జల్లికట్టు

తమిళ బుల్టేమింగ్ సంప్రదాయం

జల్లికట్టు (Jallikattu) తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట .ఇది స్పెయిన్లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.

మధురైలో జల్లికట్టు

చరిత్ర

మార్చు

తమిళ్ సాహిత్యం, సింధు నాగరికత లో జల్లికట్టుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన తమిళనాడులోని 'ముల్లై' భౌగోళిక ప్రాంతంలో నివసించే మతసంబంధమైన తెగలలో ఇది సర్వసాధారణం[1][2] కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారని తెలుస్తుంది.[3][4] నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి.[5] ఇంకా మధురైకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా.[5]

ఇది ముఖ్యంగా ఈ క్రింది ప్రదేశాల్లో జరుగుతుంది.

  1. అనంగనల్లూరు
  2. పుదుకోట్టై
  3. సాలెం/తమ్మంపట్టి
  4. మదురై దగ్గర ఉన్న పాలమేడు
  5. కారైకుడి దగ్గర ఉన్న శ్రవయాల్
  6. శివగంగ దగ్గర ఉన్న కందుప్పట్టి

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "'సల్లికట్టు' అంటే 'జల్లికట్టు'... ప్రాచీనమైనది. చరిత్ర - ఒక వీక్షణ". www.puthiyathalaimurai.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
  2. "జల్లికట్టు వేలాది సంవత్సరాలుగా తమిళుల జీవితంలో ఒక భాగం - దాని చరిత్ర ఏమిటి?". www.tamil.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
  3. "Google books version of the book A Western Journalist on India: The Ferengi's Columns by François Gautier". Retrieved 2008-07-09.
  4. "NY Times: The ritual dates back as far as 2,000 years...". Retrieved 2008-07-09.
  5. 5.0 5.1 "The Hindu : Bull chasing, an ancient Tamil tradition". The Hindu. Archived from the original on 2009-01-10. Retrieved 2008-06-14.