చండి లేదా చండిక ఒక హిందూ దేవత. ఈమె మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళి స్వరూపిణి, పరదేవతా స్వరూపం.[1] ఇచ్ఛా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిల కలయిక. పార్వతి లేదా ఆది పరాశక్తి యొక్క రౌద్ర రూపంగానూ అభివర్ణించబడింది. శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకారం పరాశక్తి అంటే బ్రహ్మమనియే. ఈ పరాశక్తి రూపమైన చండి కూడా బ్రహ్మస్వరూపమే. దేవి మహత్మ్యంలో పలుచోట్ల ఆమె గురించిన ప్రస్తావన ఉంది.

చండి
Chandi Nutan Dal Arnab Dutta 2010.JPG
చండీదేవి స్వరూపం, బేహల నూతన దళ, కోల్కత, 2010
దేవనాగరిचण्डी
అనుబంధందేవి, ఆది పరాశక్తి
మంత్రంఓం ఐం హీం క్లీం చాముండాయై విచ్చే
భర్త / భార్యఅష్ట భైరవ
వాహనంసింహం

పదవ్యుత్పత్తిసవరించు

చండి అనే పదం చండ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. సంస్కృతంలో చండ అంటే ఛేదించగల అని అర్థం.[2]

చండీ హోమంసవరించు

హిందూ సంప్రదాయాల్లో చండీ హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతటా వేర్వేరు సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ హోమం జరిపేటప్పుడు దుర్గ సప్తశతిలోని మంత్రాల వల్లిస్తారు. దీని తరువాత నవాక్షరి మంత్రం, కుమారి పూజ, సువాసిని పూజల్లాంటివి చేయడం కూడా పరిపాటి.[3]

మూలాలుసవరించు

  1. పోతుకూచి, శ్రీరామమూర్తి (1982). శ్రీచండీ సప్తశతి మీమాంస. తెనాలి: సాధన గ్రంథ మండలి. మూలం నుండి 5 సెప్టెంబర్ 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 12 July 2017.
  2. Learn the Worship of Goddess Chandi
  3. Brown, C. Mackenzie (1990). The Triumph of the Goddess: The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata Purana. Albany: State University of New York Press
"https://te.wikipedia.org/w/index.php?title=చండి&oldid=2885298" నుండి వెలికితీశారు