చంద్రశేఖర్ బవాన్కులే

చంద్రశేఖర్ కృష్ణారావు బవాన్‌కులే (జననం 13 జనవరి 1969) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కాంథి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి శాసనసమండలి సభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

చంద్రశేఖర్ కృష్ణారావు బవాన్‌కులే
చంద్రశేఖర్ బవాన్కులే


మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 ఆగస్టు 12
ముందు చంద్రకాంత్ పాటిల్

పదవీ కాలం
2022 జనవరి 2 – 2024 నవంబర్ 23
ముందు గిరీష్ వ్యాస్
నియోజకవర్గం నాగ్‌పూర్ స్థానిక సంస్థలు నియోజకవర్గం

ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2016 జూలై 8 – 2019 నవంబర్ 8
ముందు ఏక్నాథ్ ఖడ్సే
తరువాత దిలీప్ వాల్సే పాటిల్

ఇంధన శాఖ మంత్రి
పదవీ కాలం
2014 డిసెంబర్ 4 – 2019 నవంబర్ 8
ముందు అజిత్ పవార్
తరువాత బాలాసాహెబ్ థోరాట్

పదవీ కాలం
2004 – 2019
ముందు సులేఖ కుంభారే
తరువాత టేక్‌చంద్ సావర్కర్
నియోజకవర్గం కాంథి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024
ముందు టేక్‌చంద్ సావర్కర్
నియోజకవర్గం కాంథి

వ్యక్తిగత వివరాలు

జననం (1969-01-13) 1969 జనవరి 13 (వయసు 55)
కోరడి , మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ
  • భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి జ్యోతి బవాన్కులే
సంతానం పాయల్
సంకేత్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు www.cbawankule.in

పార్టీ పదవులు

మార్చు

చంద్రశేఖర్ బవాన్కులే 1995లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి , బీజేవైఎం నాగ్‌పూర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, బీజేపీ నాగ్‌పూర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, 2012 నుండి 2014 వరకు మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసి 2022 ఆగస్టు 12న భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

మార్చు

చంద్రశేఖర్ బవాన్కులే 1997 & 2002లో రెండుసార్లు బవాన్‌కులే జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంథి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సులేఖ కుంభారేపై 31,093 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. చంద్రశేఖర్ బవాన్కులే 2009, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో 2014 డిసెంబర్ 4 నుండి 2019 నవంబర్ 8 వరకు ఇంధన శాఖ మంత్రిగా, 2016 జూలై 8 నుండి 2019 నవంబర్ 8 వరకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయనపై అవినీతి ఆరోపణల కారణంగా 2019 ఎన్నికలలో పోటీ చేయడానికి బిజెపి టిక్కెట్ ఇవ్వలేదు.

చంద్రశేఖర్ బవాన్కులే 2022 జనవరి 2న మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై, 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంథి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ భోయార్ పై 31,093 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

మార్చు
  1. The Hindu (12 August 2022). "With polls in mind, BJP appoints Chandrashekhar Bawankule as new Maharashtra State President" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  2. The Indian Express (13 August 2022). "Bawankule appointed new Maharashtra BJP president, Shelar is Mumbai party chief" (in ఇంగ్లీష్). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.