ఘంటసాల రత్నకుమార్

ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, రచయిత. ఈయన గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు. ఈయన డబ్బింగ్ ఆర్టిస్టుగా దక్షిణాది భాషల్లోనే కాక హిందీ వెయ్యికి పైగా సినిమాలకు, 15 వేలకుపైగా టీవీ ఎపిసోడ్లకు, 50 కిపైగా డాక్యుమెంటరీలకు పనిచేసాడు.[1] ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పినందుకు గాను ఈయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. 30 సినిమాలకు మాటలు అందించాడు.

ఘంటసాల రత్నకుమార్
మరణం2021 జూన్ 10
చెన్నై
వృత్తిడబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, మాటల రచయిత
తల్లిదండ్రులు

2021 లో కరోనా వ్యాధిన బడి కోలుకున్న ఈయన జూన్ 10, 2021 ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. అంతకు మునుపు కూడా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధ పడ్డాడు.[2]

కుటుంబం

మార్చు

రత్నకుమార్ కుమార్తె వీణ తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుమి లాంటి చిత్రాల్లో పాటలు పాడిన నేపథ్యగాయని.[3]

కెరీర్

మార్చు

బి. ఎస్. సి పూర్తి చేసిన రత్న కుమార్ చెన్నైలోని అడయార్ ఫిల్ం ఇన్‌స్టిట్యూట్ లో చేరి దర్శకత్వ విభాగంలో డిప్లొమా పొందాడు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో అనౌన్సర్ గా పనిచేశాడు.[4] రత్నకుమార్ ముందుగా తన తండ్రి ఘంటసాల వారసత్వాన్ని కొనసాగిస్తూ కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడాడు, కానీ ఆవృత్తిలో ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాడు. తర్వాత1978 లో వచ్చిన కంచి కామాక్షి సినిమాతో డబ్బింగ్ కళాకారుడిగా మారాడు.[5] అరవింద్‌ స్వామి, అర్జున్ సర్జా, వినోద్ కుమార్, కార్తీక్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పాడు. అన్నమయ్య తమిళ వర్షన్ లో నాగార్జునకు డబ్బింగ్ చెప్పాడు.

మూలాలు

మార్చు
  1. Today, Telangana. "Dubbing artiste Ghantasala Ratnakumar passes away". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-10.
  2. "ఘంటసాల కుమారుడు కన్నుమూత - ghantasala ratna kumar died due to heart attack". www.eenadu.net. Retrieved 2021-06-10.
  3. "Ghantasala Ratnakumar Passes Away : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఘంటసాల రెండవ కుమారుడు కన్నుమూత." News18 Telugu. Retrieved 2021-06-10.
  4. "Ghantasala Rathnakumar no more". The Hindu (in Indian English). Special Correspondent. 2021-06-11. ISSN 0971-751X. Retrieved 2021-12-14.{{cite news}}: CS1 maint: others (link)
  5. "Dubbing artiste and singer Ghantasala Ratnakumar passes away - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-10.