చర్చ:రతన్ టాటా

తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: T.sujatha
  • ఈ వ్యాసం వికీ విధానాలకు అనుసరించి వ్రాయబడినది కాదు. వికీ గురించిన అవగాహన లేని వ్యక్తి ఐ.పి.అడ్రెస్‌తో సృష్టించిన వ్యాసం.
  • ఇది క్రమానుసారంగా వ్రాయబడిన వ్యాసం కాదు.
  • ఇది కాపీ చేసి పేస్టు చేసారు. మొదటి దిద్దుబాటులోనే 60,000 బైట్లకంటే అధికమైన సమాచారం చేర్చబడింది.
  • వ్యాసంలో తటస్థదృక్కోణం లేదు.
  • వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా తొలగించి కొత్తగా వ్యాసం సృష్టించడం ఉత్తమం. అలా చేస్తేనే వ్యాసం నాణ్యమైనదిగా ఉంటుంది.
  • వాణిజ్యరంగంలో సరికొత్త చరిత్ర సృష్టించి చరిత్రలో స్థిరస్థాయిగా నిలువతగిన రతన్ టాటా వంటి గొప్పవ్యక్తి గురించి వ్రాసే వ్యాసం వికీనియమాలను అనుసరిస్తూ నాణ్యమైనదిగా ఉండాలని భావిస్తున్నాను.
  • ఈ వ్యాసం స్థానంలో ఇప్పుడున్న సమాచారం తొగగించి సరికొత్త వ్యాసం సృష్టించే విషయంలో సహసభ్యుల అభిప్రాయం కోరుతున్నాను. t.sujatha (చర్చ) 08:27, 14 జూన్ 2017 (UTC)Reply
Return to "రతన్ టాటా" page.