చొప్పదండి మండలం

తెలంగాణ, కరీంనగర్ జిల్లా లోని మండలం


చొప్పదండి మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా లోని మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు.[1]. మండలం కోడ్:04424.[2]  2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.చొప్పదండి మండలం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, చొప్పదండి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.మండల కేంద్రం చొప్పదండి.

చొప్పదండి
—  మండలం  —
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, చొప్పదండి స్థానాలు
తెలంగాణ పటంలో కరీంనగర్ జిల్లా, చొప్పదండి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్ జిల్లా
మండల కేంద్రం చొప్పదండి
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 143 km² (55.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,288
 - పురుషులు 25,813
 - స్త్రీలు 25,475
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల మొత్తం జనాభా 51,288. వీరిలో 25,813 మంది పురుషులు కాగా, 25,475 మంది మహిళలు ఉన్నారు. మండల పరిధిలో మొత్తం 13,037 కుటుంబాలు నివసిస్తున్నాయి.మండల సగటు సెక్స్ నిష్పత్తి 987[4]మండల పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4159 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 8% గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2168 మంది మగ పిల్లలు కాగా, 1991 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండల బాలల లైంగిక నిష్పత్తి 918, ఇది చొప్పదండి మండల సగటు సెక్స్ నిష్పత్తి (987) కన్నా తక్కువ. మండల మొత్తం అక్షరాస్యత 61.32%. పురుషుల అక్షరాస్యత రేటు 65.38% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 47.2% గా ఉంది.[4]

పునర్వ్యవస్థీకరణ తరువాతసవరించు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 143 చ.కి.మీ. కాగా, జనాభా 51,288. జనాభాలో పురుషులు 25,813 కాగా, స్త్రీల సంఖ్య 25,475. మండలంలో 13,037 గృహాలున్నాయి.[5]

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. రాగంపెట
  2. చిట్యాల్‌పల్లి
  3. అర్నకొండ
  4. భూపాలపట్నం
  5. చొప్పదండి
  6. గుమ్లాపూర్
  7. కత్నేపల్లి
  8. కోనేరుపల్లి
  9. రుక్మాపూర్
  10. కొలిమికుంట
  11. చాకుంట
  12. వెదురుగట్టు

మూలాలుసవరించు

  1. http://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Karimnagar.pdf
  2. "Choppadandi Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-24.
  3. "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. 4.0 4.1 "Choppadandi Mandal Population, Religion, Caste Karimnagar district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2020-06-24.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

ఇవి కూడా చూడండిసవరించు

బయటి లింకులుసవరించు