చౌదర్‌గూడెం మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

చౌదర్‌గూడెం మండలం,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 17 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం షాద్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. చౌదర్‌గూడెం, ఈ మండలానికి కేంద్రం.

చౌదర్‌గూడెం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, చౌదర్‌గూడెం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, చౌదర్‌గూడెం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, చౌదర్‌గూడెం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′16″N 77°59′41″E / 17.087907°N 77.994697°E / 17.087907; 77.994697
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం చౌదర్‌గూడెం
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 113 km² (43.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 31,662
 - పురుషులు 15,955
 - స్త్రీలు 15,707
పిన్‌కోడ్ 509207

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చౌదర్‌గూడెం మండలాన్ని (0+17) పదిహేడు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4] ఈ మండల వైశాల్యం 113 చ.కి.మీ. కాగా, జనాభా 31,662. జనాభాలో పురుషులు 15,955 కాగా, స్త్రీల సంఖ్య 15,707. మండలంలో 6,873 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. చౌదర్‌గూడెం (జిల్లేడ్)
  2. ఇంద్రానగర్
  3. గుర్రంపల్లి
  4. పెద్దేల్కిచర్ల
  5. వీరన్నపేట
  6. చేగిరెడ్డి ఘన్‌పూర్
  7. జాకారం
  8. గుంజలపహాడ్
  9. ఎదిర
  10. రావిర్యాల్
  11. తుమ్మలపల్లి
  12. పద్మారం
  13. తూంపల్లి
  14. చెన్నారెడ్డిగూడ
  15. మల్కాపహాడ్
  16. చలివేంద్రంపల్లి
  17. వనంపల్లి

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-15.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు