చర్మ సంబంధ వస్తువులు అనగా చెప్పులు మొదలగువాటిని తయారు చేయువారిని చర్మకారులని అంటారు. ఈ వృత్తిని ఎక్కువగా మాదిగ కులానికి చెందినవారు నిర్వర్తిస్తుండేవారు. ఉత్తర భారతదేశంలో వీరిని అంటరానివారిగా చూస్తారు[1]. వీరు ఈరోజు షెడ్యూలు కులాల కింద వర్గీకరించబడ్డారు. వీరు భారతదేశమంతటా, పాకిస్తాన్, నేపాల్ లో కనిపిస్తారు. రాం నారాయణ్ రావత్ ప్రకారం చర్మకారుల కులం చెప్పులలాంటి జంతుచర్మ సంబంధ వస్తువుల అవసరం పెరిగినప్పటి నుండి ఆవిర్భవించింది అనీ, అంతకు ముందు వీరు కర్షకులనీనూ.

చెప్పులు తయారుచేస్తున్న చర్మకారుడు
చర్మకారుడు

వృత్తిపై యంత్రాల ప్రభావంసవరించు

పూర్వకాలంలో పల్లెల్లో చర్మ కారులు చెప్పులను తయారు చేసి సంతల్లో, గ్రామాల్లో అమ్మేవారు. కొనుగోలు దారులు ధాన్యం రూపంలో చెల్లించి చెప్పులను కొనేవారు. మారిన కాలాని కనుగుణంగా ఈ వృత్తిలో కూడా పెట్టు బడిదారులు యంత్రాలతో ప్రవేశించడంతో వీరు తయారుచేసిన చెప్పులకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో వీరి సంపాదన తగ్గిపోయింది. వృత్తిని నమ్ముకున్న చర్మకారులు పరిస్థితి దీనంగా మారింది.

పూర్వం చర్మకారులు సొంతంగా చెప్పులను చుట్టి అమ్మేవారు. ఈ చెప్పులను పొలం పని చేసేవారు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం గొర్రెల కాపరులు మాత్రమే వీటిని కొంటున్నారు. యువతీ యువకులు యంత్రాలతో తయారైన చెప్పులనే ఎక్కువగా వాడుతుండటం మూలంగా వారు కుట్టిన చెప్పులు కొనే వారు లేక చర్మకారులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు పూర్వం తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన పానగల్ మండలంలో 300 నుండి 400 చర్మకార కుటుంబాలుండేవి. ప్రస్తుతం 60 మాత్రమే మిగిలాయి. [2]

ప్రముఖులుసవరించు

  • రవిదాస్‌ ఒక యోగి, కవి, తత్వవేత్త, సంఘ సంస్కర్త. చర్మకారుల కుటుంబంలో పుట్టి, సామాజిక తత్వవేత్తగా అనేకమందిని ఆకట్టుకున్న ప్రబోధకుడు.[3]
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలానాటి అధికార చిహ్నంలో ధర్మచక్రం మధ్యలో ఉన్న ఈ పూర్ణఘటాన్ని విదికుడు అనే చర్మకారుడు చెక్కినట్లు చరిత్ర చెబుతోంది.[4] అమరావతిలో ఆనాడు ఒక చర్మకారుడు ఆరామానికి విరాళంగా ఇచ్చిన పూర్ణ కుంభమే నేటి మన ఆంధ్రప్రదేశ్ అధికార ముద్రలో ఉంది.
  • మాదార (మాదిగ) చెన్నయ్య : గుప్త భక్తుడై వుండేవాడు. ఇతడు దేవునికి అంబలిని తినిపించి తనిపింప చేసినకథ అనేక కావ్య పురాణాల్లో ప్రసిద్ధంగా తెలుపబడింది.[5]

సినిమాలుసవరించు

 
స్వయంకృషి సినిమాలో చర్మకారుని పాత్రలో చిరంజీవి
  • 1987 సెప్టెంబర్ 3న విడుదలైన స్వయంకృషి సినిమాలో కథానాయకుడు చిరంజీవి చర్మకారుడు. రావిచెట్టుకింద చెప్పులు కుట్టడం అతని వృత్తి. కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు, చర్మకారుడు సాంబయ్యగా చిరంజీవి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.[6]

ఆచారాలుసవరించు

ఆంధ్రప్రదేశ్ లో నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం లో ప్రతి సంవత్సరం ఒక చర్మకారుడు స్వామి వారికోసం తయారుచేసిన చెప్పులను కానుకగా సమర్పిస్తారు. రాత్రి సమర్పించిన పాదరక్షలను ఉదయం పరిశీలిస్తే అవి కొన్నినెలలుగా వాడినట్టుగా అరిగిపోయి దుమ్ము పట్టి ఉంటాయి. స్వామి వారు రాత్రి పూట ఆ చెప్పులు వేసుకుని విహారయాత్రకు వెళ్ళివస్తారని భక్తుల నమ్మకం.[7]

మూలాలుసవరించు

  1. "Chamars | Encyclopedia.com". www.encyclopedia.com. Retrieved 2021-06-10.
  2. "చర్మకారుల బతుకు చిధ్రం | జోగులాంబ‌ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-06-10.
  3. "ఐదు శతాబ్దాల క్రితమే సమానత్వాన్ని కోరిన రవిదాస్‌ | Prajasakti". www.prajasakti.com. Retrieved 2021-06-10.
  4. Suvarnaraju (2018-08-16). "ఆంధ్రప్రదేశ్ అసలైన అధికార చిహ్నం:పూర్ణ కుంభం కాదు...ఘటం!;తప్పుసరిదిద్దిన ప్రభుత్వం". telugu.oneindia.com. Retrieved 2021-06-10.
  5. "మాదార (మాదిగ) చెన్నయ్య". Lingayat Religion. Retrieved 2021-06-10.
  6. "చిరంజీవి స్వయంకృషి కి 25 ఏళ్లు-Andhravilas-Latest Telugu Movie News, Movie Gossips-Tollywood headlines with videos, photo galleries". Andhravilas. Retrieved 2021-06-10.
  7. Kashetti, Srikanth. "All You Need To Know About Anantpur's Divine Temple Of Lord Hanuman!". Chai Bisket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-10.

బాహ్య లంకెలుసవరించు