చంబా జిల్లా

హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లా

హిమాచల్ ప్రదేశ్ జిల్లాలలో చంబా జిల్లా ఒకటి. ఈ జిల్లాకు చంబా పట్టణం కేంద్రంగా ఉంది. జిల్లా లోని డల్హౌసీ, కజీహియార్ హిల్ స్టేషన్లలో సెలవులు గడిపేందుకు మైదానప్రాంతాల ప్రజలు ఎక్కువగా వస్తూంటారు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ 500 నుండి చరిత్రను ఆధారాలతో వ్రాతపూర్వకంగా నమోదుచేసిన ప్రాంతమిదే అని భావిస్తున్నారు. అత్యంత ఎత్తైన పర్వశ్రేణులు ఇక్కడ శతాబ్దాలుగా ఉన్న శిథిలాలు, అనేక శిలాశాసనాలను సరక్షిస్తున్నాయి . ఇది హిమాచల్ ప్రదేశ్ వాయవ్య ప్రాంతంలో ఉంది. 1000 సంవత్సరాలకు పూర్వం చంబా మహారాజు నిర్మించిన ఆలయాలలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఆలయాలకు భూమిదానం చేసిన తామ్రపత్రాలు ఇప్పటికీ సంరక్షించబడుతూ చట్టబద్ధమైన విలువను కలిగి ఉన్నాయి.,

చంబా జిల్లా
హిమాచల్ ప్రదేశ్ పటంలో చంబా జిల్లా స్థానం
హిమాచల్ ప్రదేశ్ పటంలో చంబా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
ముఖ్య పట్టణంచంబా
విస్తీర్ణం
 • మొత్తం6,528 కి.మీ2 (2,520 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం3,93,386
 • జనసాంద్రత60/కి.మీ2 (160/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి
చంబా లోని లక్ష్మీనారాయణ దేవాలయం

చరిత్ర

మార్చు

ఈ ప్రాంతం ఆరంభకాల చరిత్రను అనుసరించి ఈ ప్రాంతంలో ముందుగా కొలియన్ ప్రజలు నివసించారని తెలుస్తుంది. ఖాసా ప్రజలు కొలియన్లను అణిచివేసి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాసా ప్రజలను అణిచివేసి ఔదుంబరా ప్రజలు (క్రీ.పూ 2వ శతాబ్దం) ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించారు. ఔదుంబరాలు గణతంత్ర రాజ్యం స్థాపించారు. ఔదుంబరాలు శివుని ప్రధాన దైవంగా ఆరాధించారు. నుండి గుప్తుల కాలంలో (సా.శ. 4వ శతాబ్దం) చంబా ప్రాంతం ఠాకూరులు, రాణాలు పాలనలో ఉందని భావిస్తున్నారు. వీరు తమని తాము కొలియన్, ఖాసా ప్రజలకంటే అధికులమని భావించారు. తరువాత ఈ ప్రాంతం మీద గుజరా ప్రతిహారులు (సా.శ. 7వ శతాబ్దం) ఆధిక్యత వహించారు.

పురాణ కథనాలు

మార్చు

హిమాచల్ ప్రదేశ్ గురించి రామాయణ, మహాభారతం మొదలైన పురాణా కావ్యాలలో, వేదాలలో విస్తారంగా వర్ణించబడింది.

మహాభారతం

మార్చు

మహాభారతంలో వర్ణించబడిన కులుత (కుల్లు), త్రిర్త (కంగ్రా), కులింద్ (షిమ్లా), యుగంధర్ (బిలాస్పూర్, నలగర్), గొబ్దిక (చంబా), ఔదుంబర్ (పఠాన్‌కోట్) జనపదాలు (రాజ్యాలు) వర్ణించబడ్డాయి.

ఋగ్వేదం

మార్చు

ఋగ్వేదంలో వర్ణించబడిన నదులు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రవహిస్తున్నాయి. ఆర్యులు ఇక్కడ ప్రవేశించడానికి ముందే శంబరుడనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడని భావిస్తున్నారు. బియాస్, యమునా నదుల మద్య 99 శక్తివంతమైన కోటలున్నాయి. శంబర రాజు ఆర్యసేనాధిపతితో 12 సంవత్సరాల పాటు యుద్ధం చేసి విజయం సాధించాడు. పురాణాలలో హిమాచల్ ప్రదేశ్ వైవిధ్యమైన అందమైన పేర్లతో వర్ణించబడింది.

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం (క్రీ.పూ 1400) కొరకు కాంగ్రా రాజు సుశర్మచంద్ర నిధిసహాయం చేసాడని వర్ణించబడింది. సుశర్మ చంద్రా కౌరవుల పక్షంలో చేరి పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసాడు. కాంగ్రా భీమకోట (భీముని స్మారకార్ధం) అని పిలువబడింది.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో చంబా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 2 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[1]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 518,844, [2]
ఇది దాదాపు కేప్ వర్దే దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో 544 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత 80 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 12.58%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి 989:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 73.19%.[2]
జాతియ సరాసరి (72%) కంటే
ప్రజలు జిల్లాలో గడ్డిజాతి ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.

భాషలు

మార్చు

జిల్లాలో భట్టియాలి, దొగ్రి- కంగ్రి, గడ్డీ- భర్మౌరీ, చంబా భాషలు వాడుకలో ఉన్నాయి.[4]

గడ్డీ భాష

మార్చు

గడ్డీ భాషను చంబా జిల్లా లోని భారమౌల్ తాలూకాప్రజలలో అధికంగా వాడుకలో ఉంది. గడ్డీ ప్రజలు గొర్రెలు, మేకలను మేపుతూ ఉంటారు. ఈ ప్రజలు పశువుల మేత కొరకు ఒక ప్రాంతం వదిలి మరొక ప్రాంతానికి వలసపోతూ ఉంటారు. గడ్డీ ప్రజలు అధికంగా భార్మౌర్ తాలూకాలో నివసిస్తుంటారు. కాని కొంతమంది రాష్ట్రమంతటా స్థిరపడ్డారు. ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని కాంగ్రా జిల్లాలో వీరు కనిపిస్తుంటారు.

చంబల్ భాష

మార్చు

చంబా పట్టణం, చాంబా సమీపప్రాంతాలలో చంబియల్ భాష వాడుకలో ఉంది.

ఇతర భాషలు

మార్చు

జిల్లాలో అదనంగా పంగ్వాలి, చురాహి భాషలు (ప్రధానంగా పంగి, చురాహ్, తీషా ప్రాంతాలలో ) వాడుకలో ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు

మార్చు
  • బనిఖెట్

లక్ష్మీనారాయణ ఆలయం

మార్చు

లక్ష్మీనారాయణ ఆలయం చంబా జిల్లాలలో ఇది ఒక పర్యాటక ఆకర్షిత ప్రాంతం. ఇక్కడ విష్ణుమూర్తి ప్రధానదైవంగా మూడు ఆలయాలు ఉన్నాయి. శివుడు ప్రధానదైవంగా మూడు ఆలయాలు ఉన్నాయి.

బ్రజేశ్వరి దేవి ఆలయం

మార్చు

దుర్గాదేవి ప్రధానదైవంగా ఉన్న ఆలయం బ్రజేశ్వరి దేవి ఆలయం. ఆలయ కుడ్యశిల్పాలు ప్రఖ్యాతిచెందాయి. ఆలయ నిర్మాణశైలి ఆలయానికి ప్రత్యేకత తీసుకువచ్చింది. శిఖరశైలికి కూడా ప్రత్యేకత ఉంది. ఆలయగోపురం మీద కొయ్యతో చేసిన అమలక ఉంది.

చాముండా దేవి ఆలయం

మార్చు

ఈలోయా ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో చాముండా దేవి ఆలయం ఒకటి. ఆలయ ప్రధాన దైవం చాముండాదేవి. చాముండాదేవి అంటే దూర్గాదేవి ఉగ్రరూపం. ఆలయంలో జంతువులు, పూలతో చేసిన కొయ్య శిల్పాలతో కూడిన పైకప్పు ఉంది. పర్వతశిఖరంలో ఉన్న ఈ ఆలయం నుండి చంబాలోయ సుందరదృశ్యం కనిపిస్తూ ఉంటుంది. భక్తులు తమ కోరిక తీరిన తరువాత ఇత్తడి గంటలను దేవికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాముండాదేవి పాదముద్రలు ఉన్నాయి.

సుయీ మాతా ఆలయం

మార్చు

సుయీ మాతా ఆలయం చంబాదేవి ఆలయం, బ్రజేశ్వరి ఆలయం మద్య ఉంది. ఆలయప్రధాన దైవం సుయీమాత. సుయీ మాత అంటే ప్రజలకొరకు ఆత్మత్యాగం చేసిన ప్రాతీయ రాజకుమారి. ఆలయకుడ్యాల మీద చిత్రించిన వర్ణరంజితమైన చిత్రాలు సుయీమాత కథను వివరిస్తుంటాయి.

గాంధీ గేట్

మార్చు

బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కర్జన్ 1900లో ఆరంజ్ గేట్ వద్ద మనఃపూర్వక స్వాగతం అందుకున్నాడు. ఇది చంబా లోయకు ప్రధాన ద్వారం.

భూరి సింఘ్ మ్యూజియం

మార్చు

భూరి సింఘ్ మ్యూజియంలో పలు పహారి పెయింటిగ్స్, శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడ 18-19 శతాబ్ధాలకు చెందిన బసోహి, కాంగ్రా పెయింటింగ్స్ మొదలైన ప్రఖ్యాత చుత్రాలు కూడా ఉన్నాయి. 7వ శతాబ్ధానికి చెందిన రుమాయి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనిని రాజా భూరీసింగ్ (1904-1919) నిర్మించి తన కుటుంబ సేకరణ వస్తువులను ఈ మ్యూజియానికి ఇచ్చాడు. ఇక్కడ ఎంబ్రాయిడరీ చేసిన చంబా రుమాళ్ళు ఉన్నాయి. వీటిని గృహిణులు తాయారుచేస్తారు.

సలూని

మార్చు

సహజసుందర ప్రదేశం అయిన సలూని, చంబా పట్టణం నుండి 56 కి.మీ దూరంలో ఉంది.

చౌరాసి ఆలయం

మార్చు

చౌరాసి ఆలయం రావి నదీతీరంలో ఉంది. చంబా పట్టణంలో ఉన్న ఈ ఆలయం 1000 సంవత్సరాల పూర్వం నాటిదని విశ్వసిస్తున్నారు. చంబా నగరం రావినది కుడి గట్తున ఉన్న పీఠభూమిలో దౌలధార్, జంస్కర్ పర్వతశ్రేణి మద్య ఉంది. చంబా పట్టణాన్ని 10వ శతాబ్దంలో రాజాసాహి వర్మన్ నిర్మించాడు. రాజాసాహి వర్మ కుమార్తె చంపావతి చంబా దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేది. రాజా కుమార్తె పేరు మీద చంబా పట్టణాన్ని నిర్మించాడు. ఇది 1000 సంవత్సరాల నుండి కొనసాగుతున్న నాగరికత, సాంస్కృతిక, అభివృద్ధి చెందిన మానవసమాజం విలసిల్లిన ప్రదేశం. అసమానమైన నివాసితగృహాల నిర్మాణం, ఆలయాలలోని అద్భుతమైన కొయ్య, లోహ శిల్పాలు, ప్రపంచ ప్రసిద్ధ రుమల్, చప్పల్, పహారి పెయింటిగ్స్ ఈ పట్టణ ప్రత్యేకతలు. చంబా పట్టణంలో పలు ఆలయాలు, ప్రత్యేక శైలి భవనాలు, పలు ఆసక్తికరమైన వస్తువులు ఉన్నాయి.

రాధాక్రిష్ణ ఆలయం

మార్చు

జిల్లాలో రాధాకృష్ణ ఆలయం, శివాలయం, గౌరీశంకర్ ఆలయం ఉన్నాయి. విష్ణ్వాలయమైన హరిరాయ్ ఆలయం 11వ శతాబ్దం కాలం నాటిది.

పండుగలు , ఉత్సవాలు

మార్చు

చంబా జిల్లాలో పలు ఉత్సవాలు జరుగుతుంటాయి. చంబాప్రజల కొరకు ఆత్మాహుతి చేసిన సుయీ రాజకుమార్తె స్మారకార్ధం సుయీమాత ఆలయం మార్చి - ఏప్రిల్ మాసాలలో 4 రోజుల కాలం నిర్వహించబడుతుంది.

  • కోతల తరువాత మొక్కజొన్న పంట చేతికి అందిన తరువాత మింజర్ ఉత్సవం ద్వారా ప్రజలు తమ సంరోషం వెలిబుచ్చుతుంటారు.

సరిహద్దులు

మార్చు

32°33′16″N 76°07′26″E / 32.55444°N 76.12389°E / 32.55444; 76.12389

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Cape Verde 516,100 July 2011 est.
  4. M. Paul Lewis, ed. (2009). "Bhattiyali: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.

బయటి లింకులు

మార్చు