చర్చ:దశావతారములు

తాజా వ్యాఖ్య: దశావతారాల బొమ్మ టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Chavakiran

ఎవరో బలరాముని శ్రీకృష్ణుని నుండి వేరు చేశారు. అది తప్పు దయచేసి వారిద్దరిని కలపండి. ఇద్దరు అన్నదమ్ములు...--మాటలబాబు 21:34, 3 జూన్ 2007 (UTC)Reply

ఈ దశావతారాలలో బలరాముడు ఒకరని కొందరు..ఆయన కాదని పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్నాయి. మీరు యే ఆధారంగా బలరాముని ఉంచాలో సెలవిస్తారా? ఎప్పట్నించో ఈ వ్యాసాన్ని విస్తరించాలనుకుంటున్నాను అందులో బలరాముని గురించి కూడా తప్పకుండా రాస్తాను --వైఙాసత్య 02:32, 4 జూన్ 2007 (UTC)Reply
బలరాముని తిసెయ్యాలని ఎవరో రాసారు (Vemurione అనుకుంటా). పైగా దాంతో కలిపి 11 అయ్యాయి. బలరాముడు దశావతారాల్లో ఒకటి కాదు అని నా ఉద్దేశ్యం. అందుకే, నేనే తీసేసాను. బలరాముడు దశావతారాల్లో ఒకటి అయితే, మరి ఈ మూసలో మిగిలి ఉన్న పదింటిలో తోసెయ్యాల్సింది దేన్నో మనం చర్చించాలి. __చదువరి (చర్చరచనలు) 09:10, 4 జూన్ 2007 (UTC)Reply
అదంత సులభంగా తేలే లెక్కకాదు. సవివరంగా వ్యాసంలో రాస్తా --వైఙాసత్య 16:49, 4 జూన్ 2007 (UTC)Reply

దశావతారాల బొమ్మ

మార్చు

దశావతారాల బొమ్మలో చివర 10వ అవతారంగా వేంకటేశ్వరుని చూపించారు. 10వ అవతారం కల్కిని అనునది నిర్వివాదాంశం కాబట్టి ఈ బొమ్మను సరైన బొమ్మతో మార్చాలి --వైఙాసత్య 16:53, 4 జూన్ 2007 (UTC) బొమ్మలో బలరాముణ్ణి చూపించారు. ఆంగ్ల వికీపీడీయాలొ బుద్ద అవతారం గురించి చాలా చర్చ జరిగింది. ఒకరేమౌ బుద్దుడు దశావతారలలొ ఒకరు కాదు అని వ్రాస్తే మరొకరు అవును అని వ్రాశారు. మన తెవికీ మాత్రం బుద్ద అవతారం లొ మాత్రం గౌతమబుద్దుని బుద్ద అవతారంగా శాస్త్రి గారు అనుకొంటా అంగీకరించలేదు. దీని మీద తెవికీ లొ కూడా మంచి తటస్థ దృక్కోణం లోచర్చ జరగవలసి ఉంది.--మాటలబాబు 17:06, 4 జూన్ 2007 (UTC)Reply


ఇందులో అంత ఆలోచిండానికేముంది. దశావతారాలు ఏ పురాణాలలోనూ లేవు అని విన్నాను, అది కేవలము తరువాత తరువాత హిందూ మత ప్రచారము కొరకు వాడబడినాయి. బాగవతములో అయితే ఇరవై ఒక్క అవతారాల గురించి చెప్పబడినది. ఇహ బుద్ద వర్సస్ బలరామ లో కొన్ని హిందూ మత శాఖలు బుద్దుడిని దశావతారలలో ఒకరిగా కొలవరు దానికి బదులుగా బలరాముణ్ణి సబ్స్టిటూట్ చేస్తారు దాన్నే మనము ఫాలో అయ్యి కొంత మంది బలరాముణ్ణి చెపుతారు అని ఓ మాట అని ఏకాదశ అవతారాల గురించె చెపితే పోతుంది Chavakiran 08:45, 5 జూన్ 2007 (UTC)Reply

బుద్దుడు విష్ణువు అవతారమేనా?

మార్చు

Bramhasri Samavedam Shanmukha Sarma గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరణ ను ఈ దిగువనుదహరింపబడినది.----K.Venkataramana (talk) 04:55, 26 అక్టోబర్ 2013 (UTC)


దశావతారాలలో " బౌద్ధ అవతారం అంటే గౌతమ బుద్ధుడా? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది....
దాని గురించి పూజ్య గురువుదేవులు శ్రీ సామవేదం గారు "ఋషిపీఠం " పత్రిక 2002 జులై లో ప్రచురింబడ్డ "జిఙ్యాస అనే
శీర్షిక లో ఇచ్చిన సమాధనము మరోసారి గుర్తుచేసుకుందాము...
దశావతారాలలో "బౌద్ధవతారం" అంటే చరిత్రలోని గౌతమ బుద్ధుడేనా?
నమో బౌద్ధ అవతారాయ
దైత్యస్త్రీ మానభంజినే
అచింత్యాశ్వత్థ రూపాయ
రామాయాపన్నివారిణే
అని " శ్రీ మదాపన్నివారకరామస్తొత్రం" లో ఉంది. దీని గురించి తెలుప ప్రార్ధన" అని
ఒక పాఠకులు అడిగిన ప్రశ్న కి గురుదేవులు ఇలా వర్ణించారు..
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు " గౌతమ బుద్ధుడు కాదు అని చెప్పుకోవాలి
దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు గౌతమ బుద్ధుడు కాదనే చెప్పుకోవాలి.
ప్రాచీన పురాణ వాఙ్మయాన్ని పరిశీలిస్తే ఈ విషియం స్పష్టమవుతుంది.
త్రిపురాసురుల భార్యలు మహాపతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల త్రిపురలను ఎవరు జయించలేకపోతారు.
అప్పుడు ఆ శక్తిని ఉపసమ్హరింపచేయ్యడానికి లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు.
కాని ఆ బుద్ధుడు ,గౌతమ బుద్ధుడు అవతారాలు, రూపాలు వేరు !
సమ్మోహనకరమైన రూపముతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి ,మోహితులై ,ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు.
దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు.
ఇదే విషియం "ఆపన్నివారక స్తోత్రము " లో ఉంది. "ద్వైత్యస్త్రీమనభంజినే" అంటే రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని
భంగం చేసినవాడు అని అర్ధం.
ఇలాగ మన పురాణ్ణాలలో బుద్ధుడు గురించి చెప్పిన విషియము!
పైన వృత్తాంతాన్ని అన్నమయ్య "దశావతార వర్ణనలో" పేర్కొన్నాడు.
'పురసతుల మానములు పొల్లజేసినచేయి.
ఆకాసాన బారేపూరి
అతివలమానముల కాకుసేయువాడు"
ఆకాసాన విహరించే ఊరులు - త్రిపురాలు.
వారి మగువల ధర్మాన్ని తప్పించినవాడు. అప్పటి పరిస్థితుల బట్టి లోకరక్షణ కోసం స్వామి ధరించిన లీలావతారమిది.
ఆ బుద్ధునికీ గౌతమ బుద్ధునికి సంబంధం లేదు !


Return to "దశావతారములు" page.