జయప్రభ
తెలుగు కవయిత్రి
జయప్రభ ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
జయప్రభ | |
---|---|
![]() | |
జననం | అనిపిండి జయప్రభ జులై 29, 1957 నాగపూర్, మహారాష్ట్ర ![]() |
ప్రసిద్ధి | స్త్రీవాద కవయిత్రి, కథా రచయిత్రి |
మతం | హిందూ |
విశేషాలుసవరించు
ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్ నగరంలో 1957, జూలై 29న జన్మించారు [1]. ఈమె విద్యాభ్యాసం విశాఖపట్నంలో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివారు . ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించారు. ఈమె ప్రస్తుతం సికిందరాబాదులో నివసిస్తున్నారు [2]. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు[3]. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు .[4]
రచనలుసవరించు
- ది పబ్ ఆఫ్ వైజాగపట్నం
- యశోధరా వగపెందుకే
- చింతల నెమలి
- యుద్ధోన్ముఖంగా...
- క్షణ క్షణ ప్రయాణం
- ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?
- భావకవిత్వంలో స్త్రీ
- వలపారగించవమ్మ వనిత నీ-యలుక చిత్తమున కాకలివేసినది
- వామనుడి మూడోపాదం
- నాలుగో గోడ
- పైటని తగలెయ్యాలి
- విచ్చుకత్తులు
- యశోదరా వగపెందుకే
- సూర్యుడు కూడా ఉదయిస్తాడు