జల నేతి

జలనేతి అనునది ఒక యోగా ప్రక్రియ

జలనేతి అనునది ఒక యోగా ప్రక్రియ ఈ ప్రక్రియకు అర లీటరు నీటికి ఒక స్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ కలిపి, బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం (జల నేతి పోట్) ఉపయోగించి ముక్కు లోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే ముక్కు యొక్క మరియొక రంధ్రం ద్వారా ఆనీరు బయటకు వచ్చేస్తుంది. తద్వారా ముక్కులో ఏర్పడిన మలినాలన్నీ బయటకు వచ్చి శ్వాస ఇబ్బందులన్నీ తొలగి ఉపసమనం పొందుతారు. ముక్కు యొక్క రెండు రంద్రాలనూ ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి.

జలనేతి చేస్తున్న స్త్రీ

సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు, ముక్కు దిబ్బడ లేదా ఆస్త్మాతో బాధ పడుతున్నప్పుడు, సైనసైటిస్ తో బాధపదుతున్నప్పుడు ఉపశమనం కొరకు ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు యొక్క సలహాలు, సూచనలను అనుసరించడం ఉత్తమం.

జాగ్రత్తలు మార్చు

వీలైనంత వరకూ ఉదయం పూట మాత్రమే ఈ ప్రక్రియను చేయడం మంచిది. నీటిని మరిగించడం వలన ఆనీటిలోని క్రిములన్నీ చనిపోతాయి కాబట్టి ముక్కు ఆరొగ్యవంతంగ ఉంటుంది. కొన్ని సార్లు ఉప్పుతోపాటు అరస్పూను బేకింగ్ సోడాను కూడా కలపడం ద్వారా మరింత ఫలితాన్ని పొందవచ్చు.


ఉపయోగకరమైన బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జల_నేతి&oldid=3892138" నుండి వెలికితీశారు