జాతీయములు - ఆ

- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆంగ్లభాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని. జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.

===ఆకాశరామన్న === పేరు లేని, చెప్పని. ఎవరో గాని అతనంటే గిట్టని వాళ్ళు ఆకాశ రామన్న లేఖలు వ్రాస్తున్నారు.

ఆకాశానికెత్తటంEdit

అతిగా పొగడటం: ఉదా: వాడిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.

ఆకాశమంత పందిరి వేశారుEdit

చాల పెద్ద పందిరి వేశారు అనిఅర్థం. ఉదా: వారి పెళ్ళికి ఆకాశమంత పందిరి వేశారు.

ఆకాశపంచాంగముEdit

ఆర్చటం తీర్చటంEdit

కష్టాలను పోగొట్టడం, కాపాడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోఉంది. కష్టాల వల్ల కలిగే బాధను సమసింపజేసి ఊరట కలిగించి చేయూతనిచ్చే సమయంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. "ఇన్నాళ్ళూ నా కష్టాలను ఆర్చేదెవరో తీర్చేదెవరోనని మదనపడ్డాను. ఇన్నాళ్ళకు ఈయన కనిపించాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

ఆదమరిచివుండుEdit

అజాగ్రత్తగా ఉండటం.== వాడు ఆదమరచి నిద్ర పోతున్నాడు.... ఇంట్లో దొంగలు పడ్డారు.

ఆటలు సాగలేదుEdit

అనుకున్నది జరగలేదు == ఉదా: నీ ఆటలు ఇక్కడ సాగవు.

ఆదరాబాదరాEdit

హడావుడి పడటం

ఆపదలో మొక్కులు, సంపదలో మరపులుEdit

మనుషుల తీరు.మేలు చేసిన వారిని నాలుగు డబ్బులు కనిపించేసరికి మరచిపోవటం

ఆవంతEdit

అత్యల్పం

ఆకాశరామన్న ఆర్జీలుEdit

సంతకం లేకుండా వ్రాయు ఉత్తరాలు = తమ పేరు బయట పెట్టకుండా ఒకరిని నిందిస్తూ ఉత్తరాలు రాసే వారు.

ఆకాశచిత్రముEdit

ఆకాశమున గీయబడిన బొమ్మ

ఆకాశదీపంEdit

శివాలయాల్లో ధ్వజ స్తంభంపైన గుమ్మటంలో ఉండే దీపం చుట్టూ గుమ్మటం ఎంతగా రక్షణగా ఉన్నా గాలి తాకిడికి అది వెంటనే ఆరిపోతుంది.అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపదల్ని సమకూర్చుకొని అంతలోనే ఆ సంపదలన్నీ నశించిపోయి దరిద్రులుగా మారేవారు.

ఆకు అలముEdit

ఆకులు మొదలగున్నవి "నాకు ఆకులు అలములు వేసి పెట్టినారు , ఆ అడవిలో భోజనము"। = మహర్షులు అడవిలో వుండి ఆకులలములు తిని బ్రతికారంట.

ఆకు చాటు పిందెలలాగాEdit

ఆకు చాటు నున్న పిందెలు, ఎండ వాన తగలకుండ సున్నితముగా ఉంటాయి। అలా ఒకరి రక్షణలో ఉన్న అమాయకపు, సున్నితపు వారిని ఆకు చాటు పిందెలలాగా అని అంటారు।

ఆగవేగము/ఆఘమేఘాల మీదEdit

అతి వేగము == వాడు ఆగమేగాల మీద వచ్చాడు' ===ఆడలేక మద్దెల ఓడు అన్నాడట=== (దీన్ని సామెతగా కూడా వాడవచ్చు) తన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఎదుటి వాడిని నిందించటము.

ఆగాన వచ్చి గండాన పోవటంEdit

ఆగం చేసి సంపాదించిన అక్రమ సంపాదన గండాన చేతికి అందకుండా పోతుందని

ఆచంద్రార్కంEdit

కలకాలము: ఉదా: అతని కీర్తి ఆచంద్రార్కం నిలచి వుంటుంది.

ఆచి తూచి మాట్లాడాలిEdit

జాగ్రత్తగా మాట్లాడాలి: ఉదా: వానితో ఆచి తూచి మాట్లాడాలి.

ఆట పట్టించాడుEdit

సరదాకి ఏడిపించాడు: ఉదా: అందరు కలిసి ఆ చిన్న పిల్ల వాన్ని ఆట పట్టిస్తున్నారు.

ఆటవిడుపుEdit

విశ్రాంతి దినము ....ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాశ్యకో పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు।

ఆటు, పోటుEdit

సముద్రములో వచ్చునవి..... జీవితములో కష్టాలను ఆటుపోటులతో పోల్చడము సర్వసాధారణము।

ఆటపాటలుEdit

ఆటలు, పాటలు ఉల్లాసకరమైన క్రీడలు = చిన్నపిల్లలు ఆట పాటలతో కాలం వెళ్లబుచ్చు తారు.

ఆటలో అరటిపండుEdit

చిన్నపిల్లలకు ఆటలో దెబ్బ తగిలితే,బాధపడకుండా అరటిపండు తొక్కినట్లు భావించటం.ఎవరన్నా సరిగ్గా ఆడకపోయినా ఆటలో అరటిపండు అంటారు.

అట్టుడుకినట్టుందిEdit

వాడి వేడి మాటల యుద్దంజరిగిందని అర్థం: ఉదా: ఈ రోజు అసెంబ్లీ అట్టుడికినట్టు ఉడికింది.

ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుEdit

కాలం కలసిరావటం,శ్రమ తగ్గటం,కావాలసిన వారెవరైనా అనుకోగానే ఎదురుగా రావటం, చేద్దామనుకున్న పనిని అప్పటికే ఎవరైనా చేసి పెట్టటం.

ఆడాలి పాడాలి మద్దెలా కొట్టాలన్నట్టుEdit

నలుగురు చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేయాల్సి రావటం

ఆడిందే ఆటగాEdit

ఇష్టానుసారంగా ==ఉదా:: ఇంత కాలం నీవు ఆడిందే ఆట గా సాగింది . ఇకపై అలా కుదరదు.

ఆడుచు, పాడుచుEdit

శ్రమ తెలవకుండా సంతోషంగా హాయిగా చేసే పని. ఆడుతు పాడుతు పనిచేస్తుంటె అలుపు సొలుపు ఏ మున్నది..... ఇది ఒక సినీ గీతం.

ఆదమరచి నిద్రించుEdit

గాఢంగా నిద్రించు = తన చుట్టు ప్రక్కలా ఏమి జరుగు తున్నదో గ్రహించ లేని స్థితి. ఎటువంటి ఆలోచనలూ లేకుండా నిద్రించు తన రక్షణగురించిన చింత కూడా లేకుండా నిద్రించు

ఆదరా, బాదరాEdit

హడావిడి

ఆనుపానుEdit

పుట్టుపూర్వోత్తరం ఉదా: వాని అనుపానులన్ని మాకు తెలుసు. ==గుట్టుమట్లు

ఆరు గాలEdit

ఉదా: ఆరుగాల కష్టపడి పండించిన పంట వరదలకు కొట్టుక పోయింది.

ఆపసోపాలుEdit

అలసట చెందినవారికి ఇది ఉపయోగిస్తారు ..... ఉదా:... ఈ చిన్న పని చేయడానికి వాడు ఆప సోపాలు పడుతున్నాడు.

ఆముదం తాగిన ముఖంEdit

ఇబ్బందికర భావ వ్యక్తీకరణ.ఆముదం రుచి, వాసన గిట్టనందువల్ల, విరోచనాలై, ఆముదం తాగిన వాడి ముఖం అదోలా ఉంటుంది.అధికంగా పొట్ట ఖాళీ అయినందువల్ల కూడా ముఖం నీరసంగా కనిపిస్తుంది.

ఆముదపు విత్తులుEdit

ఆణిముత్యాల్లాగా మారవు.మంద బుద్ధులు, దుర్మార్గులు ఎంతగా చెప్పినా మంచిగా మారరు.

ఆముదపాకుగాడుEdit

బిక్షగాడు.ఆముదపాకు తెరచి ఉంచిన యాచకుడి అరచేయిలా కనిపిస్తుంది.

ఆముదం రాసుకొని తిరగటంEdit

ఎవరికీ దొరక్కుండా తిరగటం జారి తప్పించుకుని పారిపోవటం == దొంగలు ఒంటికి ఆముదము రాసుకొని వుంటారు.

ఆరంభశూరత్వంబుEdit

ఆంధ్రులు ఆరంభశూరత్వము అనే అపవాదు తెలిసినదే కదా! == ఒకపనిని ఆడంబరంగా ప్రారంబించి ఏ చిన్న ఆటంకం వచ్చినా ఆ పనిని అపేస్తారు.

ఆరితేరుEdit

మిక్కిలి నైపుణ్యం సంపాదించడం. విలువిద్యలో అర్జునుడు ఆరితేరిన వాడు.

ఆర్చు పేర్చుEdit

విజృంభించు

ఆర్చు, తీర్చుEdit

ఓదార్చు == నీవేమైనా ఆర్చే వాడివా తీర్చే వాడివా?

ఆరు నూరైనా, నూరు ఆరైనాEdit

ఎట్టిపరిస్థితుల్లోనైనా == ఆరు నూరైనా నూరు ఆరైనా నేను ఈ పనిచేసి తీరుతాను.

ఆయారాం గయారాంEdit

వచ్చేవారు వస్తున్నారు..... పోయేవారు పోతున్నారు... ఎవరూ పట్టించు కోవడం లేదు.

ఆవాలు ముద్ద చేసినట్టుEdit

కలయిక అసాధ్యం.విభిన్న మనస్తత్వాల వారిని ఒక చోటకు చేర్చి ఒకే అభిప్రాయానికి తేవటం, ఐక్యత, అనుసంధానాలు కుదరవని

ఆవులించిన పేగులు లెక్కపెట్టుEdit

ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడంటే చాలా తెలివి గలవాడనీ, చురుకైనవాడనీ అర్థం -= వాడు ఆవులిస్తే పేగులు లెక్కించ గలడు.

ఆశ లావు గొంతు సన్నంEdit

అత్యాశకు పోయి నోరు, గొంతు పట్టణంత ఆహార పదార్థాన్ని తినాలని ప్రయత్నించినా అది వీలుకాదు.గొంతులో ఎంతవరకు పడుతుందో అంత పదార్థాన్ని స్వీకరిస్తే మంచిది.

ఆస్తిమూరెడు ఆశ బారెడుEdit

అత్యాశ ... ఎవరి స్తోమత ప్రకారం ఆశలు పెట్టుకోవాలి. స్తోమతకు మించిన ఆశలు వుంటే ఈ మాటను వాడతారు.