ఛత్రీవాలీ 2023లో విడుదలైన హిందీ సినిమా. ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన సినిమాకు తేజస్ దేవోస్కర్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్ సింగ్, సుమీత్ వ్యాస్, సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 6న విడుదల చేయగా[1], సినిమా జనవరి 20న విడుదలైంది.

ఛత్రీవాలీ
దర్శకత్వంతేజస్ దేవోస్కర్
రచనసంచిత్ గుప్తా
ప్రియదర్శి శ్రీవాస్తవ
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణం
ఛాయాగ్రహణంసిద్ధార్థ్ వాసాని
కూర్పుశృతి బోరా
సంగీతంమంగేష్ దక్కడే
రోహన్-రోహన్
నిర్మాణ
సంస్థ
ఆర్ఎస్‌వీపీ మూవీస్
పంపిణీదార్లుజీ5
విడుదల తేదీ
2023 జనవరి 20 (2023-01-20)
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

కథ మార్చు

సాన్యా ధింగ్రా (రకుల్ ప్రీత్ సింగ్) కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్. ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు కండోమ్ కంపెనీలో టెస్టర్‌గా (కండోమ్ క్వాలిటీ మేనేజర్‌గా) ఉద్యోగం వస్తుంది. మొదట ఈ ఉద్యోగాన్ని వద్దనుకున్నా కొన్ని రోజులు తరువాత ఉద్యోగంలో చేరుతుంది. సాన్యా కండోమ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయం చెప్పకుండా రిషి కార్ల (సుమిత్ వ్యాస్)ను వివాహం చేసుకుంటుంది. ఆమె ఉద్యోగం గురించి తెలిసిన తర్వాత రిషి ఎలా స్పందించాడు? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • రకుల్ ప్రీత్ సింగ్ - సన్యా ధింగ్రా [3]
  • సుమీత్ వ్యాస్ - రిషి కల్రా
  • సతీష్ కౌశిక్ - రతన్ లంబా
  • డాలీ అహ్లువాలియా - ధింగ్రా ఆంటీ
  • రాజేష్ తైలాంగ్ - రాజన్ కల్రా / భాయ్ జీ
  • ప్రాచీ షా పాండ్యా - నిషా కల్రా
  • రాకేష్ బేడీ - మదన్ చాచా
  • రివా అరోరా - మినీ కల్రా
  • పునీత్ తివారీ

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (8 January 2023). "శృంగార పాఠాలు చెబుతున్న రకుల్, 'ఛత్రివాలి' ట్రైలర్ చూశారా?". Archived from the original on 20 January 2023. Retrieved 20 January 2023.
  2. The Hindu (20 January 2023). "'Chhatriwali' movie review: Rakul Preet Singh shines in this timely tale on sex education" (in Indian English). Archived from the original on 27 January 2023. Retrieved 27 January 2023.
  3. NTV Telugu (7 May 2021). "'ఛత్రీవాలీ'గా రకుల్ ప్రీత్ సింగ్!". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.

బయటి లింకులు మార్చు