జయమ్మ పంచాయతీ

జయమ్మ పంచాయతీ 2022లో వచ్చిన తెలుగు సినిమా. విజయలక్ష్మి సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగా ప్రకాశ్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించాడు. సుమ కనకాల, దేవీ ప్రసాద్, దినేష్‌, శాలినీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మే 6న విడుదలైంది.

జయమ్మ పంచాయతీ
JAYAMMA PANCHAYITHI.jpg
దర్శకత్వంవిజయ్ కుమార్ కలివరపు
కథా రచయితవిజయ్ కుమార్ కలివరపు
నిర్మాతబలగా ప్రకాశ్
తారాగణం
ఛాయాగ్రహణంఅనుష్ కుమార్
కూర్పువెన్నెల క్రియేషన్స్
సంగీతం
నిర్మాణ
సంస్థ
వెన్నెల క్రియేషన్స్
విడుదల తేదీ
2022 మే 6
దేశంభారత దేశం
భాషతెలుగు

క‌థ‌సవరించు

జయమ్మ (సుమ) తన భర్త గౌరీ నాయుడు (దేవి ప్రసాద్) పిల్లలతో కలిసి పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. జయమ్మ భర్త (దేవి ప్రసాద్)కు అకస్మాత్తుగా గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. జయమ్మకు తన భర్త చికిత్స కోసం డబ్బు అవసరం కాగా తన సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి వెళుతుంది. తన సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి వచ్చిన జయమ్మ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా ? అనేది మిగిలిన సినిమా కథ.[1]

నటీనటులుసవరించు

 • సుమ కనకాల [2]
 • దేవీ ప్రసాద్
 • దినేష్‌ [3]
 • శాలినీ
 • కొండెపూడి జాయ్
 • నికిత
 • గణేష్ యాదవ్
 • భువన్ సాలూరు
 • గేదెల త్రినాధ్
 • అమ్మ రామకృష్ణ
 • మాయానంద్ ఠాకూర్ రెడ్డి
 • మహేశ్వర రావు
 • డి హేమ

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
 • నిర్మాత: బలగా ప్రకాశ్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు
 • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
 • సినిమాటోగ్రఫీ: అనుష్ కుమార్
 • ఎడిటర్: రవితేజ గిరజాల
 • ఆర్ట్ డైరెక్టర్: ధను అన్ధలూరి
 • సహా నిర్మాత: అమర్ - ఆఖిల
 • పాటలు: రామాంజనేయులు, రామజోగయ్య శాస్త్రి

ప్రచారంసవరించు

ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని 2021 నవంబరు 6న నటుడు రామ్‌ చరణ్‌ విడుదల చేశాడు.[4] 2021 నవంబరు 23న ‘తిప్పగలనా.. చూపులు నీ నుంచే’ పాటను నటుడు నాని విడుదల చేశాడు.[5] 2021 డిసెంబరు 12న నటుడు రానా దగ్గుబాటి టీజర్‌ను విడుదల చేశాడు.[6] 2022 జనవరి 16న ఈ సినిమాలోని రెండో పాట 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' ను దర్శకుడు రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశాడు.[7]

మూలాలుసవరించు

 1. Eenadu (6 May 2022). "రివ్యూ: జయమ్మ పంచాయితీ". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
 2. Andrajyothy (5 November 2021). "సుమ కనకాల వెండితెర రీఎంట్రీ.. ప్రీలుక్ వచ్చేసింది!". Archived from the original on 5 November 2021. Retrieved 5 November 2021.
 3. Sakshi (2 January 2022). "అటవీ ప్రాంతం నుంచి టాలీవుడ్‌ హీరోగా." Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
 4. V6 Velugu (6 November 2021). "సిల్వర్ స్క్రీన్‌పై యాంకర్ సుమ.. రోలు బద్దలైందిగా" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
 5. Sakshi (23 November 2021). "యాంకర్‌ సుమకు హీరో నాని సాయం.. సాంగ్‌ అదిరిందిగా!". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
 6. Eenadu (12 December 2021). "సుమ 'పంచాయతీ'కి రానా.. 'జయమ్మ' టీజర్‌ని చూపించి!". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
 7. Sakshi (16 January 2022). "సుమ 'జయమ్మ' లిరికల్‌ వీడియో సాంగ్‌.. వచ్చేసిందిగా". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.