జయశంకర్ ప్రసాద్ (Jaishankar Prasad) (హిందీ: जय शंकर प्रसाद ) (జననం జనవరి 30, 1889–, మరణం జనవరి 14, 1937) ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు.

Jaishankar Prasad
దస్త్రం:Jaishankar Prasad,1889-1937.jpg
జననం: 30 జనవరి 1889
వృత్తి: Novelist, playwright, poet

జీవితచరిత్రసవరించు

జయశంకర్ ప్రసాద్ జనవరి 30, 1889న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వారణాసిలో ఒక ఉన్నత మాధేశియా వైశ్య కుటుంబంలో జన్మించారు. సుంఘానీ సాహు (सुंघनी साहू)గా కూడా గుర్తించబడే ఆయన తండ్రి బాబు దేవకీ ప్రసాద్ ఒక పొగాకు వ్యాపారి. బాల్యంలోనే తండ్రి మరణించడంతో, ఆయన బాగా చిన్న వయస్సులో ఉన్నప్పుడే కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నారు, ఎనిమిదో తరగతి తరువాత పాఠశాల చదువును ఆపివేశాడు. అయితే, ఆయనకు సాహిత్యం, భాషలు మరియు పురాతన చరిత్రపై ఆసక్తి మాత్రం అలాగే ఉండిపోయింది, ఇంటిలోనే వీటిని చదవడం కొనసాగించాడు; ఆ తరువాత ఆయనకు వేదాలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది, ఆయన రచనల్లోని లోతైన తాత్విక అంశాల్లో ఈ ఆసక్తి అంతర్లీనంగా కనిపిస్తుంది. పూరాతన అవశేషాలను అధ్యయనం చేయడంపై కూడా ఆయనకు ఆసక్తి ఉండేది.

కవిగానే కాకుండా ఆయన ఒక తత్వవేత్తగా, చరిత్రకారుడిగా మరియు శిల్పిగా కూడా గుర్తింపు పొందారు. చివరి సంవత్సరాల్లో ఆయన ప్రాపంచిక విషయాలకు దూరంగా, దాదాపుగా ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అయితే చదరంగం, తోటల పెంపకం, శాస్త్రార్థ మరియు కవిత్వ పారాయణ మాత్రం కొనసాగించారు.

ఆచార్య రామ చంద్ర శుక్లా మరియు మున్షి ప్రేమ్‌చంద్ వంటి ఇతర సాహిత్య దిగ్గజాలకు జయశంకర్ ప్రసాద్ సమకాలికుడు.

భాష మరియు ప్రభావంసవరించు

ఆయన ప్రారంభ కవిత్వాన్ని (చిత్రాధార్ సంకలనం) హిందీ యొక్క బ్రజ్ మాండలికంలో రాశారు, అయితే తరువాత ఖాడీ మాండలికం లేదా సంస్కృతీకరించిన హిందీలో రచనలు చేశారు.

ఆయన ప్రారంభ రచనల్లో, సంస్కృత నాటకాల ప్రభావం, అయితే తరువాత రచనల్లో బెంగాలీ మరియు పర్షియన్ నాటకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసాద్ యొక్క అత్యంత ప్రసిద్ధ నాటకాలు స్కందగుప్తా , చంద్రగుప్తా మరియు ధ్వువస్వామినీ .

కవిత్వ శైలిసవరించు

సుమిత్రానందన్ పంత్, మహాదేవి వర్మ, సూర్యకాంత్ త్రిపాఠి 'నిర్మలా'లతోపాటు, ఆయన హిందీ సాహిత్యంలో ఛాయావద్‌కు నాలుగు స్తంభాల్లో (స్తంభ్ ) ఒకరిగా పరిగణించబడుతున్నారు. మనసుకు హత్తుకునే (మార్మిక ) కవిత్వంగా ఆయన శైలి వర్ణించబడుతుంది. కళ మరియు తత్వశాస్త్రాలు ఆయన రచనల్లో అద్భుతంగా మిళితం చేయబడివుంటాయి. ఆయన ప్రధానంగా తత్సమం మరియు తద్భావం పదాలు ఉపయోగించారు - వీటిలో కొన్ని పదాలను వాస్తవానికి ఆయనే సృష్టించడం జరిగింది.

కాల్పనిక సాహిత్యం నుంచి జాతీయవాద సాహిత్యం వరకు జయశంకర్ ప్రసాద్ యుగానికి చెందిన అన్ని అంశాలు ఆయన కవిత్వానికి కర్తగా ఉన్నాయి. సాంప్రదాయిక హిందీ కవిత్వం యొక్క సారాంశాన్ని సూచించే బాటలో ఆయన నిలిచారు. ఆయన రాసిన దేశభక్తి పద్యాల్లో ఒకటైన 'హిమాద్రి తుంగ్ ష్రింగ్ సే' భారత స్వాతంత్ర్య ఉద్యమ యుగంలో అనేక మంది ప్రశంసలు అందుకుంది. అయితే, కామాయణి నిస్సందేహంగా ఆయన యొక్క అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది.

కామాయణిసవరించు

కామాయణి ఆయన రచనల్లో ఉత్తమమైనదిగా విస్తృత గుర్తింపు కలిగివుంది. ఎక్కువ మంది విమర్శకులు దీనిని హిందీ[1] పద్య (మహాకావ్య ) సాహిత్యంలో ఒక అత్యుత్తమమైన రచనగా అంగీకరిస్తున్నారు. కామాయణి వివిధ రకాల అంశాల గురించి వర్ణిస్తున్నప్పటికీ, ఇది రూపక శైలిలో మానవ సంస్కృతి అభివృద్ధిని వివరిస్తుంది. కామాయణి మహా వరద యొక్క కథ మరియు ఈ పురాణ గాథలోని ప్రధాన పాత్రలైన మను (ఒక పురుషుడు) మరియు శ్రద్ధ (ఒక మహిళ) గురించి వివరిస్తుంది. మను మానవ మనస్సుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, శ్రద్ధ ప్రేమకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరో మహిళా పాత్ర ఐదా వివేకానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కొందరు విమర్శకులు కామాయణిలోని మూడు ప్రధాన పాత్రలు మానవ జీవితంలోని జ్ఞానం, కర్మ మరియు కోరికలను సూచిస్తున్నాయని భావిస్తున్నారు.

నాటకాలు మరియు ఇతర రచనలుసవరించు

హిందీలో ఆయన నాటకాలు అత్యంత మార్గదర్శక రచనలుగా పరిగణించబడుతున్నాయి. ఆయన యొక్క అనేక నాటకాలు పురాతన భారతదేశం యొక్క చారిత్రక గాథల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిలో కొన్ని పురాణ గాథలు ఆధారంగా కూడా రూపుదిద్దుకున్నాయి. 1960వ దశకంలో, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో పురాతన భారతీయ నాటక విభాగ అధ్యాపకుడు శాంతా గాంధీ ఆధునిక భారతీయ నాటకరంగం కోసం జయశంకర్ ప్రసాద్ యొక్క నాటకాల్లో ఆసక్తిని పునరుద్ధరించారు, ఆయన 1928లో రాసిన అత్యంత ప్రసిద్ధ నాటకం స్కంద గుప్తా అసలు రచనకు కొన్ని మార్పులు చేయడం ద్వారా దాని "స్థిరత్వం"పై సందేహాలను తొలగించారు [2][3].

జయశంకర్ ప్రసాద్ కథానికలు కూడా రాశారు. వీటికి సంబంధించిన విషయాలకు మిశ్రమ మూలాలు కనిపిస్తాయి - చారిత్రక మరియు పురాణ అంశాల నుంచి సమకాలీన మరియు సామాజిక అంశాలు వీటికి నేపథ్యాలుగా కనిపిస్తాయి. బాద్షా సైన్యం తన తండ్రి ప్రాణాలు తీసినప్పటికీ, ఒక హిందూ వితంతువు తన ఇంటిలో మొఘల్ బాద్షాకు ఆశ్రయం ఇచ్చిన సంఘటన ఆధారంగా మమత (తల్లి ప్రేమ) అనే ఒక ప్రసిద్ధ కథానికను ఆయన రాశారు. ఛోటా జాదూగర్ (చిన్న ఇంద్రజాలికుడు) అని పిలిచే మరో ప్రసిద్ధ కథానికను కూడా ఆయన రాశారు, వీధుల్లో తన బొమ్మలతో చిన్నచిన్న ఎత్తులు ప్రదర్శిస్తూ జీవనం సాగించే ఒక బాలుడి జీవితం గురించి ఈ కథానిక వర్ణిస్తుంది.

ఆయన కొద్ది సంఖ్యలో నవలలు కూడా రాశారు.

ప్రధాన సాహిత్య రచనలుసవరించు

కవిత్వంసవరించు

 • కామాయణి (1935)
 • కానన్ కుసుం
 • ప్రేమ్ పతీక్
 • జర్నా
 • ఆన్సో
 • లెహర్
 • మహారాణా కా మహత్వ
 • హీరా లాల్

కథానికల సంకలనాలుసవరించు

 • ఛాయా
 • ప్రతిధ్వని
 • ఆకాశ్‌దీప్
 • ఆంధీ
 • ఇంద్రజాల్

కొన్ని ఇతర కథానికలుసవరించు

 • మమత
 • ఛోటా జాదూగర్
 • గుండా
 • మధువా
 • పురస్కార్
 • ప్రాలే

నాటకాలుసవరించు

 • సముద్రగుప్తా
 • ధ్రువ్‌స్వామినీ
 • సజ్జన్
 • పరిణయ
 • ఎక్ ఘోంట్
 • ప్రాయాశ్చిత్
 • తాస్కియ్య
 • రాజ్యశ్రీ
 • వైశాఖ్
 • అజాతశత్రు
 • కామన
 • జనమేజేయ కా నాగ్యాగ్య
 • స్కందగుప్తా
 • చంద్రగుప్తా (ప్రసిద్ధ దేశభక్తి పద్యం - హిమాద్రి ష్రింగ్ తుంగా సే దీనిలో ఉంది)
 • ధ్రువస్వామినీ

నవలలుసవరించు

 • టిటాలీ
 • కంకాళ్
 • ఐరావతి
 • ఫేమస్
 • జ్యోతి

ఆన్‌లైన్‌లో రచనలుసవరించు

సూచనలుసవరించు

 1. కంప్లీట్ కామాయణి ఎట్ కవితా కోశ్
 2. "Re-discovering Dhruvaswamini". The Hindu. October 29, 2009. మూలం నుండి 2011-01-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-15. Cite news requires |newspaper= (help)
 3. Lal, Mohan (2006). The Encyclopaedia Of Indian Literature - Volume 5. Sahitya Akademi. p. 4119. ISBN 8126012218.
 • కామాయణి ఆఫ్ జయశంకర్ ప్రసాద్ - యాజ్ ఐ సా ఇట్ అండ్ అండర్‌స్టాండ్ ఇట్ బై డాక్టర్ గిరీష్ బీహారీ

1st ఎడిషన్ 2006, పబ్లిష్డ్ బై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, లక్నో (U.P.) - ఇండియా https://web.archive.org/web/20130627172557/http://cities.expressindia.com/fullstory.php?newsid=205657