చర్చ:ఖమ్మం

తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 14 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran

పేరు మార్చు

ఖమ్మం లెక ఖమ్మమ్ మెట్టు అను పేరు "కమ్మమెట్టు" నుండి వచ్చింది. చారిత్రక ఆధారాలు చూపబడ్డాయి.Kumarrao 07:07, 6 జనవరి 2010 (UTC)Reply

దానికి ముందు స్థంబాద్రి అని పిలిచేవారట, అ తరువాత ఉర్దూలోకి కంబం మెట్ గా తర్జుమా చేశారట. ఒక సారి ఈనాడులో వార్తాగా వస్తే చదివాను, ఖమ్మం జిల్లా ఎడిషన్లో. Chavakiran 05:01, 8 జనవరి 2010 (UTC)Reply
నేను ఉదహరించిన పుస్తకాలు 19వ శతాబ్దములో ఆంగ్లేయులు వ్రాసినవి. అప్పటి పేరు కమ్మమెట్టు.ఆధారములు లేకపోయిననూ కాకతీయ కమ్మ నాయకుల ప్రాభవము వల్ల ఊరికి ఆపేరు వచ్చి ఉండాలి. ఇప్పటికీ ఖమ్మం ప్రాంతము లో కమ్మవారు మిగుల సంఖ్యలో ఉన్నారు.Kumarrao 16:16, 24 ఆగష్టు 2010 (UTC)
ఇప్పటికీ కొన్ని బోర్డులు స్తంబాద్రి అనే వ్రాస్తారు, ఖమ్మంలో. దీనికీ కులానికీ ఏ ప్రమేయం ఉండి ఉండదు. లోకల్లో కూడా ఆలా ఎవరూ చెప్పుకోరు. కాకతీయుల కాలంలో మెట్ అని ఉర్దూ పదం ఊరికి ఉంచే సంప్రదాయం లేదు కదా. అయితే కమ్మపాడు అనో, కమ్మపాళెం అనో పిలిచే వారు కులం పేరుతో వస్తే. కమ్మం మెట్టు తో పాటు కమ్మ మెట్టు అని కూడా కొంత కాలం పిలిచి ఉండవచ్చు. ప్రస్తుతానికి నేను వ్రాసిన సమాచారం ఉంచుదాం, అనవసర వివాదానికి తావు లేకుండా, మరింత సమాచారం సేకరించటానికి ప్రయత్నిస్తాను కొంత సమయం ఇవ్వండి. Chavakiran 01:21, 25 ఆగష్టు 2010 (UTC)
కమ్మమెట్ పదముతో గూగుల్ పుస్తకాలు చూడండి. ఆంగ్లేయులు కమ్మమెట్టు ను కమ్మమెట్ అన్నారు. మీరు ఇచ్చిన సమాచారానికి దయచేసి ఆధారములు చూపించగలరు. Kumarrao 17:04, 25 ఆగష్టు 2010 (UTC)

కమాన్ బజారు మార్చు

కమాన్ బజార్ చిత్రం చాలా బాగుంది . రావి చెట్టు గురించి ఇంకేమన్న చరిత్ర తెలుసా ఎవరికన్న కమాన్ బజారు అంటే కమాను (ద్వారతోరణం) కట్టిన బజారు అని అర్ధం

Return to "ఖమ్మం" page.