చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)

తాజా వ్యాఖ్య: తరలింపు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

తరలింపు మార్చు

 Y సహాయం అందించబడింది

user:Vemurione గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- అర్జున (చర్చ) 03:46, 12 జూలై 2020 (UTC)Reply

తొందరపడి తరలించవద్దని ప్రార్ధన! (1) ఇప్పుడు ఉన్న చోట ఉంటే నష్టం ఏమిటి? (2) ససేమిరా తరలించి తీరాలి అంటే ప్రస్తుతం ఉన్న ప్రతికి కాపీ చేసి నేను మరొక చోట దాచుకునే వరకు ఏమీ చెయ్యకండి. ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న నిఘంటువుని కాపీ చేసి డేటాబేస్ లోకి మార్చాలి. ఆ తరువాత విక్స్నరీలోకి తరలించవచ్చు. ఇప్పుడు మార్చేరంటే నేను 40 ఏళ్లబట్టి పడుతున్న శ్రమ అంతా వ్యర్ధం అవుతుంది. ఇదొక్కటే నా దగ్గర ఉన్న Master Copy! ఇతర పెద్దలు కూడ సంప్రదించి చూద్దాం. Vemurione (చర్చ) 04:18, 17 జూలై 2020 (UTC)Reply
ఈ విషయంపై user:Chaduvari, user:K.Venkataramana కూడా ఏమంటారో? Vemurione (చర్చ) 04:21, 17 జూలై 2020 (UTC)Reply
అర్జున గారు అన్నట్టుగా ఈ పేజీలను వేరే వికీ ప్రాజెక్టుకు తరలించాలి. అయితే Vemurione గారి భవిష్యత్తు ప్రణాళికనూ (వికీ వంటి సైట్లలో ఉండే ఎడిట్ పెట్టెలకు ఆ డేటాబేసును చేర్చితే ఒనగూడగల ప్రయోజనాలనూ), ఇవి ఇక్కడే ఉంచి పనిచెయ్యడంలో వేమూరి గారికి ఉన్న వీలునూ పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం వీటిని వికీ నుండి తరలించకూడదని నేను భావిస్తున్నాను. మధ్యే మార్గంగా ఒక పని చెయ్యవచ్చు: ఈ నిఘంటువు పేజీలను వికీపీడియాలోనే మరో పేరుబరికి తరలించవచ్చు - ఉదాహరణకు "వికీపీడియా:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" లేదా "వాడుకరి:Vemurione/ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)". ఆ విధంగానైతే ఈ పేజీలను ఇక్కడ ఉంచడంలో ఇబ్బందేమీ ఉండదు. వేమూరి గారు ఇబ్బందేమీ లేకుండా తన ప్రాజెక్టు పనిని కొనసాగించనూ వచ్చు. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 04:50, 17 జూలై 2020 (UTC)Reply
Vemurione గారు, ఇలానే వుంచితే వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలు (నెలలో ఎక్కువ వీక్షణల ఉదాహరణ) పరిశీలించడానికి, విశ్లేషించడానికి సౌలభ్యం కాదు. ఈ పేజీలకు వీక్షణలు ఎక్కువగా వున్న ఇతర వ్యాస పేజీలతో పోలిక సరిగా వుండదు, అలాగే రెండవ కారణం వికీపీడియాలో బాట్ల ద్వారా మార్పులు చేసినపుడు ఈ పేజీలు అనుకోకుండా సవరణకు గురికావచ్చు. ఇక మూడవ కారణం, వికీపీడియా లో ఎటువంటి వ్యాసాలు వుండాలి అనేదానికి ఈ పేజీలు వ్యతిరేకం. తరలించితే సమస్యలు ఏవీ లేవు ఎందుకంటే వికీబుక్స్ లోకి తరలించినపుడు ఒక్క అక్షరం కూడా మారదు. వికీపీడియా లోగానే సవరణలు చేసుకోవచ్చు, ఈ పనులకు, భవిష్యత్ పనులకు ఏ మాత్రం అనుభవంలో తేడావుండదు. నేను ఇప్పటికే వికీబుక్స్ లో ఒక పుస్తకం తయారు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన అనుభవంతో చెపుతున్న మాటలివి.
డేటాబేస్ గా తయారు చేసి విక్షనరీ ఇతర సైట్లలో వాడుకునేందుకు చానా ఏళ్లక్రితం నేను మీతో సంప్రదించి రెండు ప్రయత్నాలు చేసినది మీకు తెలుసు. దురదృష్టవశాత్తు అవి ముందుకుపోలేదు.-- అర్జున (చర్చ) 05:38, 17 జూలై 2020 (UTC)Reply
user:Chaduvari గారు, ప్రోగ్రామింగ్ పరిభాషలో సాంకేతిక డేటాబేస్ అనేది ఏర్పడితే ఆ డేటాబేస్ ఎక్కడవున్న తెవికీలో వాడుకోవడానికి ఇబ్బందిలేదు ఎందుకంటే అటువంటి పనికి కావలసిన ఎక్స్టెన్షన్ లేదా ఇతర సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి. ఇక వికీపీడియా పేరుబరికి తరలించడం కన్నా వికీబుక్స్ కు తరలించడం మెరుగైనది ఎందుకంటే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలు ప్రధానపేరుబరి విషయాలకు ఫలితాలలో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశం వుంది. అంతే కాకుండా Vemurione గారు వికీపీడియాలో వుంచి ఇతరుల సహకారంతో నిఘంటువు వృద్ధిచేద్దామనుకున్న ఆలోచనకు వికీబుక్స్ స్థాపన ఆలోచనకు ఏమాత్రం తేడాలేదు. --అర్జున (చర్చ) 05:34, 17 జూలై 2020 (UTC)Reply
user:Vemurione గారు, ముందుగా మీరు ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం. మీరు వికీ బుక్స్ లో కూడా ఇలాంటి ఇంటర్ ఫేస్ వాడుకునే మార్పులు చేస్తూ వెళ్ళవచ్చు. అందుకు మేము ఎలాంటి సహాయానికైనా సిద్ధం. మీరు డేటాబేస్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా నన్ను ఏమైనా సహాయం చేయమంటే చేస్తాను. మిగతా సభ్యులకు నా సూచన ఏమిటంటే తరలింపు నిర్ణయానికి ముందు వేమూరి గారికి తగినంత సమయమివ్వాలి.- రవిచంద్ర (చర్చ) 12:08, 17 జూలై 2020 (UTC)Reply
గతంలో విక్షనరీకి తరలించవలసిన 257 వ్యాసాలుపై చర్చలు జరిగినవి.అయితే అవి వికీలో ఉండదగినవి కావని తొలగించబడినవి.ఇక్కడ పరిస్థితిని బట్టి Vemurione గారు, ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని వ్యర్ధం కాకుండా, స్వంత అవసరాల కోసం వికీని ఉపయోగించుకుంటాన్నారనే అభిప్రాయం రాకుండా (ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం వ్యక్తమైనందున), రవిచంద్ర గారు, "ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం" అని వెలిబుచ్చిన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:17, 17 జూలై 2020 (UTC)Reply
రవిచంద్ర, user:Chaduvari, యర్రా రామారావు, అర్జున మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. Vemurione (చర్చ) 20:41, 17 జూలై 2020 (UTC)Reply

స్పందించిన రవిచంద్ర, user:Chaduvari, యర్రా రామారావు Vemurione గార్లకు ధన్యవాదాలు. వికీబుక్స్ కి తరలించడం మంచిది. ఎడిట్ హక్కులు ప్రస్తుతం వికీపీడియాలో వున్నట్లు అప్రమేయంగా గుర్తించబడిన వాడుకరులు (autoconfirmed users) కు మాత్రమే వుంటుంది. తెలుగు వికీబుక్స్ లో క్రియాశీలత చాలా తక్కువ, కేవలం తెలుగు వాడుకరులలో User:veeven మాత్రమే ఇటీవల పని చేసారు. కావున మీ పేజీలు మార్పులకు గురవటం ఇప్పటికంటే తక్కువగా వుంటుంది. ఈ పని పూర్తిచేయడానికి, వికీబుక్స్ లో నేను నిర్వాహక ప్రతిపాదన చేర్చాను. మీరు అక్కడ 25 జులై 2020 లోగా ఆంగీకారం తెలుపవలసింది.--అర్జున (చర్చ) 06:58, 18 జూలై 2020 (UTC)Reply

అర్జున "అక్కడ" అంటే "ఎక్కడ" అంగీకారం తెలపాలో అర్థం అవలేదు. మీరు ఇచ్చిన లంకె దగ్గరకి వెళితే అక్కడ నేను ఏమి టైపు చేసినా కొక్కిరిబిక్కిరి తెలుగు అక్సరాలే కనబడుతున్నాయి తప్ప ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. దయచేసి నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే వివరంగా చెప్పండి. Vemurione (చర్చ) 01:08, 19 జూలై 2020 (UTC)Reply
Vemurione గారు, అక్కడ అంటే వికీబుక్స్ ప్రాజెక్టులోని సముదాయపందిరి( b:wikibooks:సముదాయ పందిరి),(వికీపీడియా రచ్చబండ లాంటిది). లింకు సరిగానే వుంది. దానిలో చివరి అంశంలో Agree అనే ఉపవిభాగాన్ని సవరించు ఎంపికచేసుకొని మీరు # చేర్చి వికీసంతకం చేస్తే చాలు. రవిచంద్ర గారు ఇప్పటికే అలా చేశారు. ఇంకా సమస్యలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 06:29, 19 జూలై 2020 (UTC)Reply
అర్జున ఇప్పుడు సరిగా చేసేనో లేదో చూడండి. Vemurione (చర్చ) 15:03, 20 జూలై 2020 (UTC)Reply
Vemurione గారు, సరిగానే చేశారండి. అన్నట్లు మీకు నిన్న వచ్చిన సమస్య సవరించినపుడు వికీ ఎడిటర్ పెట్టెపై తెలుగులో రాయటానికి టిక్ పెట్టి వున్నందున అనుకుంటాను. ఆ టిక్ తొలగించి, లేక అభిరుచులలో బీటా సౌలభ్యాలలో విజువల్ ఎడిటర్, New Wikitext mode చేతనం చేసుకుంటే వికీబుక్స్ లో రచనలు చేయటానికి ఇబ్బంది వుండందు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 04:22, 21 జూలై 2020 (UTC)Reply
Vemurione గారు,మీరు పేజీ సమాచారం తొలగించటాన్ని రద్దుచేశాను చర్చలు శాశ్వతం గనుక. {{సహాయం చేయబడింది}} చేర్చాను. మీరేమైనా విషయం చెప్పాలనుకుంటే ఇంకొక విభాగం చేర్చి రాయవచ్చు. --అర్జున (చర్చ) 05:10, 22 జూలై 2020 (UTC)Reply

తరలింపు ప్రయోగం మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాస పేజీ te.wikibooks లో నా వాడుకరిపేజీకి ఉపపేజీగా చూడండి. User:Vemurione గారు మరియు ఇతర సభ్యులు ఈ ప్రయోగాత్మక తరలింపు పై మీ స్పందనలు తెలపండి. te.wikibooks.org లో మార్పులు చేయాలనుకుంటే మీ అభిరుచులు లో విజువల్ ఎడిటర్, 2017 సోర్స్ ఎడిటర్ చేతనం చేసుకొని ప్రయత్నించండి. వాడుకరి ఇంటర్ఫేస్ 2012 ది కావున, వెతుకపెట్టెలో మరియు సముదాయపందిరి లో మార్పులు కి పాత కోడ్ వాడుతున్నారు. దానిని తాజాచేయుటకు అభ్యర్దన మెటాలో నివేదించాను. మీరు ఆమోదించిన తరువాత ప్రధానపేరుబరిలోకి దీనిని మార్చి కొత్త తరలింపులను ప్రధానపేరుబరిలో చేస్తాను.--అర్జున (చర్చ) 11:07, 27 జూలై 2020 (UTC)Reply

నేను ఆమోదం తెలుపుతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:27, 28 జూలై 2020 (UTC)Reply
నేను చూశాను. బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నాది. ప్రయోగం కోసం అతి చిన్న "చేర్పు" చేసి చూసేను. ఆ మార్పు చెయ్యడానికి "భాషలు" ఎదురుగా ఉన్న చక్రం మీద నొక్కి input భాషలో మార్పు చెయ్యవలసి వచ్చింది. అప్పుడు ఇంగ్లీషులో టైపు చెయ్యగలిగేను కాని, తెలుగు లిపిలో చెయ్యలేకపోయాను. Vemurione (చర్చ) 22:16, 28 జూలై 2020 (UTC)Reply
Vemurione గారు, ఈ రోజు తెలుగువికీపీడియా లో లాగా Universal language selector పనిచేయటం ప్రారంభించింది. కావున మీరొకసారి సవరణలు ప్రయత్నించి ప్రతిస్పందించండి.-- అర్జున (చర్చ) 07:39, 29 జూలై 2020 (UTC)Reply

తరలింపు మార్చు

Vemurione గారు, ఈ పేజీని b:వేమూరి_ఇంగ్లీషు-తెలుగు_నిఘంటువు/A లో నకలు చేశాను, ఆలాగే ఖాళీగా లేని ఇలాంటి పేజీలన్నీ నకలు చేశాను ( చూడండి పేజీలు). మీరొకసారి తనిఖీ చేసి, నకలు చేయటంలో దోషాలు లేవని నిర్ధారిస్తే తెవికీ లో ఈ పేజీలు తొలగిస్తాను. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:07, 30 జూలై 2020 (UTC)Reply

వికీబుక్స్ లో చర్చ ప్రకారం తొలగింపు హెచ్చరికలు పేజీలలో చేర్చాను. --అర్జున (చర్చ) 11:34, 2 ఆగస్టు 2020 (UTC)Reply
వికీపీడియాలో నిఘంటు పేజీలు నిన్న తొలగించాను.-- అర్జున (చర్చ) 06:40, 11 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" page.