చర్చ:వందేమాతరం

(చర్చ:జాతీయగేయం నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: జనగణమన టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari

జనగణమన మార్చు

నేను ఠాగూర్ రచించిన "జనగనమన" మన జాతీయ గేయం అని అనుకున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 06:52, 18 జూలై 2007 (UTC)Reply

జనగణమన జాతీయ గీతం (నేషనల్ యాన్దెమ్), ఇదేమో జాతీయ గేయం (నేషనల్ సాంగ్)! తెలుగులో గీతం, గేయం - ఈ రెండూ ఒకేలా అనిపిస్తాయి -ఒకటే కూడానేమో! యాన్దెమ్ కు మరో పేరేదైనా ఉందేమో తెలీదు. (అసలు జాతీయ గీతంగా వందేమాతరం పెట్టాలనే ప్రతిపాదన ఉండిందట, ముస్లిములకు ఉండిన అభ్యంతరాల కారణంగా జనగణమన పెట్టాల్సి వచ్చిందట.) కానీ జాతీయోద్యమంలో వందేమాతరం పాత్ర ఎనలేనిది కాబట్టి, దాన్ని జాతీయ గేయం చేసారని భోగట్టా! __చదువరి (చర్చరచనలు) 07:25, 18 జూలై 2007 (UTC)Reply

మసీదు ముందు వందేమాతరం ఆలాపన మార్చు

జమాతే-ఉల్‌మా-ఇ-హింద్‌ జారీ చేసిన ఫత్వాను వ్యతిరేకిస్తూ ముస్లింల ఆధ్వర్యంలో ఇక్కడ ఓ మసీదు ముందు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతోపాటు పలువురు మతస్థులు పాల్గొన్నారు. వందేమాతరం పాడడం... ఇస్లాంను వ్యతిరేకించినట్టు కాదు అని రజిక్‌ అన్నారు. తొలుత ఓ దేవాలయం ముందు ఆలపించి అనంతరం 'రుక్మిణి బాలాజీ మందిర్‌' ఆధ్వర్యంలో కొందరు ర్యాలీగా బజార్‌ చౌక్‌ వచ్చారు. అయితే మసీదు ముందు కూడా వందేమాతరం పాడాలని వారిని రజిక్‌ కోరారు. ఈ నేపథ్యంలో తమతో కల్సి వందేమాతరం పాడాలని రజిక్‌ పలువురిని అభ్యర్థించారు.

ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే మార్చు

దారుల్‌ ఉలుమ్‌ సంస్థ వందేమాతరం ఇస్లాంకి వ్యతిరేకమంటూ 2006లోనే ఫత్వా జారీచేసింది. ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే. ప్రజలు ఫత్వాకు కట్టుబడి ఉండొచ్చు లేదా ఉపేక్షించవచ్చు అని దారుల్‌ ఉలుమ్‌ ఉప కులపతి మౌలానా అబ్దుల్‌ ఖలిక్‌ మదర్సి అన్నారు.(ఈనాడు10.11.2009)--Nrahamthulla 07:46, 10 నవంబర్ 2009 (UTC)

జనగణమణ ఉండగా.. వందేమాతరం ఎందుకు? మార్చు

వందేమాతరం సంస్కృతంలో ఉన్నందున.. దాని అర్థమేంటో తమకు తెలియదని, అల్లాను ఆరాధించే తాము దేశం కోసం ఎన్ని త్యాగాలకైన సిద్ధమేనని, అయితే దేశాన్ని దేవతగా మాత్రం కొలవలేమని ఆలిండియా షియా పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు పేర్కొన్నారు. మనకు జాతీయ గీతంగా జనగణమణ ఉండగా.. వందేమాతరం.. ఎందుకని వారు ప్రశ్నించారు.(ఈనాడు12.11.2009)

Return to "వందేమాతరం" page.