చర్చ:ముసునూరి నాయకులు

(చర్చ:ముసునూరి కమ్మ రాజులు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: ముసునూరి నాయకులు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
ముసునూరి నాయకులు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఈ వ్యాసము కూర్చుటకు సమయము పట్టవచ్చును..కుమారరావ్

పూర్తయినది. వ్యాఖ్యలకు స్వాగతము.Kumarrao 11:12, 26 ఏప్రిల్ 2008 (UTC)Reply

త్రైలింగ మార్చు

కుమారరావు గారికి నమస్కారం....! మీ వ్యాసాలు అద్భుతంగా ఉన్నవి....

కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ పూర్తిస్థాయిలో చరిత్రకారులు విస్మరించిన అపురూప, అద్వితీయ, చిరస్మరణీయ మహావీరులు ముసునూరినాయకులు..... ఇంకాబయటి ప్రపంచానికి తెలియాల్సిన అనేకానేక సాహసోపేత గాథలు మరుగునపడినట్టుగా తోస్తున్నది.....

ఈభూమిపై చరిత్రనుండి పాఠాలు నేర్వని ఏకైక జాతి మనదే అన్నది నిజం........... అందులోనూ తెలుగువారు......


నా పేరు త్రైలింగస్వామి... నేను వికి లో 'భావనారాయణస్వామి ' అను వ్యాసాన్ని రాసాను..

ఇంకా కొన్ని వ్యాసాలు పుణ్యక్షేత్రాలపైనా, చారిత్రాత్మక ప్రదేశాలపైనా రాయాలని ఉన్నది... అందుకొరకు దయ ఉంచి ఈ రంగములో అనుభవం ఉన్నవారిని సంప్రదించటం ఎలానో కొంచెం తెలియజేయగలరు..

ఇపుడు నా అభిప్రాయం రాద్దామని మార్చు అనే సదుపాయాన్ని ( లింక్ ) ద్వారా రాసాను.... ఇలా చేయవచ్చా అని సందేహం......ఇది సరి అయినదేనా కాదా అన్నది కూడా తెలియటంలేదు.... ఇంకో విధంగా చేయాలా?

త్రైలింగ..

పేరు మార్పు ప్రతిపాదన మార్చు

ముసునూరి నాయకులు కమ్మవారనడం ఉన్నదే, కానీ వారిని ముసునూరి నాయకులు అనే వారి చరిత్ర వెలికి తెచ్చిన చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యవహరించారు. తెలుగు వికీపీడియా అన్నది మౌలిక పరిశోధనకు స్థలం కాదు కాబట్టి, ఇప్పటికే పరిశోధకులు ఏ పేరుతో వ్యవహరించారో అదే పేరు కొనసాగించడం సరైన పని. కనుక మునుసూరి కమ్మ రాజులు అన్న పేరును మునుసూరి నాయకులు అని మార్చాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:28, 5 జనవరి 2018 (UTC)Reply

నేను సమర్ధిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 12:59, 5 జనవరి 2018 (UTC)Reply
ఈ వ్యాసంలో ఉన్న రిఫరెన్సు - బౌద్ధం ఆంధ్రం 88వ పేజీలో మునుసూరి నాయకుల గురించి ఉన్న ప్రస్తావన కూడా ఇక్కడ సందర్భోచితం కనుక ఇస్తున్నాను - జాయపసేనాని తర్వాత చెప్పుకోదగిన కమ్మ నాయకులు మునుసూరి నాయకులు. నూజీవీడు ప్రాంతానికి చెందిన వీరు, కాకతీయుల పతనానంతరం ఢిల్లీ నవాబును పారద్రోలి కొంతకాలం వరంగలులో పాలించారు. పోలయ, కాపయ నాయకుల వీరోచిత గాథలు స్వర్ణాక్షరాలతో లిఖించదగినవి. కానీ వీరి ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక్కడ మునుసూరి నాయకులు కమ్మవారేనన్న స్పష్టత ఉంది, అయితే వారిని మునుసూరి నాయకులు అనే రచయిత ప్రస్తావించాడు తప్ప మునుసూరి కమ్మ రాజులు అనో మరోటో ప్రస్తావించలేదన్నది గమనించాలి. సుస్పష్టమైన ఆధారాలు ఉండడం, రవిచంద్ర వంటివారూ పరిశీలించి సమర్థించడం ఆధారంగా వ్యాసం పేరు మునుసూరి నాయకులుగానే మార్చాను. --పవన్ సంతోష్ (చర్చ) 08:54, 6 జనవరి 2018 (UTC)Reply

ముసునూరి నాయకులు మార్చు

ఈ చర్చ వాడుకరి:Pavan santhosh.s వాడుకరి పేజీలో జరిగింది. కానీ ఈ చర్చ పేజీలో జరగాల్సినది కాబట్టి కాపీ చేసి పేస్టు చేస్తున్నాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 05:18, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నమస్కారం పవన్ సంతోష్ గారు. "ముసునూరి నాయకులు" వికీ పేజీ విషయంలో నేను మీతో చర్చించ దలుచుకున్నాను. ముసునూరి నాయకులు పేజీని మీరు నిరవధికంగా సంరక్షించారు అని అర్థం అయింది. ఆ పేజీని ఎడిట్ చెయ్యటానికి సాధ్యపడట్లేదు. కాని అందులో ఎన్నో తప్పులు ఉన్నవి. ప్రముఖ చరిత్రకారుల పుస్తకాల ప్రకారం....

1. వారి రాజ్యం చివరి కాకతీయ ప్రతాపరుద్రుని మరణం తరువాత అనగా క్రీ. శ. 1325 కాలంలో ఏర్పడింది. కానీ పేజీలో ఎంతో ముందు సమయాన్ని సరయిన ఆధారాలు లేకుండా చేర్చటం జరిగింది.

2. రాజుల అసలు పేర్లు ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు. కానీ అందులో నాయుడు అనే బిరుదులను చేర్చటం జరిగింది ఆధారాలు లేకుండా.

3. ఈ వంశంలో పాలించింది కేవలం ముగ్గురు రాజులే. ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు, ముసునూరి వినాయకదేవుడు. కానీ పేజీలో అనేక మంది రాజుల పేర్లను ఇవ్వడం జరిగింది ఆధారాలు లేకుండా.

4. మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రసిద్ద చరిత్రకారులుతో సహా అనేక మంది చరిత్రకారులు ఈ వంశీకుల పాలనాకాలం క్రీ. శ. (1325-1368) అని ఇవ్వడం జరిగింది.

5. ఈ వంశీకుల రాజధానులు రేఖపల్లి, ఓరుగల్లు, రాజమండ్రి అని చరిత్రకారులు తెలిపారు.

ఈ విషయాలను కొద్దిగా గమనించవలసిందిగా నా విన్నపం. Lillinan1 (చర్చ) 13:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Lillinan1 గారూ, ఈ వ్యాసం మీద పాక్షిక ధోరణులతో పదే పదే పాక్షికమైన సమాచారాన్ని చేర్చడంతో చివరకు ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు ఆ సంగతి గమనించే ఉంటారు. చర్చ:ముసునూరి నాయకులులో ఆ వివరాలన్నీ చూడొచ్చు. ఇకపోతే మీరు చెప్పిన సంగతుల విషయమై నాకు నాలుగు అంశాలకు నాలుగు ప్రామాణికమైన మూలాలు ప్రస్తావిస్తూ చర్చ:ముసునూరి నాయకులులో మీరు కోరుతున్న మార్పులను రాయండి. నా వాడుకరి చర్చ కన్నా ఆ వ్యాసపు చర్చలో రాస్తే నిర్ణయంపై ఇతర సముదాయ సభ్యులూ పునరాలోచన చేయవచ్చు. లేదంటే ఆయా అంశాలను పరిశీలించి నిర్వాహకులే చేర్చవచ్చు. లేదంటే మరేదైనా నిర్ణయం సానుకూలంగా తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఆధారయుతంగా (ఆయా విషయాలు చారిత్రకంగా స్థిర సత్యాలే కావచ్చు ఏదోక ఆధార గ్రంథం చూపించండి). ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:04, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

కొంత సమయం ముసునూరి నాయకులు పేజీని నిర్బధం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పులను తగిన ఆధారాలతో నేను సవరించదలుచుకున్నాను. ఆ తరువాత మళ్ళీ నిర్బందించుకోవచ్చుగా కోరుతున్నాను. Lillinan1 (చర్చ) 17:18, 7 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఈ కింద వచ్చేదంతా ఇక్కడ జరిగే చర్చ

Lillinan1 గారూ, మీరు చేసిన పలు మార్పులు గమనించాను. అవి పాక్షికంగా, వికీపీడియా నిష్పాక్షిక ధోరణికి దెబ్బగా ఉన్నాయని గమనించి, ఆ సంగతి మీ చర్చ పేజీలో రాశాను. కొన్నిటిని తిప్పికొట్టాల్సి వచ్చింది కూడాను. ఈ నేపథ్యంలో నిష్పాక్షికంగా లేని మార్పులతో పదే పదే దాడులు జరుగుతున్నందున సంరక్షించిన ఈ వ్యాసాన్ని మీరు ప్రత్యేకించి మార్పులు చేయడానికి వీలుగా కొద్దిరోజులు సంరక్షణ తొలగించడం సాధ్యం కాదు. వ్యక్తిగతంగా మీ మార్పులు మెరుగుపడడానికి, అవగాహన పెరగడానికి వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నమ్మదగ్గ మూలాలు చదవండి. --పవన్ సంతోష్ (చర్చ) 09:21, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Return to "ముసునూరి నాయకులు" page.