ప్రధాన మెనూను తెరువు
మెరీనా బీచ్ లో MGR సమాధి

చరిత్రాత్మక ఆనవాళ్లు, కట్టడాలు, అందమైన సముద్రతీరాలు, సాంస్క్రతిక, కళా కేంద్రాలు, ఉద్యానవనాలతో అలరారుతున్న చెన్నై పర్యాటకరంగం ఆసక్తికర ప్రాంతాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. చెన్నై పర్యాటక రంగానికి తలమానికం మహాబలిపురం. నిజానికి ఇది చెన్నై పక్కనే ఉన్న చిన్నపట్టణం. ఏడో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవ రాజుల కాలం నాటి ఆ ఆలయాలు, శిల్పసంపద పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

భారతదేశంలో విదేశీ పర్యటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, ముంబైలు ఉన్నాయి. 2007లో సుమారు 6,50,000ల మంది విదేశీ పర్యాటకులు చెన్నైకి వచ్చారు. వీరంతా అమెరికా, ఇంగ్లాండు, శ్రీలంక, మలేషియా, సింగపూర్ దేశాలకు చెందిన వారు.[1]

ఆకర్షణలుసవరించు

సముద్రతీరాలుసవరించు

 
మెరీనా బీచ్

15 కిలో మీటర్లు పొడవు, 400 నుంచి 500 మీటర్ల వెడల్పుతో మెరీనా సముద్రతీరం పర్యాటకుల్ని ఆహ్లాదపరుస్తోంది. లైట్ హౌస్, స్మారక చిహ్నాలు, విగ్రహాలు, కాలిబాటలు, తోటలతో దీని ముందు భాగం విశేషంగా ఆకట్టుకుంటోంది. చెన్నై దక్షిణ భాగంలోని బిసెంట్ నగర్లోని ఇలాయిట్ బీచ్ పట్ల చెన్నై యువత ఎక్కువ ఆసక్తి చూపుతారు. పేరొందిన రెస్టారెంట్లు, కాఫీ షాపులకు కూడా ఈ బీచ్ ప్రసిద్ధి.[2] ఇలాయిట్ బీచ్ కి మహాబలిపురానికి మధ్యనున్న తూర్పుతీరం రోడ్డులో చాలా బీచ్ లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైంది కోవెలాంగ్ బీచ్. ఇక్కడ ఉన్న సముద్రగొంది, కర్నాటక నవాబులు కట్టించిన కోట పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటాయి.[3]

ప్రభుత్వ పురావస్తుశాల సముదాయంసవరించు

ఎగ్మోర్ లోని ప్రభుత్వ పురావస్తుశాల సముదాయంలో ప్రభుత్వ పురావస్తుశాల, కన్నెమెరా ప్రజా గ్రంథాలయం, జాతీయ కళాకేంద్రం ఉన్నాయి. 1851లో ఏర్పాటైన ఈ పురావస్తుశాల 16.25 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. మొత్తం ఆరు భవనాల్లో 46 ప్రదర్శన కేంద్రాలు ఉన్నాయి. పురావస్తుశాలలో వివిధ రంగాలకు చెందిన వస్తువులు, ఆనవాళ్లను ప్రదర్శనకు పెట్టారు. పురావస్తుశాస్త్రం, నాణాల అధ్యయన శాస్త్రం, జంతుశాస్త్రం, చరిత్రలకు సంబంధించిన వస్తువులతోపాటు శిల్పసంపద, తాళపత్రాలు, అమరావతి చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కన్నెమెరా ప్రజా గ్రంథాలయం దేశంలోని నాలుగు జాతీయ డిపాజిటరీ గ్రంథాలయాల్లో ఒకటి. భారతదేశంలో ప్రచురితం అయ్యే అన్ని రకాల పుస్తకాలు, వార్తాపత్రికలు, వార, దిన, పక్ష, మాస పత్రికలు ఈ గ్రంథాలయానికి వస్తాయి. 1890లో ఈ గ్రంథాలయాన్ని నెలకొల్పారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రచురణలు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తకసేకరణ దేశంలోనే అత్యుత్తమమైనది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొంటోంది. జాతీయ కళా కేంద్రం ఉన్న భవనం భారతదేశంలోనే ఓ అద్భుత కట్టడం. దీనిని ఇండో-సార్సనిక్ శైలిలో నిర్మించారు.

సెయింట్ జార్జ్ కోటసవరించు

 
సెయింట్ జార్జ్ కోటలో సెయింట్ మేరీ చర్చ్

సెయింట్ జార్జ్ కోట (లేదా చరిత్రాత్మక వైట్ టౌన్) బ్రిటిష్ వాళ్లు భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి కోట. 1639[4]లో తీర ప్రాంత నగరమైన మద్రాసు (ప్రస్తుతం చెన్నై) లో ఈ కోటను నిర్మించారు. ఈ కోట నిర్మాణం ఏప్రిల్ 23న పూర్తయింది. అదే రోజున ఇంగ్లాండ్ లో సెయింట్ జార్జ్ గౌరవార్ధం సెయింట్ జార్జ్ దినంగా జరుపుకుంటారు. సెయింట్ జార్జ్ ఓ క్రైస్తవకోట. ఇది సముద్రానికి ఎదురుగా ఉంది. సమీపంలో కొన్ని మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కోట నిర్మించిన కొంత కాలానికే ఇక్కడ వ్యాపార కార్యాకలాపాలు బాగా పుంజుకొని ఇది ఓ వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఇది ఓ కొత్త పట్టణం ఏర్పాటుకు దారి తీసింది. అదే జార్జ్ టౌన్ (చరిత్రాత్మకంగా దీనికి నల్ల నగరం అని పేరు). ఇది చుట్టుపక్కల గ్రామాల్ని తనలో కలిపేసుకుని మద్రాసుగా రూపాంతరం చెందింది. ఆరు మీటర్ల ఎతైన గోడలతో ఉన్న ఈ కోట చాలా బలమైంది. 18వ శతాబ్దంలో ఈ కోట ఎన్నో చొరబాట్లకు గురైంది. ప్రస్తుతం ఈ కోట తమినాడు రాష్ట్ర శాసనసభ పరిపాలనా విభాగ కేంద్రంగా మారింది. ఇప్పటికీ ఈ కోటలో సైనిక బలగాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన సైనిక వ్యవహారాలన్నీ ఇక్కడ నుంచే నడుస్తాయి. కోట పురావస్తుశాలలో రాజుల కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. చాలా మంది గవర్నర్ల చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రాచీన కాలం నాటి వస్తువులు, ఆనవాళ్లు మరికొన్ని కోటలోనే ఉన్న సెయింట్ మేరీ చర్చిలో భద్రపరిచారు. ఇది ఇండియాలోనే పురాతనమైన ఆంగ్లికన్ చర్చి. వెస్లీ హౌస్లో ఈ కోటను పాలించిన గవర్నర్ల చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ఆ కాలం నాటి ఇతర అధికారుల చిత్రాలు కూడా ఉన్నాయి.

కళలు మరియు నైపుణ్యాలుసవరించు

తమిళ, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించే కళా కేంద్రాలు, సంస్క్రతిక నిలయాలు చాలా ఉన్నాయి. వల్లువర్ కొట్టమ్ ఆడిటోరియం ప్రముఖ కవి సెయింట్ తిరవాళ్లవర్ జాపకార్థం నిర్మించారు. ఇక్కడ కూడా 101 అడుగుల ఎత్తున్న ఆలయం ఉంది. ఇది రథం ఆకారంలో ఉంటుంది. బిసెంట్ నగర్ లోని కళాక్షేత్ర భారతీయ కళలకు జీవం పోస్తున్న కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. భరతనాట్యానికి ఈ కేంద్రం ప్రసిద్ధి. 1907లో నిర్మించిన జాతీయ కళా కేంద్రం 11, 12 శతాబ్దాల నాటి భారతీయ చేతి కళలు, 17వ శతాబ్దం నాటి దక్కన్ చిత్రాలకు నిలయమైంది. 16, 17, 18 శతాబ్దాల నాటి మొగలాయి, రాజస్థానీ చిత్రాలు, 10, 13వ శతాబ్దాల నాటి కంచు వస్తువులు ప్రభుత్వ పురావాస్తుశాలలో భాగమైనాయి.

అడయార్ నది తీరంలో ప్రపంచ థియోసోఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని 1886లో ఏర్పాటు చేశారు. ఎస్టేట్ గార్డెన్స్ లో అన్ని మత విశ్వాసాలకు ప్రాధన్యమిచ్చే ద్రుశ్యాలు కనిపిస్తాయి. తూర్పుతీరం రోడ్డులో ఉన్న చోళమండల కళాగ్రామంలోకి వెళ్లితే తమ తమ పనుల్లో నిమగ్నమైన కళాకారులు, శిల్పకారుల్ని చూడొచ్చు. చెన్నై క్రాఫ్ట్ పౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న దక్షిణచిత్రలో దక్షిణ భారతదేశ జీవనశైలికి సంబంధించిన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన కళలు, నైపుణ్యాల వర్క్ షాప్ కూడా ఉంది.

ప్రార్ధనా స్థలాలుసవరించు

 
మైలాపూర్ లో కపిలీశ్వర ఆలయం

పూర్వం నుంచి కూడా భిన్న మతాలకు చెందిన ప్రజలు కలిసే నివసిస్తూ ఉండటం వలన చెన్నై ఒక భిన్నత్వాన్ని కలిగిన సమాజంగానే ఉంది. ఈ పరిణామక్రమమే ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పటికి ఇప్పటికీ కూడా ఈ నగరం విభిన్న మతాలకు ప్రత్యేక ప్రార్థనాస్థలం. చెన్నైలో ప్రముఖ ఆలయం మైలాపూర్లోని కపిలేశ్వర ఆలయం. వాడపళని ఆలయం కూడా హిందువులకు చాలా ముఖ్యమైనదే. సెయింట్ థామన్ మౌంట్ క్రైస్తవ యాత్రికులకు చాలా పవిత్రమైంది. ఏసుక్రీస్తు వ్యక్తిగత అనుచరుల్లో ఒక్కడైన సెయింట్ థామస్ ప్రాణాలు అర్పించిన[5] ప్రాంతం ఇదేనని క్రైస్తవులు నమ్ముతారు. సెయంట్ థామస్ సమాధి దగ్గర నిర్మించిన సంత్హోమ్ బాసిలికాను తర్వాత రోమన్ క్యాథిలిక్ చర్చిగా మార్చేశారు. చెన్నైలోని సెయింట్ జార్జ్ క్యాథడ్రిల్ ప్రొటస్టెంట్ క్రైస్తవులకు పవిత్ర స్థలం. వెయ్యి దీపాల మసీదు దేశంలోనే అతిపెద్ద మసీదుల్లో ఒకటి. ముస్లింలకు ఇది ముఖ్యమైన ప్రార్థనాస్థలం.

ఉద్యానవనాలుసవరించు

గిండి జాతీయ ఉద్యానవనం దేశంలోనే అతి చిన్న జాతీయ ఉద్యానవనం. దీని విస్తీర్ణం 2.76 చదరపు కిలోమీటర్లు. ఇది పూర్తిగా చెన్నై పట్టణంలోనే ఉంది. అంతరించిపోతున్న జాతులకు చెందిన జింకలు, నక్కలు, కోతులు, పాములు ఇక్కడ ఉన్నాయి. గిండి స్నేక్ పార్క్ జాతీయ ఉద్యానవనంలోనే ఉంది. ఇక్కడ ఎన్నో జాతులకు చెందిన పాములు ఉన్నాయి. పాము విషానికి విరుగుడుగా పని చేసే యాంటివినం మందుకు కూడా ఇది కేంద్రమే. అరిగ్నర్ అన్నా జులాజికల్ పార్క్ (వందలూరు జూగా ప్రసిద్ధి) కూడా చెన్నై నగరంలోనే ఉంది. దీని విస్తీర్ణం 5.1 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఎనిమిది రకాల జీవజాతులు ఉన్నాయి. సింహాలు, ఏనుగులు, రాత్రిపూట మాత్రమే కనిపించే జీవుల్ని ఇక్కడ చూడొచ్చు. తూర్పుతీరం వెంబడి ఉన్న దక్షిణ పట్టణంలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ ట్రస్టు ఉంది. సరీసృపాల అధ్యయనంలో ఈ కేంద్రం చాలా కీలకమైంది. ఈ కేంద్రంలో రకరకాల చేపలు, ఉప్పునీటి జాతి మొసళ్లు, పెద్ద మొసళ్ళు, ఘరియల్స్ మరియు తాబేళ్లు, పాములు కూడా ఉన్నాయి. ఉద్యానవన శాఖ ఉద్యానవనంలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. రెండు కోట్ల సంవత్సరాల క్రితం నాటి వృక్ష శిలాజాల కాండాలు కూడా ఉన్నాయి. ప్రతి యేటా మే నేలలో ఇక్కడ వేసవి వేడుకలు నిర్వహిస్తారు.

కొనుగోలు కేంద్రాలుసవరించు

 
చెన్నెలో ఉన్న పెద్ద షాపింగ్ సెంటర్లలో స్పెన్సర్ ప్లాజా ఒకటి

చెన్నై నగరం వ్యాపార కార్యకలాపాలకు బాగా ప్రసిద్ధి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి కొనుగోళ్లు జరుపుతారు. కళాత్మక వస్తువులు, సంప్రదాయ కళల్ని ప్రతిబంబించే వస్తులు, పురాతన సంప్రదాయానికి ప్రతికగా నిలిచే బంగారు ఆభరణాలకు చెన్నై నగరం ప్రసిద్ధి. తిరునల్వేలి హస్తకళా పనితనాన్ని ప్రతిబింబించే వస్తువులు, కుంభకోణం నుంచి వచ్చే కళాత్మక కంచు, ఇత్తడి ఆభరణాలు, తంజావూరు లోహ వస్తువులు, మహాబలిపురం నుంచి వచ్చే శిల్ప సంపద, కంచీపురం పట్టు వస్రాలు బాగా ప్రసిద్ధి. జార్జి టౌన్, ప్రెసీ కార్నర్ చెన్నైలో అతి పెద్ద మార్కెట్లు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఒక్కొక్క వీధి ఒక్కో రకమైన వస్తువుల అమ్మకానికి ప్రసిద్ధి. ఇక్కడకు సమీపంలోని బర్మా బజార్ విదేశాల నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ పరికరాలకు పేరొందింది. మూర్ మార్కెట్లో చాలా పుస్తకాల దుకాణాలు ఉన్నాయి. పాండీ బజార్ టి.నగర్ లో ఉంది. ఇక్కడ భారీ వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఇది చెన్నైకు ప్రత్యేక ఆకర్షణ. బంగారం, వెండి, వజ్రాల అభరణాలు పట్టువస్రాలకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి.

వినోదంసవరించు

ఎంజిఎం డిజ్జి వాల్డ్, VGP యూనివర్శల్ కింగ్డమ్, కిషికింద మొదలైన మూడు ప్రధాన వినోదాత్మక కేంద్రాలు ఉన్నాయి మరియు ఒక జలవిహార కేంద్రం, డాష్ అండ్ స్ప్లాష్ నగర శివార్లలో ఉన్నాయి. నగరంలో ఓ పెయింట్ బాల్ సెంటర్, [6] వాటర్ స్సోర్ట్స్ క్లబ్ తూర్పు తీరం రోడ్డులో ఉన్నాయి. మహాబలిపురం వెళ్లే తూర్పుతీర ప్రధాన రహదారిలో చాలా బీచ్ లు, రిసార్ట్ లు ఉన్నాయి. తమిళ సినిమా పరిశ్రమకు కూడా చెన్నై పుట్టిల్లు వంటిది. 100కి పైగా పెద్ద సినిమా హాళ్లు ఉన్నాయి. కొన్ని మల్టీప్లెక్సులు ఉన్నాయి. ఇక్కడ తమిళం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం సినిమాలు ప్రదర్శిస్తారు.[7] నగరంలో భారీ సంఖ్యలో రెస్టారెంట్లు ఉన్నాయి. తమిళ, భారతీయ, అంతర్జాతీయ వంటకాలు ఇక్కడ దొరుకుతాయి.[8] చెన్నైలో రాత్రి జీవితం విలాసవంతంగా ఉంటుంది. బార్లు, పూల్ పార్లర్లు, క్లబ్లు విలాస ప్రియుల్ని బాగా ఆకట్టుకుంటాయి.[9]

చిత్రకళా ప్రదర్శనసవరించు

సూచనలుసవరించు

  1. http://www.timeofindia.com టైమ్స్ ఆఫ్ ఇండియా, 2 జూన్ 2008
  2. http://www.chennai.org.uk/beaches/elliot-beach.html
  3. "Chennai Tourism". lifeinchennai.com. Retrieved 2009-07-27. Cite web requires |website= (help)
  4. రోబర్ట్స్, J: "హిస్టరీ ఆఫ్ ది వరల్డ్.". పెంగ్విన్, 2004.
  5. సెయింట్. థోమస్ ఇన్ ఇండియా
  6. "Paintball Chennai". http://www.paintballchennai.com/. Retrieved 2009-08-14. Cite web requires |website= (help); External link in |publisher= (help)
  7. "Chennai Cinema Theatres". lifeinchennai.com. Retrieved 2009-07-27. Cite web requires |website= (help)
  8. "Chennai Hotels and Restaurants". lifeinchennai.com. Retrieved 2009-07-27. Cite web requires |website= (help)
  9. "Chennai Pubs and Discs (Discotheques) - Entertainment". lifeinchennai.com. Retrieved 2009-07-27. Cite web requires |website= (help)

బాహ్య లింకులుసవరించు