జక్కంపూడి మునిరత్నం

జక్కంపూడి మునిరత్నం ఒక తెలుగు కవి, విమర్శకుడు. ఆయన సుమారు 14 శతకాలు రాశాడు. పద్య ఖండికలు, గేయాలు రచించాడు. ఇరవైకి పైగా బాలల కథలు, పది దాకా కథానికలు, కవితలు, హైకూలు రాశాడు. ఆయనకు తెలుగులోనే కాక తమిళ భాష మీద కూడా మంచి పట్టుంది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో తెలుగు పరిశోధనా శాఖలో ఉపాచార్యుడుగా, సంయుక్తాచార్యుడిగా, ఆచార్యుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. [1]

జక్కంపూడి మునిరత్నం

జీవితం మార్చు

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

మునిరత్నం తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తణి తాలూకా కావేరీ రాజపురం గ్రామంలో నరసమ్మ, మునస్వామి దంపతులకు జనవరి 14, 1948 తేదీన జన్మించాడు. ఈ గ్రామం ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ఆంధ్రరాష్ట్రం విడిపోయిన తర్వాత 1960లో పటాస్కర్ తీర్మానం ప్రకారం తమిళనాడులో చేర్చబడింది. ఇక్కడ అన్నీ తెలుగు కుటుంబాలే నివసించేవి.ఆనాడు తమిళనాడు,పాండిచేరీ లలో కలిపేసిన చెన్నపట్టణం,హోసూరు, దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట. కోయంబత్తూరు,కంచి, మధురై,యానాం...మొదలైనవి తెలుగు ప్రాంతాలే.

ఇతడు కావేరీ రాజపురంలో 8వ తరగతి వరకు చదివాడు.తరువాత 1972లో తిరుపతిలోని సంగీత నృత్య కళాశాలలో చేరి గాత్రము, మృదంగం నేర్చుకున్నాడు. 1973లో ప్రైవేటుగా మెట్రిక్యులేట్, ఇంటర్‌మీడియట్ చదివాడు. తరువాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ., ఎం.ఎ., చదివాడు. 1986లో "అన్నమయ్య అళ్వారులు - తులనాత్మక పరిశీలన" అనే అంశంపై జాస్తి సూర్యనారాయణ పర్యవేక్షణ క్రింద పరిశోధించి పి.హెచ్.డి. సంపాదించాడు. ఇతడికి తెలుగు భాష మాత్రమే కాక తమిళ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో ప్రవేశం ఉంది.

రచనలు మార్చు

శతకాలు మార్చు

  • శ్రీ వేంకటేశ్వర స్తుతి పంచకం
  • శ్రీ చంద్రమౌళి శతకము
  • వేంకటేశ్వర శతకము
  • శ్రీ నటరాజ శతకము
  • కృష్ణ శతకము
  • సుబ్రహ్మణ్య శతకము
  • వటారణ్యేశ్వర శతకము
  • విఘ్నేశ్వర శతకము
  • షిరిడి సాయి శతకము
  • మలయాళ మౌనీంద్ర శతకము
  • విద్యా ప్రకాశ మౌనీంద్ర శతకము
  • దేదీప్య శతకము
  • సఖ శతకము
  • తెలుగుబాల శతకము

పద్య కృతులు మార్చు

  • హృదయశ్రీ
  • స్ఫూర్తిశ్రీ

కవితా సంపుటాలు మార్చు

  • గొంతులజ్వాల (100 కవితలు)
  • తలపుల పందిరి (75 కవితలు)
  • విపంచిక (గేయాలు)

వచన గ్రంథాలు మార్చు

  • సోమన - ఎఱ్ఱనల హరివంశములు
  • నాటక వ్యాసాలు
  • భావనా తరంగిణి
  • అన్నమయ్య అళ్వారులు (సిద్ధాంత గ్రంథం)
  • తాళ్ళపాక కవుల సాహితీకిరణాలు
  • గుణపాఠం (కథాసంపుటి)

బిరుదులు మార్చు

  • నవయువకవి
  • కళారత్న

మూలాలు మార్చు