చార్ బైత్ (Urdu-چار بیت) - s 400 సంవత్సరాల చరిత్ర గల ఈ కళారూపం, ఓ కళాకారుల గుంపుతో ప్రదర్శింపబడే కళ. ఈ గుంపులో దఫ్ కళాకారులు, గాయకులు వుంటారు. ఈ కళా రూపంలో చార్ బైత్ లేదా నాలుగు వాక్యాలతో కూడిన కవిత ముఖ్య భూమిక వహిస్తుంది. ఈ కళారూపం నేటికినీ రాంపూర్ (ఉత్తర ప్రదేశ్), టోన్క్ (రాజస్థాన్), భోపాల్ (మధ్యప్రదేశ్), హైదరాబాదు (ఆంధ్రప్రదేశ్) లో సజీవంగా ఉంది.[1] సంగీత నాటక అకాడమీ ఈ కళారూపాన్ని జానపద కళారూపంగా గుర్తించింది.

పుట్టుపూర్వోత్తరాలు మార్చు

 
ఇస్ఫహాన్, ఇరాన్ లోని ఒక చిత్రం లో 'దఫ్'.

ఈ కవితా కళారూపం పుట్టుపూర్వోత్తరాలు చూస్తే, దీని కాలం, 7వ శతాబ్దంలో అరేబియాకు చెందినా 'రజీజ్' కళారూపం వరకు వెళుతుంది.[2] అలాగే పర్షియన్ పదమైన “చార్ బైత్ ” నాలుగు కవితా పంక్తులుగా సూచిస్తుంది. అనగా నాలుగు పంక్తులు గల కవితా రూపం. ఈ కవితా కళారూపం ఒక గ్రూపు లయబద్దంగా పాడుతుంది. ఈ గానానికి తోడుగా దఫ్ను వాయిస్తారు. ఈ దఫ్ పరికరం అరేబియా సంస్కృతికి చెందినా వాయిద్య పరికరం.[1] నేటికినీ ఈ వాయిద్య పరికరాన్ని ఫకీర్లు వాయిస్తుంటారు. ఈ కవితా కళారూపం, పర్షియా నుండి, ఆఫ్ఘనిస్తాన్ గుండా భారత్ కు వచ్చింది. మరీ ముఖ్యంగా ఆఫ్ఘన్ కు చెందినా సిపాయిలు దీనిని మొఘల్ సైన్యంలో తరచుగా ఉపయోగించేవారు. ఆవిధంగా మొఘల్ కళారూపం గానూ గుర్తింపు పొందింది.

కూర్పు మార్చు

తొలిదశలో ఈ కళారూపం పర్షియన్, పష్తూ భాషలలో వుండేది, ఆతరువాత కాలాలలో ఉర్దూ భాష లోనూ వచ్చింది. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ఈ కళారూపం క్రమంగా జానపద కళారూపంగా రూపాంతరం చెందింది. ఈ కళారూపం ఉర్దూ గజల్ రూప పరిమళాన్నిస్తుంది.

నేటి కళాకారులు మార్చు

కళా రూపం మార్చు

సాధారణంగా, “చార్ బైత్ ” ఒక సుదీర్ఘ కవితా రూపం, దీనిలో నాలుగు పంక్తుల కవితలు గోలుసుక్రమంలో పాడుతారు. దీని ఇతివృత్తంలో యుద్ధాలు, యుద్ధవిశేశాలు, శౌర్యపరాక్రమాలు, శృంగారం,, కొన్ని సార్లు ఆధ్యాత్మికత కూడా కానవస్తాయి. పాత తరంలో సూఫీ తత్వ బోధనలూ కానవస్తాయి. తరువాయి కాలంలో రాజకీయ విషయాలు చోటుచేసుకున్నాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Enjoy “Chaar Bayt” poetry this weekend - The Hindu
  2. ":: Parampara Project | Performing arts of Uttar Pradesh". Archived from the original on 2017-09-14. Retrieved 2014-07-15.
  3. "Chaar-Bayt". Archived from the original on 2014-07-14. Retrieved 2014-07-15.
"https://te.wikipedia.org/w/index.php?title=చార్_బైత్&oldid=4055837" నుండి వెలికితీశారు