చర్చ:నామకరణము

తాజా వ్యాఖ్య: వ్యాసం లో దోషాలు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith

ఈ వ్యాసంలో గల మూసలు బట్టి చూస్తే ఇది హిందూ మతంలో పిల్లలకు యేవిధంగా నామకరణం చేస్తారో తెలియజేసేదై ఉండాలి. ఈ వ్యాసంలో హిందూ మతంలో పిల్లలకు యేవిధంగా నామకరణం చేస్తారో, దానికి యేర్పాటు చేయబడిన ఉత్సవం గూర్చి తెలియ జేశారు. కానీ రసాయన శాస్త్రంలో కర్బన సమ్మేళనాలకు యేవిధంగా నామకరణం చేస్తారో ఈ వ్యాసం లో చేర్చ రాదని నా అభిప్రాయం. దానికి వేరొక వ్యాసం ఉండాలి. ఐ.యు.పి.ఎ.సి విధానం గూర్చి విస్తృతంగా విస్తరించవచ్చు. అది విద్యార్థులకు ఉపయోగంగా ఉంటుంది. కాని దానికి ఈ వ్యాసం లో స్థానం లేదని అభిప్రాయం. రచయిత అభిప్రాయం ప్రకారం స్థానం ఉన్నచో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం వంటి అనేక శాస్త్రాలలో నామకరణ విధానాల గూర్చి కూడా చర్చించాలి కదా! శాస్త్రాలతో సంబంధం లేనట్లయితే మతంతో సంబంధం లేకుండా పిల్లలకు నామకరణం చేసే విధానం గూర్చి వివిధమతాలలో గల విధానాలను గూర్చి ఈ వ్యాసం లో విస్తరించవచ్చు. అందువల్ల కర్బన సమ్మెళనాల నామకరణ విధానాన్ని తొలగించాలి. దానికి వేరుగా కర్బన రసాయన శాస్త్రంలో IUPAC నామకరణ విధానం అని వ్యాసాన్ని సృష్టించి దానిలోనికి ఆ విభాగాన్ని తరలించాలని నా అభిప్రాయం.(  కె. వి. రమణ. చర్చ 16:25, 7 మార్చి 2013 (UTC))Reply

వ్యాసం లో దోషాలు మార్చు

ఈ వ్యాసం లో గల విభాగంలో రచయిత ఈ క్రింది విధంగా రాసారు.

"3 అదనపు మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వడం: కర్బన మూలకంలో ఇతర మూలకాలను గుర్తించి తగిన పేరు ఇవ్వాలి. ఉదాహరణ: CH3 వుంటే మీథేన్ CH2 వుంటే ఇథేన్ Cl2 వుంటే క్లోరో Br2 వుంటే బ్రోమో I2 వుంటే ఐయొడొ ఈ అదనపు మూలకం వున్న నంబరును కూడ ఆ పేరు ముందు వుంచాలి. ఉదాహరణ: Cl2 అనే మూలకం 2 అనే నంబరు గల కర్బన్ దగ్గర వుంటె "2-క్లోరో "అని పేరు ఇవ్వాలి. Note:ఇది OME, OH........వంటివి వుంటె వర్తించదు."
రసాయన శాస్త్రంలో పైన సూచించిన పేర్లు ఇవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆల్కేన్లు,అల్కీన్లు మరియుఅల్కైన్లు వాటి సాధారణ పార్ములాలు వాటిద్వారా నామకరణ విస్తరణ, కొన్ని ప్రమేయ సమూహాలు వాటిద్వారా నామకరణ విధానం, గొలుసులు, శాఖాయుత శృంఖలాలు గల సమ్మే:ళనాలు వాటి నామకరణ విధానం గూర్చి వివరంగా రాయాలి. గాని ఏవో ఒకటి రాసి అందరినీ అయోమయం లోకి నెట్టివేశారు. కనుక పై వాక్యాన్ని తొలగించాలి. రచయిత అల్కైల్ గ్రూపులైన మిథైల్, ఇథైల్ వంటివాటి ఫార్ములాలైన CH3- ,C2H5 - లను కూడా చేర్చాలి. పై వాక్యంలో CH3 వుంటే మీథేన్ CH2 వుంటే ఇథేన్ అనునది పూర్తిగా తప్పు గా ఉన్నది.(  కె. వి. రమణ. చర్చ 16:33, 7 మార్చి 2013 (UTC))Reply
Return to "నామకరణము" page.