జయంత్ సిన్హా
జయంత్ సిన్హా (జననం 1963 ఏప్రిల్ 21) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[3]
జయంత్ సిన్హా | |||
| |||
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | మహేష్ శర్మ | ||
తరువాత | హర్‌దీప్ సింగ్ పూరీ (స్వతంత్ర హోదా) | ||
ఆర్థిక శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | ఆర్థిక, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి | ||
తరువాత | అర్జున్ రామ్ మేఘవాల్ & సంతోష్ గంగ్వార్ | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | యశ్వంత్ సిన్హా | ||
నియోజకవర్గం | హజారీబాగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గిరిదిహ్, బీహార్, భారతదేశం (ప్రస్తుతం జార్ఖండ్, భారతదేశం) | 1963 ఏప్రిల్ 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | యశ్వంత్ సిన్హా నీలిమ సిన్హా | ||
జీవిత భాగస్వామి | పునీత కుమార్ సిన్హా[1] | ||
పూర్వ విద్యార్థి | హార్వర్డ్ యూనివర్సిటీ (ఎంబీఏ)[2] |
రాజకీయ జీవితం
మార్చుజయంత్ సిన్హా 1998 నుండి తన తండ్రి ఎన్నికల ప్రచారానికి సహాయం చేస్తూ హజారీబాగ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా 2014 ఫిబ్రవరిలో మిస్టర్ మోడీతో అంతర్జాతీయ వ్యాపారవేత్తల ఫోరమ్‌ను నిర్వహించడం, హోస్ట్ చేయడంతో సహా జాతీయ ఆర్థిక విధానాన్ని రూపొందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేశాడు.
జయంత్ సిన్హా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,59,128 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీ, లెజిస్లేషన్‌పై సబార్డినేట్ కమిటీ, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నాడు.
జయంత్ సిన్హా 2014 నవంబరు 9న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, [4] ఆ తరువాత 2016 జూలై 6న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
అభివృద్ధి పనులు
మార్చుజయంత్ సిన్హా 2017 ఫిబ్రవరి 23న జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ రఘుబర్ దాస్‌తో కలిసి దుమ్కా, పలమావు, హజారీబాగ్‌లలో మూడు వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేశాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "Being Mrs Sinha" (in ఇంగ్లీష్). 4 February 2022. Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ India TV News (9 November 2014). "Jayant Sinha: From IIT to Harvard to Modi's ministry" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ Lok Sabha (2022). "Jayant Sinha". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
- ↑ Free Press Journal (1 June 2019). "Jayant Sinha takes charge as MoS in Finance Ministry" (in ఇంగ్లీష్). Archived from the original on 30 August 2022. Retrieved 30 August 2022.
- ↑ "Foundations laid for three medical colleges in Jharkhand". indianexpress.com. 2019-01-27. Retrieved 2019-01-12.