చర్చ:భారత ప్రామాణిక కాలమానం

తాజా వ్యాఖ్య: 82.5 డిగ్రీ రేఖాంశం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: లక్ష్మీ వర ప్రసాద్
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


డేలైట్ సేవింగ్ టైం

మార్చు

డేలైట్ సేవింగ్ టైం ను తెలుగులో ఏమంటారు లేదా ఏమనవచ్చు --వైఙాసత్య 03:24, 8 జూన్ 2007 (UTC)Reply

మనకది లేదు కాబట్టి ఆ మాటా లేనట్టుంది. మక్కికి మక్కీగా "పగటి ఆదా సమయం" లేదా "పగటి పూట ఆదా సమయం"అ నొచ్చేమో! అలాగే పేజీ పేరుపై నాదో సూచన. పేరులో ప్రామాణిక అని ఉండాలి. అది కాకుండా పేరును అసలు "భారత ప్రామాణిక సమయం" అని అంటే ఎలా ఉంటుంది? __చదువరి (చర్చరచనలు) 03:33, 8 జూన్ 2007 (UTC)Reply
వార్తలలో ప్రామణిక కాలమానం అని విన్నానో ప్రామాణిక సమయం అని విన్నానో గుర్తురాలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఒకటి అని అలా ఉంచా భారత ప్రామాణిక సమయం వాడుకలో ఉన్న పదమైతే దానికే మారుద్దాం --వైఙాసత్య 03:50, 8 జూన్ 2007 (UTC)Reply
వెలుతురు వినియోగ సమయం, వెలుతురు సద్వినియోగ సమయం, వెలుతురు ఆదా సమయం --వైఙాసత్య 08:43, 8 జూన్ 2007 (UTC)Reply
వార్తలలో అయితే బారత కాలమానం ప్రకారం అని చదువుతారు Chavakiran 15:10, 8 జూన్ 2007 (UTC)Reply
ఆంగ్ల ప్రజలకు ఒక జబ్బు ఉంది వారు అక్షరాలు వ్రాస్తారు వాటిని పల్కరు , గ్రీన్ విచ్ అని రాస్తారు కాని పిలిచేటప్పుడు గ్రీనిచ్ అంటారు. (జబ్బు అని రాయడం పరుషంగా ఉంది కాని రాయక తప్పడం లేదు)--మాటలబాబు 22:12, 12 జూన్ 2007 (UTC)Reply
ఇండియన్ స్టాండర్డ్ టైం ని ప్రభుత్వ 8,9,10 వ తరగతి పాఠ్యపుస్తకాల్లో భారత ప్రామాణిక కాలమానం అని అనువదించారు. మనం టైం (ఇండియన్ స్టాండర్డ్ టైం లాంటి ప్రయోగంలో)కి టైంజోన్ కి మరియు ఇంకొన్ని సంబంధిత విషయాలకు కాలమానం అని వాడుతున్నాం. అక్కడ చాలాసార్లు భా.ప్రా.కా అని పొడి అక్షరాలు కూడా ఉపయోగించారు. ఇక టైంజోన్ ని సమయప్రాంతం అని అనువదించటం కూడా అంత వాడుకలో ఉన్న అనువాదం కాదనుకుంటా. --వైజాసత్య 11:19, 19 జూన్ 2007 (UTC)Reply

తెలుగు పదాలు

మార్చు
  • టైంజోన్ - కాలమండలం
  • డేలైట్ సేవింగ్ - పొద్దు పొదుపు
  • డేలైట్ సేవింగ్ టైం - పొద్దు పొదుపు సమయం
  • సింక్రొనైజ్ -?

82.5 డిగ్రీ రేఖాంశం

మార్చు

పాఠ్య పుస్తకాల్లో 82.5 డిగ్రీ రేఖాంశం భారతదేశం గుండా పోతుంది అని వుంటుంది.

అలాగే భారతదేశం 68.5 మరియు 97.5 రేఖాంశాల మధ్యలో వుంటుంది అని ఉంటుంది.

రెండు రేఖాంశాల వ్యత్యాసం 15 డిగ్రీలు తో నిర్ణయించబడ్డాయి. అయితే భారతదేశం లో 75 మరియు 90 డిగ్రీల రేఖాంశాలు ఉంటాయి. వాటి ఆధారంగా మనం సమయం నిర్ణయించుకోవాలి కానీ వాటి సగటు (75&90) 82.5తో మనం సమయం లెక్కిస్తున్నాం ఎందుకు...? లక్ష్మీ వర ప్రసాద్ (చర్చ) 13:55, 20 డిసెంబరు 2018 (UTC)Reply

మరియు ఆ రెండు రేఖాంశాల ప్రస్తావన కూడా ఎక్కడా ఉండదు. ఎందుకు...? లక్ష్మీ వర ప్రసాద్ (చర్చ) 14:00, 20 డిసెంబరు 2018 (UTC)Reply

Return to "భారత ప్రామాణిక కాలమానం" page.