జకార్తా ఇండోనేషియా దేశపు రాజధాని నగరం. ప్రావిన్షియల్ స్థాయిలో ఇది స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం కూడా. 1949 వరకు దీనిని బటేవియా అని పిలిచేవారు. ఇది ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ జనాభా కలిగిన జావా దీవికి వాయవ్య తీరాన ఉంది. ఇండోనేషియాలో ఇది ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కేంద్రం. ఆగ్నేయాసియాలో పురాతన కాలం నుంచీ మానవ నివాసాలు ఉంటున్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.[12] జకార్తా విస్తీర్ణం సుమారు 661 చ.కిమీ అయినప్పటికీ మెట్రోపాలిటన్ ప్రాంతం మొత్తాన్ని తీసుకుంటే 7076 చ.కి.మీ ఉంటుంది. 2022 నాటికి ఈ మెట్రోపాలిటన్ ప్రాంతపు జనాభా సుమారు 3.26 కోట్లు. ఇది ఇండోనేషియాలో అత్యంత జనాభా కలిగిన, ప్రపంచంలో రెండవ అత్యంత జనాభా కలిగిన పట్టణ ప్రాంతం. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం ఇండోనేషియా ప్రావిన్సులలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. జకార్తా వ్యాపార, ఉపాధి అవకాశాలు, ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే అధిక జీవన ప్రమాణాల కారణంగా, ఇండోనేషియా ద్వీపసమూహం అంతటా వలస వచ్చినవారిని ఆకర్షించి, ఇది అనేక సంస్కృతుల కలయికగా మారింది.

జకార్తా
Special Capital Region of Jakarta
Daerah Khusus Ibukota Jakarta
Official seal of జకార్తా
Nicknames: 
Motto(s): 
Jaya Raya  (Sanskrit)
"Victorious and Great"
Slogan: Jakarta Kota Kolaborasi
"Jakarta a City of Collaboration"[2]
పటం
Interactive map outlining Jakarta
(parts of Thousand Islands not visible)
దేశం Indonesia
ప్రాంతంJava
పరిపాలనా నగరాలు & ప్రాంతాలు
మొదట స్థిరపడింది400 BC (బుని సంస్కృతి)
మొదట ప్రస్తావించబడింది358 (తుగు శాసనం)
ఫౌండేషన్22 జూన్ 1527;
497 సంవత్సరాల క్రితం
 (1527-06-22)[3]
స్థాపన30 మే 1619;
405 సంవత్సరాల క్రితం
 (1619-05-30)[4]
నగర స్థితి4 మార్చి 1621;
404 సంవత్సరాల క్రితం
 (1621-03-04)[3]
ప్రావిన్స్ స్థితి28 ఆగస్టు 1961;
63 సంవత్సరాల క్రితం
 (1961-08-28)[3]
రాజధానిసెంట్రల్ జకార్తా
(de facto)[a]
ప్రభుత్వం
 • రకంప్రత్యేక పరిపాలనా ప్రాంతం
 • సంస్థజకార్తా ప్రావిన్షియల్ గవర్నమెంట్ ప్రత్యేక ప్రాంతం
 • గవర్నర్ప్రమోనో అనుంగ్ (PDI-P)
 • వైస్ గవర్నర్రానో కర్నో
 • శాసన సభజకార్తా ప్రాంతీయ ప్రతినిధుల సభ
విస్తీర్ణం
660.982 కి.మీ2 (255.207 చ. మై)
 • పట్టణపు
3,546 కి.మీ2 (1,369 చ. మై)
 • Metro
7,076.31 కి.మీ2 (2,732.18 చ. మై)
 • స్థానం38th in Indonesia
ఎత్తు
8 మీ (26 అ.)
జనాభా
 (2023)[5]
1,13,50,328
 • స్థానం6th in Indonesia
 • సాంద్రత17,000/కి.మీ2 (44,000/చ. మై.)
 • Urban3,53,86,000
 • Urban density10,000/కి.మీ2 (26,000/చ. మై.)
 • Metro3,25,94,159
 • Metro density4,600/కి.మీ2 (12,000/చ. మై.)
DemonymJakartan
Demographics
 • Ethnic groups
జాబితా
 • Religion (2022)[8]
జాబితా
GDP
 • Special capital regionRp 3,442.98 trillion
US$ 225.88 billion
Int$ 724.01 billion (PPP)
 • Per capitaRp 322.62 million
US$ 21,166
Int$ 67,842 (PPP)
 • MetroRp 6,404.70 trillion
US$ 420.192 billion
Int$ 1.346 trillion (PPP)
కాల మండలంUTC+07:00 (Western Indonesia Time)
Postal codes
  • 10110–14540
  • 19110–19130
Area code+62 21
ISO 3166 codeID-JK
Vehicle registrationB
HDI (2024)Increase 0.842[11] (1st) – very high

చరిత్ర

మార్చు

జకార్తాతో సహా పశ్చిమ జావా ద్వీపపు ఉత్తర తీరంలో సా.శ.పూ 400 నుంచి సా.శ 100 వరకు బుని సంస్కృతి పరిఢవిల్లింది.[13] ఆధునిక జకార్తా, దాని చుట్టుపక్కల ప్రాంతం ఇండోనేషియాలోని పురాతన హిందూ రాజ్యాలలో ఒకటైన తరుమనగర 4వ శతాబ్దపు సుండానీ రాజ్యంలో భాగంగా ఉంది.[14] టుగు చుట్టూ ఉన్న ఉత్తర జకార్తా ప్రాంతం 5వ శతాబ్దం ప్రారంభంలో ఒక జనావాస స్థావరం అయింది. ఉత్తర జకార్తా, కోజాలోని టుగు గ్రామంలోని బటుటుంబు కుగ్రామంలో కనుగొనబడిన తుగు శాసనం (ఇది బహుశా సా.శ. 417లో వ్రాయబడి ఉండవచ్చు) తరుమనగర రాజు పూర్ణవర్మన్ అతని రాజధాని సమీపంలోని చంద్రభాగ నది, గోమతి నది దగ్గర జలశక్తి పథకాన్ని చేపట్టాడని పేర్కొంది.[15] తరుమనగర ప్రాభవం కోల్పోయిన తరువాత, జకార్తా ప్రాంతంతో సహా దాని భూభాగాలు హిందూ రాజ్యమైన సుండాలో భాగమయ్యాయి. 7వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం ప్రారంభం వరకు, సుండా నౌకాశ్రయం శ్రీవిజయుని సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సుమారు 1225 ప్రాంతంలో రాయబడిన చైనీస్ మూలం చు-ఫాన్-చిలో జావో రుకువో నివేదించిన ప్రకారం శ్రీవిజయుడు మలయా ద్వీపకల్పమైన సుమత్రా, జావా పశ్చిమ ప్రాంతాన్ని పరిపాలించేవాడు.[16] సుండా నౌకాశ్రయం ఒక వ్యూహాత్మకమైనదనీ, మంచి అభివృద్ధి సాధించిందనీ, సుండాలోని మిరియాలు అత్యున్నత నాణ్యత కలిగినదనీ ఈ మూలం తెలియజేస్తుంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేసేవారు. అక్కడి ఇళ్ళు చెక్కపలకలపైన కట్టుకునేవారు.[17]

మూలాలు

మార్చు
  1. "A Day in J-Town". Jetstar Magazine. April 2012. Archived from the original on 1 August 2013. Retrieved 2 January 2013.
  2. "Jika Terpilih, Pramono Anung Bakal Gandeng Komunitas +Jakarta". teropongnews.com. 11 November 2024. Retrieved 21 February 2025.
  3. 3.0 3.1 3.2 "Provinsi – Kementerian Dalam Negeri – Republik Indonesia" [Province – Ministry of Home Affairs – Republic of Indonesia] (in ఇండోనేషియన్). Ministry of Home Affairs. Archived from the original on 19 February 2013. Retrieved 14 August 2019.
  4. Ricklefs, M. C. (2001). A History of Modern Indonesia since c.1200 (3rd ed.). Palgrave Macmillan. p. 35. ISBN 9780804744805.
  5. "Disdukcapil DKI Tertibkan Data Penduduk Sesuai Domisili". Dinas Dukcapil DKI Jakarta. Retrieved 11 June 2024.
  6. "Demographia World Urban Areas" (PDF) (19th annual ed.). August 2023. Retrieved 4 June 2024.
  7. "Basis Data Pusat Pengemangan Kawasan Perkotaan" [Urban area development centre database]. perkotaan.bpiw.pu.go.id. Archived from the original on 6 February 2020. Retrieved 31 August 2020.
  8. "ArcGIS Web Application".
  9. Badan Pusat Statistik (2024). "Produk Domestik Regional Bruto (Milyar Rupiah), 2022–2023" (in ఇండోనేషియన్). Jakarta: Badan Pusat Statistik.
  10. Badan Pusat Statistik (2024). "[Seri 2010] Produk Domestik Regional Bruto Per Kapita (Ribu Rupiah), 2022–2023" (in ఇండోనేషియన్). Jakarta: Badan Pusat Statistik.
  11. "Indeks Pembangunan Manusia 2024" (in ఇండోనేషియన్). Statistics Indonesia. 2024. Retrieved 15 November 2024.
  12. "History of Jakarta". Jakarta.go.id. 8 March 2011. Archived from the original on June 8, 2014. Retrieved 17 June 2014.
  13. Zahorka 2007, p. ?.
  14. Ayatrohaédi 2005, p. ?.
  15. Hellman, Thynell & Voorst 2018, p. 182.
  16. Bunge & Vreeland 1983, p. 3.
  17. Ayatrohaédi 2005, p. 60.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=జకార్తా&oldid=4511190" నుండి వెలికితీశారు