జలోర్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో జలోర్ జిల్లా ఒకటి. జలోర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 10640 చ.కి.మీ. (రాష్ట్రంలో 11%). 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,448,486. జనసాంధ్రత (చ.కి.మీ) 136.
జలోర్ జిల్లా | ||||
---|---|---|---|---|
దేశం | భారతదేశం | |||
రాష్ట్రం | రాజస్థాన్ | |||
పరిపాలానా కేంద్రం | జలోర్ | |||
విస్తీర్ణం | ||||
• మొత్తం | 10,640 కి.మీ2 (4,110 చ. మై) | |||
జనాభా (2011) | ||||
• మొత్తం | 18,28,730 | |||
• జనసాంద్రత | 170/కి.మీ2 (450/చ. మై.) | |||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
భౌగోళికం
మార్చుజలోర్ జిల్లా ఈశాన్య సరిహద్దులో బార్మర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో పాలి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సిరోహి జిల్లా, నైరుతీ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రంలోని బనస్ కాంతా జిల్లా ఉన్నాయి. జిల్లా 25.22 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 72.58 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా సముద్రమట్టానికి 268 మీ.ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 16040 చ.కి.మీ. జిల్లాలో నదులలో నది ల్యూని నది ఉపది సుక్రి నది ప్రధానమైంది.
నిర్వహణ
మార్చు- జిల్లాలో 5 ఉపవిభాగాలు ఉన్నాయి: ఆహొరె, జలోరె, భీన్మల్, రనివర, సంచొరె.
- జలోరె, ఆహొరె, భీన్మల్, రనివర, సంచొరె, సయల (భారతదేశం), బగొద, భద్రజున్ ఉప తాలుకా కార్యాలయాలు ఉన్నాయి.
- జిల్లాలో 5 పనచాయితీ సమితులు ఉన్నాయి: జలోర్, భిన్మల్, అకొలి, సయల.
- జశ్వంత్‌పురా, చితల్వన తాలూకాలుగా చేయాలని (రాజస్థాన్ 2012-2013 బడ్జెట్‌లో ) ప్రకటించారు.[1] జిల్లాలో 767 రెవెన్యూ గ్రామాలు, 264 గ్రామపంచాయితీలు ఉన్నాయి.
- జిల్లాలో మూడు పురపాలకాలు ఉన్నాయి:- జలోర్, భిన్మల్, శాంచోర్.
రాజకీయం
మార్చుజలోర్ జిల్లా ఒక పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది. ఇక్కడి నుండి 3 మార్లు భూటాసింగ్ పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు. జిల్లాలో 5 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి: జలోర్, అహోర్, భిన్మల్, రాణీవారా, శాన్‌చోర్.
ఆర్ధికం
మార్చుజిల్లాలో ప్రజలు అధికంగా వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఆవాలు గోధుమలు, జొన్నలు, కరీఫ్ పప్పులు, బార్లీ అధికంగా పండించుతారు. జిల్లాలో కొన్ని ఖనిజ సంబంధిత పరిశ్రమలు ఉన్నాయి. జిప్సం, లైంస్టోన్, బజరి, ముర్రం, గ్రానైట్, గ్రాబ్డ్ ఫ్లోరైట్ లభ్యం ఔతున్నాయి. జిల్లాలో మధ్యతరహా పరిశ్రమలు అధిక సంఖ్యలో ఉన్నాయి. గ్రానైట్ స్లాబులు, మార్బుల్ కటింగ్, పాలిషింగ్, ఆవాల గానుగలు, స్కిండ్ మిల్క్ పొడి, వెన్న, నెయ్యి, చేనేత, తోలు బూట్లు, ప్రధానమైనవి. జిల్లాలో నాలుగు పారిశ్రామిక వాడలు ఉన్నాయి.
2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జలోర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
మౌలిక సదుపాయాలు
మార్చువిద్యుత్తు
మార్చు- జిల్లాలో జలోర్, భీమల్‌లలో 220 కి.వా సబ్‌గ్రిడ్ స్టేషన్లు ఉన్నాయి. జిల్లాకు అవసరమైన విద్యుత్తును ఉదయపూర్ జిల్లా లోని దేవారి గ్రిడ్ నుండి సరఫరా చేయబడుతుంది. జిల్లాలోని గ్రామాలన్నీ విద్యుద్దీకరణ చేయబడ్డాయి.
- జిల్లాలోని జవై ఆనకట్ట నుండి వ్యవసాయానికి అవసరమైన నీరు కొంత భూభాగానికి మాత్రమే అందుతుంది.. వ్యవసాయానికి అవసరమైన నీటి కొరకు బావుల మీద ఆధారపడుతుంటారు. అత్యధికంగా నీటివాడకం వలన భూగర్భజలం చాలా లోతుకు పోయింది. శాంకోర్ తాలూకా నర్మదా నది నుండి నీటిని అందుకుంటుంది.
ప్రయాణసౌకర్యాలు
మార్చురహదారి
మార్చు- జాతీయరహదారి 15 (భతిండ-కండ్ల ) జిల్లా గుండా పయనిస్తుంది. జిల్లాలో రహదారి మొత్తం పొడవు 2800.
రైలు మార్గాలు
మార్చు- నార్త్‌వెస్టర్న్ రైల్వే బ్రాడ్‌గేజ్ రైలు మార్గంతో జిల్లా అనుసంధానించబడి ఉంది.
- సామాద్రి - భిల్డి రైలు మార్గం జిల్లా గుండా పయనిస్తూ జిల్లాను జలోర్, భీన్మల్ పట్టణాలతో అనుసంధానం చేస్తుంది. జిల్లాలో 15 రైలు స్టేషన్లు ఉన్నాయి.
విమానాశ్రయం
మార్చుసమీప విమానాశ్రయం జోధ్‌పూర్ వద్ద ఉంది. నూన్ గ్రామంలో ఒక ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఇది జలోర్ పట్టణానికి 30 కి.మీ దూరంలో ఉంది.
చారిత్రిక జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,71,363 | — |
1911 | 3,00,374 | +1.02% |
1921 | 2,78,888 | −0.74% |
1931 | 3,22,867 | +1.48% |
1941 | 3,68,338 | +1.33% |
1951 | 4,23,553 | +1.41% |
1961 | 5,47,072 | +2.59% |
1971 | 6,67,950 | +2.02% |
1981 | 9,03,073 | +3.06% |
1991 | 11,42,563 | +2.38% |
2001 | 14,48,940 | +2.40% |
2011 | 18,28,730 | +2.36% |
source:[3] |
2011 లో గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,830,151, [4] |
ఇది దాదాపు. | కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | నెబ్రస్క నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 260వ స్థానంలో ఉంది..[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 172 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.31%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 951:1000, [4] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 55.58%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
వాతావరణం
మార్చుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్షియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. సరాసరి వర్షపాతం 412 మి.మీ. జిల్లాలో పొడి వాతావరణం అధికంగా ఉంటుంది.
వన్యమృగాలు
మార్చుఇండియన్ వన్యమృగాలలో అరుదైన ఇండియన్ విల్డ్ యాస్ జలోర్ జిల్లాలో అధిక సంఖ్యలో ఉంటుంది. ప్రపంచంలో క్షీణిస్తున్న జతువుల జాబితాలో ఒకటైన ఇండియన్ విల్డ్ యాస్ జలోర్ పొరుగున ఉన్న గుజరత్ రాష్ట్ర జిల్లా కచ్ జిల్లా నుండి పొరుగున ఉన్న జలోర్ వరకు విస్తరుస్తున్నాయి. సాధారణంగా ఇండియన్ విల్డ్ యాస్ జంతువులకు గుజరాత్ మాత్రమే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. 2007లో కౌర్ అరణ్య ప్రాంతం రాజస్థాన్ అరణ్యప్రాంతంలో కలుపబడింది. ప్రస్తుతం ఇవి రాజస్థాన్‌లోని ఖెజరైలి ప్రాంతంలో 60 చ.కి.మీ అరణ్య ప్రాంతంలో కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని ప్రొసొపిస్ జులిఫ్లోరా జంగిల్స్‌లో ఇండియన్ విల్డ్ యాస్ చింకారాలు, హైనాలు, నక్కలు, ఎడారి పిల్లి, తోడేలు మొదలైన జంతువులతో కలిసి జీవిస్తున్నాయి.[7]
మూలాలు
మార్చు- ↑ "Rajasthan Budget 2012-13" (PDF). Archived from the original (PDF) on 2015-09-24. Retrieved 2014-11-14.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Kosovo 1,825,632 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341
- ↑ Wild Ass sighted in Rajasthan villages along Gujarat Archived 2011-06-29 at the Wayback Machine; by Sunny Sebastian; Sep 13, 2009; The Hindu, India's National Newspaper