ప్రధాన మెనూను తెరువు

జయచామరాజ వడయార్‌ బహదూర్‌

జయచామరాజ వడయార్‌ బహదూర్‌ (జూలై 18, 1919 - సెప్టెంబర్ 23, 1974) మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. ఆయన 1940 నుంచి 1950 దాకా సంస్థానాన్ని పాలించారు. ఆయన పేరొందిన తత్వవేత్త, సంగీత శాస్త్ర ప్రవీణుడు, రాజకీయవేత్త, దేశభక్తుడు.

Jayachamaraja Wodeyar Bahadur
Maharaja of Mysore
రాజా రవి వర్మ గీచిన జయచామరాజ వడయార్‌ చిత్రం
పరిపాలన1940 - 1950
జననం18 July 1919
జన్మస్థలంMysore, India
మరణం23 September 1974,
మరణస్థలంBangalore
ఇంతకు ముందున్నవారుKrishnaraja Wodeyar IV
తరువాతి వారుSrikantha Datta Narasimharaja Wodeyar
ConsortTripura Sundari Ammani
సంతానముPrincess Gayatri Devi Avaru, Princess Meenakshi Devi Avaru, Yuvaraja Srikantha Datta Narasimharaja Wodeyar, Princess Kamakshi Devi Avaru, Princess Indrakshi Devi Avaru, Princess Vishalakshi Devi Avaru
రాజకుటుంబముWodeyar
తండ్రిYuvaraja Kanteerava Narasimharaja Wadiyar
తల్లిYuvarani Kempu Cheluvaja Amanni

జీవితచరిత్రసవరించు

యువరాజ కంఠీరవ నరసింహరాజ వడయార్‌, యువరాణి కెంపు చెలువజ అమ్మణి దంపతులకు జయచామరాజ వడయార్‌ బహదూర్‌ ఏకైక కుమారుడు. ఆయన మైసూర్‌ మహారాజాస్‌ కాలేజీ నుంచి 1938లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ క్రమంలో ఐదు అవార్డులు, బంగారు పతకం సాధించారు. అదే ఏడాది మే 15 ఆదివారం రోజున ఆయన పెళ్ళి చేసుకున్నారు. 1939లో ఐరోపా‌లో పర్యటించారు. లండన్‌లో పలు సంస్థలను సందర్శించారు. అక్కడే పలువురు కళాకారులు, మేధావులతో పరిచయాలు, సంబంధాలు పెంచుకున్నారు. 1940 సెప్టెంబర్‌ 8న తన పినతండ్రి మహారాజ నలవాది కృష్ణరాజ వడయార్‌ మరణానంతరం మైసూర్‌ రాజ్య సింహాసనం అధిష్టించారు.

1947 ఆగస్టులో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో విలీన ఒప్పందంపై వడయార్‌ సంతకం చేశారు. 1950 జనవరి 26న మైసూర్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. 1950 నుంచి 1956 దాకా ఆయన రాజప్రముఖ్‌ హోదా అనుభవించారు. పొరుగున ఉన్న మద్రాస్‌, హైదరాబాద్ రాష్ట్రాల్లోని పలు కన్నడ మెజారిటీ ప్రాంతాలు ఏకీకృతమైన అనంతరం పునర్‌ వ్యవస్థీకరించిన ఏకీకృత మైసూర్‌ రాష్ట్రానికి తొలి గవర్నర్‌గా 1956 నుంచి 1964 దాకా ఉన్నారు. అనంతరం మద్రాస్‌ (తమిళనాడు) గవర్నర్‌గా బదిలీ అయి 1964 నుంచి 1966 దాకా పనిచేశారు.

క్రీడలుసవరించు

వడయార్‌ మంచి అశ్వికుడు, టెన్నిస్‌ క్రీడాకారుడు. రామనాథన్ కృష్ణన్ వింబుల్డన్‌లో పాల్గొనేందుకు సాయపడ్డారు. ఆయన మంచి వేటగాడు కూడా. అడవి ఏనుగులు, నరహంతక పులుల బాధ తలెత్తినప్పుడల్లా రాజ్య ప్రజలు వడయార్‌నే స్మరించుకునేవారు. మైసూర్‌ రాజభవనంలో ఆయనకు సంబంధించిన పలు వణ్యప్రాణి ట్రోఫీలు కన్పిస్తాయి. ప్రఖ్యాత భారత క్రికెటర్‌, ఆఫ్‌ స్పిన్నర్‌ ఈఏఎస్‌ ప్రసన్నను వెస్టిండీస్‌ పర్యటనకు పంపేందుకు ఆయన తండ్రి సంకోచిస్తున్న సమయంలో అందుకు సాయపడింది కూడా వడయారే.

సంగీతంసవరించు

పాశ్చాత్య సంగీతంతో పాటు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతమైన కర్ణాటక సంగీత రీతిలో కూడా వడయార్‌ పారీణులు. ఇక భారత తత్వశాస్త్రంలో కూడా బాగా పేరున్న, సాధికార పండితుడు. బయటి ప్రపంచానికి అప్పటిదాకా అంతగా తెలియని రష్యన్‌ సంగీతకారుడు నికొలాయ్‌ కార్లోవిచ్‌ మెడ్‌టెనర్‌ (1880-1951) సంగీతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తెలిసేలా చేసింది కూడా ఆయనే. అందుకోసం ఆయన స్వరాల్లో చాలావాటి కంపోజింగ్‌కు ఆర్థిక సాయం చేశారు. దాంతోపాటు 1949లో మెడ్‌టెనర్‌ సొసైటీని స్థాపించారు. మెడ్‌టెనర్‌ తన మూడో పియానో విభావరిని మైసూర్‌ మహారాజుకే అంకితం చేశారు. 1945లో లండన్‌లోని గిల్డ్‌ హాల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో ఆయన లిసెంటియేట్‌ అయ్యారు. అలాగే లండన్‌లోని ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో ఆనరరీ ఫెలో కూడా అయ్యారు. వాటితో పాటుగా విభావరిలో పియానో వాద్యకారుడు కావాలని ఆయన ఆశించారు. కానీ 1939లో తండ్రి, 1940లో యువరాజు కంఠీరవ నరసింహరాజ వడయార్‌-4ల అకాల మరణంతో అది నెరవేరలేదు. అనంతరం ఆయన సింహాసనాన్ని అధిష్టించారు.

1948లో లండన్‌లోని ఫిలర్మోనియా కన్సర్ట్‌ సొసైటీకి వడయార్‌ తొలి అధ్యక్షుడు అయ్యారు.[1] రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో 1949 ఏప్రిల్‌ 13, ఏప్రిల్‌ 27, మే 11 తేదీల్లో జరిగిన సంగీత విభావరులకు సంబంధించి కొన్ని ప్రోగ్రాం షీట్లను దిగువన చూడండి.

దస్త్రం:Philhormonia3.jpgదస్త్రం:Philhormonia2.jpg

ఈ విషయమై మైసూర్‌ మహారాజు ఆహ్వానించిన వాల్టర్‌ లెగీ ఇందుకు సంబంధించి ఇలా అన్నారు:

మైసూరు పర్యటన ఒక అద్భుతానుభవం. మహారాజు యువకులు. ఆయనకింకా 30 ఏళ్లు కూడా నిండలేదు. ఆయనకున్న రాజభవనాల్లో ఒక మహల్లో అతి పెద్ద రికార్డింగ్‌ లైబ్రరీ ఉంది. సీరియస్‌ మ్యూజిక్‌కు సంబంధించి మన ఊహకందే అన్ని రికార్డింగులూ అందులో కొలువుదీరాయి. అద్భుతమైన లౌడ్‌ స్పీకర్ల దొంతరలు, భారీ విభావరులకు పనికొచ్చే పెద్ద పియానోలు...

మెడ్‌టనర్‌ పియానో విభావరుల రికార్డింగ్‌, ఆయన పాటల ఆల్బమ్‌, మరికొన్ని ఆయన చాంబర్‌ మ్యూజిక్‌ తాలూకు ఖర్చులను చెల్లించేందుకు నేనక్కడ గడిపిన కొద్ది వారాల్లో మహారాజు అంగీకరించారు. ఫిల్‌హార్మోనియా ఆర్కెస్ట్రా, ఫిల్‌హార్మోనియా కాన్సర్ట్‌ సొసైటీలను శాశ్వత ప్రాతిపదికన స్థిరీకరించేందుకు నాకు ఏటా 10 వేల పౌండ్ల చొప్పున మూడేళ్ల పాటు చెల్లించేందుకు అంగీకరించారు... మూస:Mysore Rulers Infobox

1949లో జరిగిన ఈ సాయం ద్వారా లెగీ భాగ్యరేఖలు పూర్తిగా మారిపోయాయి. తనకు కండక్టర్‌గా హెర్బెర్ట్‌ వాన్‌ కరంజన్‌ను నియమించుకునేందుకు ఆయనకు వీలు చిక్కింది. బలాకిరెవ్‌ సింఫనీ, రౌసెల్‌ ఫోర్త్‌ సింఫనీ, బుసోనీ ఇండియన్‌ ఫాంటసీ వంటివాటిని స్పాన్సర్‌ చేయాలని యువ మహారాజు తలపోశారు. ఈ సంస్థ యుద్ధానంతర కాలంలో కొన్ని చరిస్మరణీయ విభావరులను స్పాన్సర్‌ చేసింది.

లండన్‌లోని ఫిల్‌హార్మోనియా ఆర్కెస్ట్రా ద్వారా రాయల్‌ ఆల్బెర్ట్‌ హాల్‌లో ఒక సాయంత్రం జరిగిన కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేయడం ద్వారా 1950లో రిచర్డ్‌ స్ట్రాస్‌ చివరి కోరికను కూడా మహారాజా తీర్చారు. జర్మన్‌ కండక్టర్‌ విలెయం ఫుర్ట్‌వాంగ్లర్‌ లీడ్‌గా వ్యవహరించగా సొప్రానో ఫ్లాగ్‌స్టాడ్‌ తన చివరి నాలుగు పాటలను (గోయింగ్‌ టు స్లీప్‌, సెప్టెంబర్‌, స్ప్రింగ్‌, అట్‌ సన్‌సెట్‌) పాడారు.

సంగీతంలో కూడా మహారాజు అందెవేసిన చేయి. ఈఎంఐ కేటలాగ్‌లోని తాజా చేరికలపై వ్యాఖ్యానించాల్సిందిగా లెగీ అడిగినప్పుడు ఆయన చెప్పిన అభిప్రాయాలు ఎంత అనూహ్యమో అంత అద్భుతమని కితాబులందుకున్నాయి. బీథోవెన్‌ ఐదో సింఫనీ ('యాజ్‌ బీథోవెన్‌ విష్డ్‌ ఇట్‌ టు బీ') కరజాన్‌స తాలూకు వియన్నా ఫిల్‌హార్మోనిక్‌ చేసిన రికార్డింగ్‌ను చూసి మహారాజు ఎంతో ఉత్సాహపడ్డారు. ఫుర్ట్‌వాంగ్లర్‌ రికార్డ్‌ చేసిన నాలుగో సింఫనీని కూడా ఎంతగానో అభిమానించారు. కానీ గలియెరా చేసిన ఏడో సింఫనీని చూసి మాత్రం బాగా నిరుత్సాహపడ్డారు. దాన్ని కూడా కరజాన్‌ రికార్డ్‌ చేయాలని ఆయన ఆశించారు. వీటన్నింటినీ మించి టస్కానినీ రికార్డింగులపై ఆయన సీరియస్‌ తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై లెగీకి ఇలా రాశారు. వేగం, శక్తి అంతా ఎంతగానో ఆశించే విధంగా దేవతలకు సంబంధించినవి కాదు, రాక్షసులకు చెందినవి. టస్కానినీ తాలూకు మరీ కంపు కొట్టే, విషపూరిత ప్రదర్శనల అనంతరం ఓ మంచి టానిక్‌లా ఉండటమే ఫుర్ట్‌వాంగ్లర్‌ బీథోవెన్‌ను తానంతగా అభిమానించడానికి కారణమని ఆయన చెప్పారు.

మహారాజు అయిన అనంతరం వడయార్‌ భారత శాస్త్రీయ సంగీతం (కర్ణాటక సంగీతం) అధ్యయనం చేశారు. అప్పటిదాకా మైసూరు ఆస్థానంలో వికసించిన సాంస్కృతిక వైభవం అందుకు కారణం. ఆయన వీణా వాదన విద్వాన్ ‌వెంకటగిరియప్ప శిక్షణలో నేర్చుకున్నారు. ప్రఖ్యాత సంగీతకారుడు కర్ణాటక సంగీతం గుట్టుమట్లను విద్వాన్‌ శ్రీ వాసుదేవాచార్య శిష్యరికంలో ఔపోసన పట్టారు. ఒక ఉపాసకుని మాదిరిగా శ్రీవిద్య రహస్యాలను కూడా (చిత్రభానంద అనే మారుపేరుతో) తన గురువు శిల్పి సిద్ధలింగస్వామి వద్ద ఆకళింపు చేసుకున్నారు. ఈ స్ఫూర్తితో శ్రీ విద్య అనే పేరుతో దాదాపు 84 కర్ణాటక సంగీత కృతులను సమకూర్చారు. ఇవన్నీ భిన్న రాగాల్లో ఉన్నాయి. కొన్నయితే అప్పటికి ప్రపంచానికి పూర్తిగా కొత్త. ఈ క్రమంలో మైసూరు నగరంలో మహారాజు మూడు నగరాలను కూడా నిర్మించారు: భువనేశ్వరి ఆలయం, గాయత్రి ఆలయం (ఇవి రెండూ మైసూర్‌ రాజభవనం లోపలున్నాయి), శ్రీ కామకామేశ్వరీ ఆలయం (ఇది నగరంలోని రామానుజ రోడ్డులో ఉంది). ఈ మూడు ఆలయాల్లోనూ మహారాజు గురువు, ప్రఖ్యాత శిల్పి సిద్ధలింగస్వామి విగ్రహాలను చెక్కారు.

ప్రఖ్యాత భారత సంగీతకారులకు మైసూరు ఆస్థానంలో ఆశ్రయం దక్కింది. వాసుదేవాచార్య, వీణా వెంకట గిరియప్ప, బి.దేవేంద్రప్ప, వి.దొరైస్వామి అయ్యంగార్‌, టి.చౌడయ్య, టైగర్‌ వరదాచారి, చెన్నకేశవయ్య, టైటిల్‌ కృష్ణ అయ్యంగార్‌, ఎస్‌ఎస్‌ మిరియప్ప, చింతలపల్లి రామచంద్ర రావు, ఆర్‌ఎన్‌ దొరెస్వామి, హెచ్‌ఎం విద్యాలింగ భాగవతార్‌ వంటివారెందరో వీరిలో ఉన్నారు.

కర్ణాటక సంగీతానికి వడయార్‌ రాజుల ఆశ్రయం, వారి పాత్రతలను 1980ల్లో ప్రొఫెసర్‌ శ్రీ వి.రామరత్నం పరిశోధన చేశారు. ఆయన మైసూరు వర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌కు తొలి ప్రిన్సిపల్‌గా పనిచేసి రిటైరయ్యారు. భారత ప్రభుత్వపు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆర్థిక సాయంతో ఈ పరిశోధన సాగింది. కంట్రిబ్యూషన్‌ అండ్‌ పాట్రనేజ్‌ ఆఫ్‌ వడయార్స్‌ టు మ్యూజిక్‌ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ప్రొఫెసర్‌ వి.రామరత్నం రాశారు. బెంగళూరులోని కన్నడ బుక్‌ అథారిటీ దీన్ని ప్రచురించింది.

సాహిత్య కృషిసవరించు

 
విత్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ 2
 • ద క్వెస్ట్‌ ఫర్‌ పీస్‌: యాన్‌ ఇండియన్‌ అప్రోచ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటా, మిన్నపొలిస్‌, 1959.
 • దత్తాత్రేయ: ద వే అండ్‌ ద గోల్‌, అలెన్‌ అండ్‌ యున్విన్‌, లండన్‌ 1957.
 • ద గీత అండ్‌ ఇండియన్‌ కల్చర్‌, ఓరియంట్‌ లాంగ్మన్స్‌, బాంబే, 1963.
 • రిలిజియన్‌ అండ్‌ మ్యాన్‌, ఓరియంట్‌ లాంగ్మన్స్‌, బాంబే, 1965, బేస్ట్‌ ఆన్‌ ప్రొఫెససర్‌ రనడే సిరీస్‌ లెక్చర్స్‌ ఇన్‌స్టిట్యూటెడ్‌ అట్‌ కర్ణాటక యూనివర్సిటీ ఇన్‌ 1961.
 • అవధూత: రీజన్‌ అండ్‌ రెవరెన్స్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వరల్డ్‌ కల్చర్‌, బెంగళూరు, 1958.
 • యాన్‌ ఆస్పెక్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఈస్థటిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, 1956.
 • పురాణాస్‌ యాజ్‌ ద వెహికిల్స్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ, జర్నల్‌ పురాణా, ఇష్యూచ5, 1963.
 • అవధూత ఫిలాసఫీ, శృంగేరీ సావనీర్‌ వాల్యూమ్‌, 1965, పేజెస్ 62 - 64.
 • శ్రీ సురేశ్వరాచార్య, శృంగేరీ సావనీర్‌ వాల్యూమ్‌, శ్రీరంగం, 1970, పేజెస్‌ 1-8.
 • కుండలినీ యోగ, అ రివ్యూ ఆఫ్‌ సర్పెంట్‌ పవర్‌ బై సర్‌ జాన్‌వుడ్‌రూఫ్‌.
 • నోట్‌ ఆన్‌ ఎకోలాజికల్‌ సర్వేస్‌ టు ప్రెసీడ్‌ లార్జ్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ - వెస్లీ ప్రెస్‌, మైసూర్‌, 1955
 • ఆఫ్రికన్‌ సర్వె -బెంగళూరు ప్రెస్‌, 1955
 • ద వర్చ్యువస్‌ వే ఆఫ్‌ లైఫ్‌ - మౌంటేన్‌ పాత్‌ జర్నల్‌ా జూలై 1964 ఎడిషన్‌

[2]

పలు గ్రంథాలను సంస్కృతం నుంచి కన్నడలోకి అనువాదం చేసేందుకు కూడా మహారాజు ఆర్థిక సాయం చేశారు. ఇది జయచామరాజ గ్రంథమాల సిరీస్‌లో భాగం. ఇందులో రుగ్వేదంలోని 35 భాగాలు కూడా ఉన్నాయి. సంస్కృతానికి సంబంధించిన అతి పురాతనమైన ఈ గ్రంథాలు, సాహితీ ప్రక్రియలు అప్పటిదాకా కన్నడ భాషలో సమగ్రంగా అందుబాటులో లేవు. ఈ పుస్తకాలన్నీ మూల విషయాన్ని, దాని కన్నడ అనువాదాన్ని కూడా అతి సులభమైన భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అందించాయి. ఇంతటి బృహత్కార్యాన్ని కన్నడ భాషలో అంతకు ముందు ఎవరూ చేపట్టలేదు. మైసూర్‌ సంస్థాన జ్యోతిష్కుడు, ధర్మాధికారి దివంగత హెచ్‌ గంగాధర శాస్త్రి ఈ పనులన్నింటికీ ఎంతగానో సాయపడ్డారు. వీటిలో ప్రతి పుస్తకాన్నీ మహారాజు స్వయంగా చదివేవారని, సలహాలూ, సూచనలు కూడా ఇచ్చేవారని ఆయన చెప్పారు. వాటిని గురించి రచయితలతో ఆయన చర్చించేవారట కూడా. ఒక పండుగ రోజు రాత్రి (శివరాత్రి) ఒకసారి ఆయన్ను పిలిచి, ఒక పుస్తకంలో కష్టతరంగా ఉన్న కన్నడ పదాలను కాస్త సులభతరం చేయాలని చెప్పారట!

ఈ సిరీస్‌లో ప్రచురించిన పుస్తకాలు ఇలా ఉన్నాయి:

 • రుగ్వేదా 35 భాగాల్లో
 • శ్యామకాచార్య స్తోత్రాలు ా రెండు భాగాల్లో
 • ఉపకంకష్టతి
 • అమకల్ప తరుస్తవ
 • త్రిపురాసుమర్దిని మీమాంసిక పూజ
 • గురుగీత
 • శివగీత
 • మహామత్స్య పురాశ్చరణ విధి
 • షోడశి పూజాకల్ప
 • భువనేశ్వరి పూజాకల్ప
 • రుద్ర మహాన్యాస ప్రయోగ
 • సూక్తగళు

పురాణగళు

 • దేవీ భాగవత 5 భాగాల్లో, ఇ.దాతోరెకంద్రాషె కార శాస్త్రి (1942-43)
 • శివపురాణ
 • శివ రహస్య
 • స్కంధమహాపురాణ
 • కాళికా పురాణా రెండు భాగాల్లో: హాసంద పండిట్‌ వేంకటరావు (28-5 -44)
 • వరాహ పురాణ
 • భవిష్య పురాణ
 • గణేశ పురాణ
 • వామన పురాణ
 • కంచీ మాహాత్మ్య
 • విష్ణు ధర్మచాత్ర పురాణ
 • బ్రహ్మాండ పురాణ
 • నారదీయ పురాణ
 • రామమంత్ర మహిమే, (అగస్థ్య సంహితె)
 • నారసింహ పురాణ
 • సాంబ పురాణ
 • సౌర పురాణ
 • ఆది పురాణ
 • కల్కి పురాణ
 • మత్స్య పురాణ
 • కూర్మ పురాణ
 • శివతత్వ సుధానిధి - ఈవీ బ్రా ద్వారా

|| ఈఎస్‌.సీతారామ శాస్త్రి (24-6-49)

 • హలస్య మహాత్మ్యే
 • గార్గ్య సంహిత
 • బ్రహ్మ వైవర్త పురాణ
 • బ్రహ్మ పురాణ
 • శంకర సంహితె
 • పద్మ పురాణ
 • విష్ణు పురాణ మూడు భాగాల్లో: పండిత గంజా తిమన్నయ్య ద్వారా అనువాదం: 1948లో: మొత్తం పేజీలు (492+460+463)

మంత్రశాస్త్రాశాస్త్రనామాఉపనిషత్‌

 • పరివాస్య రహస్య
 • త్రిపురాటపిన్యుపనిషత్‌ '
 • లలితాత్రిశతి భాష్య
 • త్రిపుర రహస్య ''
 • శ్రీ కంద సారార్థ బోధిని
 • సూత సంహితె
 • వనదుర్గోపనిషత్‌
 • శారద సహస్రనామ
 • గణేశ సహస్రనామ
 • దక్షిణామూర్తి సహస్రనామ
 • శివ పూజా పద్ధతి

(పై శీర్షికలు రాస్తున్నప్పుడు ఆంగ్లంలో ట్రాన్స్‌ల్టిరేషన్ నిబంధనలు ప్రఖ్యాత ఉచిత సాఫ్ట్‌వేర్ /www.baraha.com ఉపయోగించాము.)

బిరుదులుసవరించు

 • 1919 మార్చి 11 నుంచి 1940: మహారాజకుమార్‌ శ్రీ జయచామరాజేంద్ర వడయార్‌
 • 1948 మార్చి 11 నుంచి జూలై 3: శ్రీశ్రీ యువరాజ శ్రీ జయచామరాజేంద్ర వడయార్‌ బహదూర్‌, యువరాజా ఆఫ్‌మైసూర్‌
 • 1940 జూలై 3-1945: శ్రీశ్రీ మహారాజ శ్రీ జయచామరాజేంద్ర వడయార్‌ బహదూర్‌, మహారాజా ఆఫ్‌ మైసూర్‌
 • 1945 - 1946: శ్రీశ్రీ మహారాజ శ్రీ సర్‌ జయచామరాజేంద్ర వడయార్‌ బహదూర్‌, మహారాజా ఆఫ్‌ మైసూర్‌, GCSI
 • 1940 - 1962: శ్రీ శ్రీ మహారాజ శ్రీ సర్‌ జయచామరాజేంద్ర వడయార్‌ బహదూర్‌, మహారాజా ఆఫ్‌ మైసూర్‌, GCB, GCSI
 • 1962 - 1971: మేజర్‌ జనరల్‌ శ్రీశ్రీ మహారాజా శ్రీ సర్‌ జయచామరాజేంద్ర వడయార్‌ బహదూర్‌, మహారాజా ఆఫ్‌ మైసూర్‌, జీసీబీ, జీసీఎస్‌ఐ

గౌరవాలుసవరించు

 • బ్రిటిష్‌ ప్రభుత్వం 1945లో GCSIతో 1946లోGCB తో సత్కరించింది.
 • డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ ఫ్రమ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌, ఆస్ట్రేలియా[3][4]
 • డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌ ఫ్రమ్‌ అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు
 • డాక్టర్‌ ఆఫ్‌ లా ఫ్రమ్‌ బనారస్‌ హిందూ యూనివర్సిటీ
 • డాక్టర్‌ ఆఫ లాస్‌, హనోరిస్‌ కాసా ఫ్రమ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌ (1962)
 • ఫెలో అండ్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ సంగీత్‌ నాటక్‌ అకాడెమీ, న్యూ ఢిల్లీ, 1966
 • ఇండియన్‌ వన్యప్రాణి‌ బోర్డుకు తొలి ఛైర్మన్‌
 • విశ్వహిందూ పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

కుటుంబంసవరించు

సోదరీమణులు

 • యువరాణి విజయ లక్ష్మీ అమ్మణి, తర్వాత రాణీ విజయ దేవీ ఆఫ్‌ కోట్‌డా సంగని
 • యువరాణి సుజయ కంఠ అమ్మణి, తర్వాత ఠాకూరాణి సాహిబా ఆఫ్‌ సనంద్‌
 • యువరాణి జయ చాముండ అమ్మణి అవరు, తర్వాత హెచ్‌హెచ్‌ మహారాణి శ్రీ జయ చాముండ అమ్మణి అవరు సాహిబ, మహారాణి ఆఫ్‌ భరత్‌పూర్‌

భార్యలు

దస్త్రం:Princelywedding.jpg
The pamphlet detailing the wedding of Prince Jaya Chamaraja Wodeyar Bahadur
దస్త్రం:Princelywedding.jpg
ద పాంప్లెట్‌ డీటెయిలింగ్‌ ద వెడ్డింగ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ జయ చామరాజ వడయార్‌ బహదూర్‌
 1. హెచ్‌హెచ్‌ మహారాణి సత్య ప్రేమ కుమారి ఆఫ్‌ చర్కరి. వీరి పెళ్ళి 1938 మే 15న జరిగింది. ఇది విఫల వివాహం. మహారాణి జైపూర్‌లోనే స్థిరపడ్డారు. వారికి సంతానమేమీ కలగలేదు.
 1. హెచ్‌హెచ్‌ మహారాణి త్రిపుర సుందరీ అమ్మణి అవరు. ఈ పెళ్ళి 1944 ఏప్రిల్‌ 30న జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు సంతానం.

ఇరువురు మహారాణులూ 1983లో 15 రోజుల తేడాతో మరణించారు.

పిల్లలు

 1. యువరాణి గాయత్రీ దేవి అవరు, (1964-1974). ఈమె తండ్రి కంటే ముందే మరణించింది.
 2. యువరాణి మీనాక్షీ దేవి అవరు, (జననం 1951)
 3. హెచ్‌హెచ్‌ మహారాజ శ్రీ శ్రీకాంత దత్త నరసింహరాజ వడయార్‌ (జననం 1953).
 4. యువరాణి కామాక్షీ దేవి అవరు, జననం 1954 .
 5. యువరాణి ఇంద్రాక్షి దేవి అవరు, జననం 1956
 6. యువరాణి విశాలాక్షీ దేవి అవరు, జననం 1962

బాహ్య లింకులుసవరించు