చిత్రమ్ కాదు నిజమ్
చిత్రమ్ కాదు నిజమ్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై కన్నడంలో 2014లో విడుదలైన ‘6-5=2’ సినిమాను తెలుగులో ‘చిత్రమ్ కాదు నిజమ్’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ నిర్మించిన ఈ సినిమాకు కేఎస్ అశోక దర్శకత్వం వహించాడు. కృష్ణప్రసాద్, తనుజ, జాను, విజయ్ చందూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015 ఏప్రిల్ 3న విడుదలైంది.[1]
చిత్రమ్ కాదు నిజమ్ | |
---|---|
దర్శకత్వం | కేఎస్ అశోక |
కథ | కేఎస్ అశోక |
నిర్మాత | గుడ్ సినిమా గ్రూప్ |
తారాగణం | కృష్ణప్రసాద్, తనుజ, జాను, విజయ్ చందూర్ |
ఛాయాగ్రహణం | సత్య హెగ్డే |
సంగీతం | శేఖర్ చంద్ర |
విడుదల తేదీ | 3 ఏప్రిల్ 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చురమేష్ (దర్శన్ అపూర్వ) కి సినిమా కెమెరామెన్ కావాలనేది కల. అడవిలోకి ట్రెక్కింగ్ వెళ్ళి ఓ డాక్యూమెంటరీ తీసే ఆలోచనలో అతని స్నేహితులు నవీన్ (కృష్ణ ప్రకాష్), కుమార్ (విజయ్ చెందూర్), సౌమ్య (పల్లవి), దీప (తనూజ), ప్రకాష్ (మృత్యుంజయ) లతో కలసి అడవిలోని ఓ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకొని వెళ్తారు. ఆలా వెళ్ళిన వారికీ అడవిలో వారికి ఎదురైనా అనుభవాలు ఏమిటి ? వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- కృష్ణప్రసాద్
- తనుజ [3]
- జాను
- విజయ్ చందూర్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శైలేంద్ర ప్రొడక్షన్స్
- నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేఎస్ అశోక
- సంగీతం: శేఖర్ చంద్ర
- సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
మూలాలు
మార్చు- ↑ 123 Telugu (3 April 2015). "Chitram Kadu Nijam Telugu Movie Review | Chitram Kadu Nijam Telugu Review | Chitram Kadu Nijam Review and Rating | Chitram Kadu Nijam Twitter Updates | Chitram Kadu Nijam First day first Show talk | Chitram Kadu Nijam cinema review | Chitram Kadu Nijam movie updates |". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Bangalore Mirror Bureau (16 December 2013). "REVEALED: The crew behind 6-5=2". The Times of India. Archived from the original on 19 December 2013. Retrieved 28 December 2013.
- ↑ Andrajyothy (1 November 2021). "అలా చేస్తే మనకు విలువేముంటుంది!". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.