చర్చ:73 వ రాజ్యాంగ సవరణ
ఒక్కో సవరణకు ఒక్కో పేజీ అవసరమా..?
మార్చుఒక్కొక్క రాజ్యాంగ సవరణకూ ఒక్కో పేజీ పెట్టి రాయదగినంత సమాచారం ఉంటుందా అని ఆలోచిస్తే ఉంటుందనే అనిపించింది నాకు. సవరణ ఎందుకు చేసారు, దానికి దారితీసిన పరిస్థితులేంటి, ఇందుకోసం గతంలో జరిగిన ప్రయత్నాలేంటి, సవరణను పార్లమెంటులో ఉభయ సభల ఆమోదాన్ని (రెండు సభల్లోనూ విడివిడిగా మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకోవడం మామూలు బిల్లులంత తేలికైన సంగతేమీ కాదు) తెచ్చుకోవడం కోసం ప్రభుత్వం ఏమేం చేసింది, ఈ మొత్తం వ్యవహారంలో ఇబ్బందులేమైనా ఎదురయ్యాయా వగైరా విశేషాలను చేరుస్తూ రాస్తే ఒక్కో సవరణ వ్యాసం చక్కగానే రూపొందుతుంది అని నాకు అనిపిస్తోంది. దాని కోసం శ్రమ పడాల్సి ఉంటుంది, తప్పదు. కానీ.., ఊరికే ఇలా నాలుగైదు వాక్యాల వ్యాసం రాసి పడేస్తే దానికి పెద్ద విలువ ఉండదు. దాని బదులు, మొత్తం వందకు పైచిలుకు ఉన్న సవరణలన్నిటినీ కలిపి ఒక జాబితా పేజీ చేస్తే బాగుంటుంది. మహేశ్వర రాజు గారికి మాత్రం ఈ వ్యాసాన్ని విస్తరించి, తీర్చిదిద్దే ఆలోచన ఉందని భావిస్తున్నాను. ముందుగా వ్యాసాన్ని 73 వ రాజ్యాంగ సవరణ (73 వ భారత రాజ్యాంగ సవరణ అనేది మరింత సరైనా పేరు. కానీ తెవికీ సందర్భానికి భారత లేకపోయిన పర్లేదని నా ఉద్దేశం.) అనే పేరుకు తరలించాలి. అది నేను చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 15:29, 15 సెప్టెంబరు 2019 (UTC)
73 రాజ్యాంగ సవరణ
మార్చుచదువరి గారూ మీ చెప్పినట్లే రెండు రోజుల్లో పూర్తి వాస్యం రాస్తాను. 73 భారత రాజ్యాంగ సవరణ అని పేరు మార్చండి ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 03:00, 16 సెప్టెంబరు 2019 (UTC)
- మహేశ్వర రాజు గారూ, ధన్యవాదాలు.__చదువరి (చర్చ • రచనలు) 08:20, 16 సెప్టెంబరు 2019 (UTC)
73 రాజ్యాంగ సవరణ
మార్చుచదువరి గారూ. ఒక సారి వ్యాసం చూసి మూసలు తొలిగించండి. అలాగే మీరు అన్నట్టు 73 భారత రాజ్యాంగ సవరణ అని వ్యాసం పేరు మార్పు చేయండి. ఇంకా అదనపు సమాచారం ఉంది కానీ అది పెద్ద అవసరం ఉండదు అని భావిస్తున్నాను. బిల్లు చరిత్ర రాసినందుకు ధన్యవాదములు అండి.. అలాగే 74 రాజ్యాంగ సవరణ వ్యాసం కూడ మెదలు పెడతాను అండి. ఒక సారి 73 ఆర్టికల్ వ్యాసం చూసి మూసలు తొలిగించండి ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 12:41, 16 సెప్టెంబరు 2019 (UTC)
- Ch Maheswara Raju గారూ, వ్యాసం నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలను పరిశీలించండి:
- సాక్షి ఎడ్యుకేషన్ వ్యాసాన్ని ఎత్తి ఇక్కడ పెట్టేసినట్టుగా ఉంది. దాన్ని వికీ ఒప్పుకోదు. మీ స్వంత వాక్యాలతో రాయాలి.
- అసలు ఈ సవరణ ఉద్దేశం ఏమిటి అనేది ఎక్కడా లేదు. ప్రవేశికలో దాన్ని టూకీగా రాయాలి.
- ఈ చట్టంలోని అంశాలను మరీ విస్తారంగా రాసామేమోననిపిస్తోంది.
- విభాగాలు ఎక్కువయ్యాయి.
- పోతే, వ్యాసాన్ని తరలించమని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు.., ఈసరికే తరలించేసాను కదా? మీరు మళ్ళీ వెనక్కి మీరు పెట్టిన పేరే పెట్టాలని అనుకుంటున్నారా? మరో సంగతి, చర్చలో ఎవరినైనా సంబోధించేటపుడు, వారి వాడుకరి పేజీ లింకును ఇస్తే వాళ్లకు ఒక పిలుపు పోతుంది - 'ఇదుగో.. మహేశ్వరరాజు గారు నిన్ను పిలుస్తున్నారు, చూడు' అని. నేను పిలుస్తున్నట్టు మీకు వస్తోంది కదా, అలాగ. మీరు ఆ లింకు ఇవ్వకపోవడం వలన నాకు అలాంటి పిలుపు రావట్లేదు. అంచేత ఈ చర్చను నేను మిస్సయ్యే అవకాశం చాలా ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 01:52, 17 సెప్టెంబరు 2019 (UTC)
సాక్షి ఎడ్యుకేషన్
మార్చువాడుకరి:Chaduvari గారూ నేను ఈ సమచారం GBK బి కృష్ణ రెడ్డి పంచాయతీ సెక్రటరీ పుస్తకం నుండి గ్రహించినది అండి. మీరు అన్నట్లు సాక్షి ఎడ్యుకేషన్ లింకు చేశాను అండి. ఈ పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు సాక్షి ఎడ్యుకేషన్ కాపీ చేసాడు..
ఇది ఎలా పెట్టాలి అండి అర్థం కావడం లేదు చర్చలో ఎవరినైనా సంబోధించేటపుడు, వారి వాడుకరి పేజీ లింకును ఇస్తే వాళ్లకు ఒక పిలుపు పోతుంది - 'ఇదుగో.. మహేశ్వరరాజు గారు నిన్ను పిలుస్తున్నారు, చూడు' అని. నేను పిలుస్తున్నట్టు మీకు వస్తోంది కదా, అలాగ
Ch Maheswara Raju (చర్చ) 02:02, 17 సెప్టెంబరు 2019 (UTC)
- Ch Maheswara Raju గారూ, ఎక్కడి నుండి గ్రహించినా, ఉన్నదున్నట్లుగా పెట్టకూడదండి. కాపీహక్కులకు విరుద్ధం. కాబట్టి అలాంటి సమాచారాన్ని తీసేసి, మీ స్వంత వాక్యాలతో రాయండి. నేను సాక్షి ఎడ్యుకేషనుకు లింకు చెయ్యమనలేదు, స్వంత వాక్యాల్లో రాయాలని చెప్పానండి. __చదువరి (చర్చ • రచనలు) 15:14, 19 సెప్టెంబరు 2019 (UTC)
భారత ఎంబ్లెమ్ అవసరమా?
మార్చుఈ వ్యాసంలో భారతదేశ ఎంబ్లెమ్ ఉండాల్సిన అవసరం కనిపించలేదు. __చదువరి (చర్చ • రచనలు) 11:40, 15 డిసెంబరు 2019 (UTC)