చర్చ:రెడ్డివారి నానబాలు
పాలకాడ, నాగార్జుని, పచ్చబొట్లాకు, నానపాల, దుగ్ధి ఇన్ని పేర్లు ఉండగా, రెడ్డివారి నానబాలు అనే రెండు పదాలతోటి వ్యాసము వినసొంపుగా ఉండదేమో ? రెడ్డిగారూ.......! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:00, 22 ఏప్రిల్ 2013 (UTC)
ఆయుర్వేద మహర్షి పండిత ఏల్చూరి రచించిన స్వదేశీ వనమూలికావేదం పుస్తకంలో రెడ్డివారినానుబాలు పేరుతోనే వ్రాయబడింది. అంతేకాక ఈ చెట్టు ఆ పేరుతో ప్రాచుర్యం పొందటానికి గల కారణాలు కూడా వివరించబడ్డాయి. అందులోని సమాచారం రెడ్డివారినానుబాలని ఎందుకంటారు? సిద్ధనాగార్జునుని బాటలోనే వేమనకవిగా మారిన వేమారెడ్డిగారు కూడా ఈ పాలకాడరసంతోనే బంగారాన్ని తయారు చేయడం వల్ల ఆయన పేరు మీదుగా ఈ మొక్కకు రెడ్డివారినానుబాలు అనే పేరు వాడుకలోకి వచ్చింది. అని ఉంది. అలాగే దీని ఆకులను దంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్లు పొడిచేవారు. అందువల్ల దీనికి పచ్చబొట్లాకు అనే పేరు స్థిరపడింది. అని ఉంది.
తల్లిపాలు వ్యాసంలో కూడా రెడ్డివారి నానుబాలు అనే పేరు ఉపయోగించబడింది. అందులోని కొంత సమాచారం :
రెడ్డివారి నానుబాలు (యూఫోర్బియా హిర్తా) మొక్కల ఆకులను కూరగా చేసుకొని తినాలి, లేదా పొన్నగంటి కూర ఆకులను లేదా పచ్చి బొప్పాయి కూర తినాలి. బాలింతలు ఎక్కువగా మసాలాలు, వాతం చేసే పదార్ధాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
పై కారణాల వలన నేను రెడ్డివారి నానబాలు పేరుతోనే వ్యాసాన్ని ప్రారంభించాను. మీ YVSREDDY (చర్చ) 19:26, 22 ఏప్రిల్ 2013 (UTC)