చిక్కబళ్ళాపూర్

కర్ణాటక లోని జిల్లా

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో చిక్కబళ్ళాపూర్ జిల్లా ఒకటి. చిక్కబళ్ళాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.2007లో కోలార్ జిల్లాలోని గౌరిబిద్నూర్, బగెపల్లి, చికబల్లపూర్, సిద్లగట్ట, చింతామణి తాలూకాలను వేరుచేసి చిక్కబళ్ళాపూర్ జిల్లా రూపొందించబడింది. నార్త్ సౌత్ సిక్స్ లైన్ జాతీయరహదారి - 7, తూర్పు - పడమర రహదారి - 58 జిల్లా గుండా పయనిస్తున్నాయి. బెంగుళూరు నుండి చిక్కబళ్ళాపూర్, దొడ్డగంజూర్, శ్రీనివాసపూర్, కోలార్ వరకు రైలు మార్గం ఉంది.

చిక్కబళ్ళాపూర్ జిల్లా

ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ
జిల్లా
నందీ హిల్స్ పర్వతపాదాల వద్ద భోగనందీశ్వరాలయ సముదాయాలు
నందీ హిల్స్ పర్వతపాదాల వద్ద భోగనందీశ్వరాలయ సముదాయాలు
దేశం India
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కబళ్ళాపూర్
విస్తీర్ణం
 • మొత్తం4,210 కి.మీ2 (1,630 చ. మై)
భాష
 • అధికారికకన్నడ
ప్రామాణిక కాలమానంUTC+5:30 (ఐఎస్‌టి)
పిన్‌
562 101
టెలిఫోన్ కోడ్08156
వాహనాల నమోదు కోడ్KA-40

పట్టణాలు, పర్యాటక ఆకర్షణలుసవరించు

 
The Dargha of Hazrath Peer Syed Gayazaulla Shah Naseeri Located Honnenahalli Hyderabad Highway Chikkaballapur (2.5 km from Chikkaballur)

పట్టణాలు ముద్దెనహళ్ళి ప్రఖ్యాత ఇంజనీర్, స్టేట్స్‌మన్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యా జన్మస్థలం. ఇక్కడ సత్యసాయిబాబా విశ్వవిద్యాలయం (కనివెనరాయణపురా) ఉంది.

 • నంది హిల్స్, నంది కోట (నంది దుర్గ్) చిక్కబళ్ళాపూర్ తాలూకాలో ఉన్నాయి. చిక్కబళ్ళాపూర్ తాలూకాలో పలు చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.
 • దర్గా ఆఫ్ హజ్రత్ మిస్కీన్ షాహ్ వాలి (చిక్కబళ్ళాపూర్).
 • నంది హిల్స్ సమీపంలో జిబిన్ కోట కూడా ఉంది.

చరిత్రసవరించు

 
Yali pillars at Ranganatha temple, Rangasthala

మరిగౌడ పురాణం అనుసరించి " అవంతిమాలా కుమారుడు బైరిగౌడ ఒకరోజు వేటకొరకు కొడిమంచన హళ్ళి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ వేటకుక్కల ఎదురుగా ధైర్యంగా నిలిచిన ఒక కుందేలును గమనించాడు. అది చూసి ఆశ్చర్యచకితుడైన రాజప్రతినిధి తన కుమారుడితో ఇక్కడి ప్రజల ధైర్యసాహసాలకు ఇది సంకేతం అని చెప్పడు. తరువాత విజయనగ చక్రవర్తి అనుమతితో అక్కడ ఒక కోటను, పట్టణం నిర్మించాడు. అది తరువాత చిక్కబళ్ళాపూర్ పట్టణంగా అభివృద్ధి చెందింది. బైచిగౌడ పాలనా సమయంలో మైసూరు ఆధీనంలో ఉన్న ఈ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1762 లో చిక్కప్పనాయకా పాలనా సమయంలో ఈ పట్టణం మూడు మాసాలకాలం హైదర్ అలీ ఆధీనంలో ఉంది. హైదర్ ఆలీ సైన్యాలను చిక్కబళ్ళాపూర్ పట్టణం నుండి వెనుతీయడానికి చిక్కాప్పనాయకా 5లక్షల పకోడాలు ఇచ్చాడు.

మురారిరాయసవరించు

చిక్కప్పనాయకా తరువాత గూటీకి సంబంధించిన మౌరాయ సాహాయంతో తన అధికారాన్ని తిరిగి పొదడానికి ప్రయత్నించాడు. ఆయన చిక్కప్పనాయకాతో నంది హిల్స్ వద్ద తలదాచుకున్నాడు. వెంటనే హైదర్ అలీ చిక్కబళ్ళాపూర్‌ను స్వాధీనం చేసుకుని చిక్కప్పనాయకాను ఖైదు చేసాడు. లార్డ్ కార్న్‌వాల్స్ జోక్యంతో చిక్కబళ్ళాపూర్ నారాయణగౌడాకు స్వాధీనం చేయబడింది. చిక్కబళ్ళాపూర్‌కు 18 కి.మీ దూరంలో ఉన్న పెరెసంద్ర శివాలయాన్ని సందర్శించాడని లార్డ్ కార్న్‌ వాల్స్ దర్శించాడని కొన్ని ఆధారాలు తెలియజేస్తున్నాయి. తరువాత విషయం తెలుసుకున్న టిప్పు సుల్తాన్ చిక్కబళ్ళాపూర్‌ మీద ఆధిపత్యాన్ని కోరాడు. బ్రిటిష్, టిప్పు సుల్తాన్‌కు చిక్కబళ్ళాపూర్‌ కొరకు జరిగిన యుద్ధం తరువాత టిప్పు సుల్తాన్ అపజయం అనుసరించి బ్రిటిష్ నంది హిల్స్‌ను స్వాధీనం చేసుకుని చిక్కబళ్ళాపూర్‌ పాలన నారయణగౌడాకు వదిలిపెట్టింది.తరువాత తిరిగి టిప్పు, బ్రిటిష్ ప్రభుత్వానికి మద్య జరిగిన యుద్ధంలో నారయణగౌడా చిక్కబళ్ళాపూర్‌ మీద ఆధిక్యాన్ని కోల్పోయాడు. తరువాత టిప్పు సుల్తాన్‌ బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో ఓడిన తరువాత చిక్కబళ్ళాపూర్‌ మైసూరు పాలకులైన ఉడయార్ల ఆధీనంలోకి మారింది. తరువాత కర్ణాటక రాష్ట్రంలో భాగంగా మారింది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,254,377, [1]
ఇది దాదాపు. ట్రినిడాడ్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 385 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 9.17%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 2981 [1]
జాతియ సరాసరి (928) కంటే. 968:1000, [1]
అక్షరాశ్యత శాతం. 70.08%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.
 • ద్యవరహల్లి, షిద్లఘత్త తాలూకా
 • పెరెజగె
 • గంగసంద్ర విలేజ్, గౌరిబిదనుర్ తాలూకా
 • అదెగరహల్లి విలేజ్
 • విదురష్వథ, గౌర్బిదనుర్ తాలూకా
 • చిక్కకురుగొదు, గౌరిబిదనుర్ తాలూకా
 • గౌంపల్లి విలేజ్
 • ఎగూ బందల్ల కరే విలేజ్
 • సుద్రవపల్లి విలేజ్
 • చిలకలనెర్పు గ్రామం, చింతామణి తాలుకాలో
 • ఇమరెద్ద్య్ హళ్లీ విలేజ్, చింతామణి తాలూకా.
 • మవుకెరె విలేజ్, చింతామణి తాలూకా.
 • యెనిగదలె విలేజ్, చింతామణి తాలూకా.
 • ఓఒలవది విలేజ్, చింతామణి తాలూకా.
 • కురుబురు]] విలేజ్, చింతామణి తాలూకా.
 • మెలుర్ గ్రామం, షిద్లఘత్త తాలూకా.
 • కురుతహల్లి గ్రామం, చింతామణి తాలూకా.
 • మల్లసంద్ర గ్రామం, బగెపల్లి తాలూకా
 • అప్పెగౌదనహల్లి, షిద్లఘత్త తాలూకా.
 • చిక్కబల్లాపూర్ తాలూకా షెత్తిగెరె.
 • కనిథహల్లి చిక్కబల్లాపూర్ తాలూకా.
 • ఇత్తప్పనహల్లి చిక్కబల్లాపూర్ తాలూకా.
 • కరెకల్లహల్లి, గౌరిబిదనుర్ తాలూకా
 • పెరెసంద్ర, చిక్కబల్లాపూర్ తాలూకా
 • పెసలపర్థి, బగెపల్లి తాలూకాలోని

జిల్లాకు చెందిన సుప్రసిద్ధ వ్యక్తులుసవరించు

చిత్రమాలికసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011: Chikkaballapura". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Trinidad and Tobago 1,227,505 July 2011 est. Cite web requires |website= (help)
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 Cite web requires |website= (help)

kothanur

వెలుపలి లింకులుసవరించు

బయటి లంకెలుసవరించు