చదలవాడ ఉమేశ్ చంద్ర

చదలవాడ ఉమేశ్ చంద్ర (మార్చి 19, 1966 - సెప్టెంబరు 4, 1999) ఆంధ్ర ప్రదేశ్కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నారు.

చదలవాడ ఉమేశ్ చంద్ర
Chadalavada umeshchandra.gif
చదలవాడ ఉమేశ్ చంద్ర
జననం చదలవాడ ఉమేశ్ చంద్ర
మార్చి 19, 1966
గుంటూరు జిల్లా పెదపూడి
మరణం సెప్టెంబరు 4, 1999
హైదరాబాదు
ఇతర పేర్లు "కడప పులి"
వృత్తి వైఎస్ఆర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్
ప్రసిద్ధి పేరు గాంచిన పోలీసు ఉన్నతోద్యోగి,
మతం హిందూ మతము
తండ్రి వేణుగోపాల రావు,
తల్లి నయనతార
హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం

విషయ సూచిక

బాల్యము, విద్యసవరించు

ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966గుంటూరు జిల్లా పెదపూడి (అమృతలూరు మండలం) గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. తండ్రి హైదరాబాదు ఆల్విన్ సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన పిదప నిజాం కళాశాల నుండి బి.ఎ. (1987) మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందారు. రెండింటిలోను ప్రథముడిగా నిలచి బంగారు పతకాలు సాధించారు[1].

ఉద్యోగ పర్వముసవరించు

1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994 అక్టోబరులో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నారు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టారు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. జూన్ 1997 నుండి ఏప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.

నవంబరు 1998 లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందారు.

విషాదముసవరించు

ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.[2].

సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు