన శ్రేయోభిలాషుల నుండి పెద్దగా ఆశించాడు కాబట్టి, అందువల్లనే అతను జెంటిల్ మాన్ గ అవ్వాలనుకున్నాడు కాబట్టి వచ్చింది. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఒక బిల్దంగ్శ్రోమన్, ఒక నవల ఇది పిప్ పెరుగుదల మరియు వ్యక్తిగత అభివృద్ధి గురించి చెప్తుంది.

గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ లో ముఖ్య అంశాలు నేరం, సామాజిక వర్గం, ఎంపైర్ మరియు ఆశ. చిన్నవయస్సు నుండే పిప్ తప్పు చేసినట్టు భావించేవాడు; ఎవరైనా తన తప్పును కనిపెట్టి శిక్ష వేస్తారేమో అని భయపడేవాడు. నేరం అనే అంశంలో కూడా గొప్ప కొసమెరుపు పిప తన శ్రేయోభిలాషి ఇంకెవరో కాదు అపరాధి అని తెలుసుకోవడం. పుస్తకం మొత్తం పిప ఆత్మ సాక్షితో అంతర్మథనం ఉంటుంది. గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ విక్టోరియన్ ఇంగ్లాండ్ యొక్క సామజిక వర్గాలలో ఉన్న వ్యత్యాసాలను ఎత్తిచూపుతుంది. పుస్తకం అంతా, మెగ విచ్ లాంటి నేరస్తులను మొదలుకొని మిస్ హేవిశం లాంటి ధనికుల వరకు అందరితో పిప్ కు సంబంధం ఉంటుంది. పిప్ కు ఉన్న గొప్ప ఆశయం, ఈ పుస్తకం అంతా కనిపిస్తుంది. ఒకవేళ పిప్ కు ఆశయం ఏమి లేకపోతే కనుక, అతను ఎప్పటికి లండన్ వెళ్ళేవాడు కాదు, అతను ఒక చిన్న కమ్మరిగానే ఉంది పోయేవాడు.

సినిమా, టీవీ, మరియు సిద్ధాంతీకరణ విధానాలుసవరించు

ఇతర డికెన్స్ నవల మాదిరి గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా సార్లు చిత్రీకరించబడింది బడింది:

సాంస్కృతిక ఉదాహరణలు మరియు స్పిన్-ఆఫ్స్సవరించు

 • గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, అన్ సోల్డ్ స్టోరీ (1896 ), తారాగణం జాన్ స్తన్టన్, తిం బర్స్తల్ దర్శకత్వం చేబట్టిన ఒక స్పిన్-ఆఫ్ సినిమా. ఆస్ట్రేలియాలో మెగ విచ్ చేసిన సాహసాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
 • పిప్ పిర్రుప్ పాత్రను వివరిస్తూ సౌత్ పార్క్ సృష్టికర్తలు ఒక పేరడీ ఎపిసోడ్ తీసారు. పిప్ ఇది మొదట్లో కథను అనుసరించే ఉంటుంది. కానీ, అకస్మాతుగా (ఒక రోబోట్ కోతిని ప్రవేశపెట్టి) మిస్ హేవిశాన్ని మరింత క్రూరు రాలిగా (బ్రెయిన్ స్విచింగ్ పరికరం తో)వాస్తవానికి పేరడీగా డికెన్స్ అప్పటి పరిస్థితులను అనుసరించి ముగింపు వేరే విధంగా మారుస్తారు.
 • పీటర్ కెరీ యొక్క జాక్ మగ్గ్స్ మెగ్ విచ్ లండన్ తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఊహించింది. దానితో పాటుగా, మిగతా విషయాలు ఐన కల్పితమైన చార్లెస్ డికెన్స్ పాత్ర మరియు కథ ఇతివృత్తం వంటి విషయాల మీద.
 • లొఇడ్ జోన్స్ యొక్క మిస్టర్ పిప్ ఎక్కడైతే బోగన్విల్లె ఉంటుందో అక్కడ ఉంచబదతాడు, చింత పాడుతున్నప్పుడల్లా, ఒక తెల్లవాడు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ను స్థానికంగా పిల్లలకు పాఠ్య అంశంగా ఉపయోగిస్తారు.
 • గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ యొక్క కథనం మరియు పాత్రలు జస్పెర్ ఫోర్డే యొక్క గురువారం తర్వాతి శ్రేణులలో. గురువారం స్నేహితురాలు మరియు మార్గదర్శకులు మిస్ హేవిశం మరియు ఫోర్డే మాన్యు స్క్రిప్ట్ లో ఉన్న విధంగా ముందుకు కథ ఎలా నడుస్తుంది, ఎవరూ చదవనప్పుడు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రపంచంలో ఎం జరుగుతోంది అని కొద్దిగా చెప్తారు.
 • BBC రేడియో శ్రేణులు బ్లీక్ ఎక్స్పెక్టేషన్స్ డికెన్స్ యొక్క పేరడీ మరియు సాధారణమైన విక్టోరియన్ నవలలు, మరియు ముఖ్యంగా బ్లీక్ హవుస్ మరియు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్. దీని కథానాయకుడు పిప్ బిన్.
 • గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ గ్యాస్ లైట్ ఎంతెం అనే ఆల్బం యొక్క మొదటి ట్రాక్ పేరు ద 59 సౌండ్, మరియు ఎస్టేల్లాకు సంబంధించిన మాటలు.

సూచనలుసవరించు

 1. "గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ క్లిష్టమైన అవలోకనం". మూలం నుండి 2009-05-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-07. Cite web requires |website= (help)
 2. మేకిర్, జెరోం గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ లో నటన నాటిది : ఏ న్యూ క్రోనాలజీ.
 3. http://www.dickens-literature.com/Great_Expectations/58.html

బాహ్య లింకులుసవరించు

ఆన్లైన్ సంచికలు
అధ్యయన మార్గదర్శి
ఇతర రకాలు

మూస:Charles Dickens