చర్చ:నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం

తాజా వ్యాఖ్య: సంభాషణలు ఎలా ఉండాలి: చర్చ టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

YesY సహాయం అందించబడింది

వెంకట రమణ గారూ! ఆంగ్ల వికీలో ఉన్న ప్రతి వ్యాసం, తెవికీ లో ఉండాలనే తర్కం నేను చెప్పను. కానీ ఒకమారు ఆంగ్ల వ్యాసాన్ని పరిశీలించండి. ఎవరినీ నొప్పించకుండానే, తటస్థ దృక్కోణంతో, అందరి పేర్లని ప్రస్తావిస్తూనే, జరిగినది జరిగినట్టు, వికీ నియమాలకి లోబడే, ఎంతో చక్కగా ఉన్నది. ఇందులో ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు లేవు. ఎవరినీ దెప్పి పొడవలేదు. దీనికి ఎక్కువగా మార్పులు చేసింది కూడా ఒక్క వాడుకరే. చర్చా పేజీలో మూసని కూడా పరిశీలించగలరు. భారతదేశపు వివాదాలుగా ఈ ఆంగ్ల వ్యాసం వర్గీకరించబడినది. మన దేశంలో వివాదాలని మనం తెలుసుకోవటానికి ఇటువంటి వ్యాసాలు ఉపయోగపడతాయన్నది నా అభిప్రాయం. వివాద పరిష్కారాలు తెలియాలంటే ముందు వివాదాలు ఏమిటో తెలియాలి కదా?

  • ఒక యువతి ఏ విధంగా చట్టాన్ని ఉపయోగించుకోగలదు?
  • దాని పర్యవసానాలు ఏమిటి?
  • చట్టాల దుర్వినియోగం వల్ల ఎవరికి లాభం?
  • దుర్వినియోగం చేసే బదులు, ప్రత్యాన్మాయంగా రాజీ పడి పరిష్కారం చేసుకొంటే ఏమిటి లాభం?
  • చివరకు తను దుర్వినియోగపరచిన చట్టాలే తన పై ఎలా ప్రయోగించబడే ఆస్కారం ఉన్నది?

-వంటివి తెలుసుకొనటానికి ఈ వ్యాసం ఒక మచ్చుతునకగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.

  • వ్యవస్థల రూపకల్పన
  • వాటి లో లొసుగులు
  • లొసుగుల దుర్వినియోగం వలన వచ్చే దుష్ఫలితాలు
  • అవే లొసుగులు ఎంతటి ప్రమాదకరమైనవో

-ఈ వ్యాసం ద్వారా మనం పాఠకులకి తెలియజేయవచ్చును. సావధానంగా ఆలోచించి నిర్ణయానికి రాగలరు. మీరే కాదు, ఇతర అనుభవ శీలురు కూడా దీని పై చర్చించగలరు. అందరికీ ఇదే నా ఆహ్వానం. సమిష్టి నిర్ణయంతో ముందుకెళదాం, తెవికీ నాణ్యతని పెంచుదాం. - శశి (చర్చ) 18:21, 21 జూలై 2015 (UTC)Reply

చర్చల ద్వారా నోటబులిటీ ఉన్న వ్యాసాలనే వికీలో చేర్చాలనే ఏకాభిప్రాయం కుదిరినందున, నోటబులిటీ లేని వ్యాసాలకి తొలగింపు మూస చేర్చాను. ఈ వ్యాసానికి తగిన నోటబులిటీ ఉన్నందున దీనికి సరైన మూలాలు చేర్చటం మొదలు పెట్టాను. - శశి (చర్చ) 07:55, 22 జూలై 2015 (UTC)Reply

సంభాషణలు ఎలా ఉండాలి: చర్చ మార్చు

నాయుడు గారు, మరియు వెంకటరమణ గారు ఈ వ్యాసంలో మీరు కూడా పాల్పంచకొంటున్నందుకు ధన్యవాదాలు. Quote మూస ఉన్న విషయం తెలియక అది వరకు నేను ఇందులోని సంభాషణలకు బాక్సు కట్టాను. తర్వాత తెలుసుకొని దానిని సుహైబ్ ఇల్యాసీ వ్యాసంలో ప్రయోగించాను. పరిశీలించగలరు. నాకు తెలిసి సంభాషణలకు కోట్ మూసయే అత్యంత అనువైనది. వీటిపై మనం ఒక ఏకాభిప్రాయానికి వస్తే, అన్ని వ్యాసాలలోనూ, సంభాషణలకు ఒకే మూసను వాడవచ్చును. మీకు ఆసక్తి ఉన్నచో మీరు చేసినా సరే, లేదా నన్నే చేయమన్నా సరే. అంతిమ ధ్యేయం మాత్రం, సంబంధిత అన్ని వ్యాసాలలోనూ, సంభాషణలు ఒకే విధంగా (యూనిఫార్మిటీ) ఉండేలా చూడటం. ఈ సంభాషణలు ఇటాలిక్ లో ఉండాలా, బోల్డ్ లో ఉండాలా అనే వాటిపై కూడా మీ అభిప్రాయాలు తెలుపవచ్చును. మీ విలువైన అభిప్రాయాలను స్వాగతిస్తున్నాను. - శశి (చర్చ) 16:07, 18 సెప్టెంబరు 2015 (UTC)Reply

శశి గారూ {{Quote box}} అనే మూస ఉన్నది కదా. దానిని వ్యాఖ్యలకు ఉపయోగిస్తే బాగుంటుంది.-- కె.వెంకటరమణచర్చ 16:20, 18 సెప్టెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ, ధన్యవాదాలు. నేపథ్యం సబ్ హెడ్ క్రింద ప్రయోగించాను. చక్కగా ఉన్నది. పరిశీలించగలరు. నాయుడు గారి అభిప్రాయం కూడా కనుక్కొని ముందుకెళదాం! - శశి (చర్చ) 16:44, 18 సెప్టెంబరు 2015 (UTC)Reply
Return to "నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం" page.