జాతీయములు - జ, ఝ
భాషా సింగారం |
---|
సామెతలు |
అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ |
ఎ ఏ ఒ ఓ అం అః |
క ఖ గ-ఘ |
చ-ఛ జ ఝ |
ట ఠ డ-ఢ ణ |
త థ ద ధ న |
ప ఫ బ భ మ |
య ర ల వ |
శ-ష స-హ |
ళ క్ష ఱ |
జాతీయములు |
అ ఆ ఇ ఈ ఉ ఊ |
ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
ట, ఠ డ, ఢ ణ |
త, థ ద, ధ న |
ప, ఫ బ, భ మ |
య ర ల వ |
శ ష స హ |
ళ క్ష ఱ |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
పొడుపు కథలు |
"అ" నుండి "క్ష" వరకు |
- జ
జగమొండిసవరించు
పట్టిన పట్టుదలను ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టని వారు
జగమెరిగిన సత్యంసవరించు
అందరికి తెలిసిన విషయమే: ఉదా: వాడు చెప్పింది జగమెరిగిన సత్యమే.
జన్నకిడిచినట్టుసవరించు
యజ్ఞం అంటే జన్నం. యజ్ఞంలో బలి ఇచ్చే పశువులను బాగా మేపుతూ ఉండేవారు. వాటికి తినటం తప్ప వేరే పని ఏమీ ఉండదు. అలా ఏ పనీ చేయకుండా తిని తిరిగే వారిని అచ్చోసిన ఆంబోతు అంటారు
జల్లెడతో నీళ్లు తెచ్చినట్లుసవరించు
అసాధ్యమైన పని, అసంభవమైన కార్యం.
జవసాలివ్వటంసవరించు
ఎదురు తిరగటం . జవాబు, సవాలు అనే రెండు పదాలు కలిసి జవసాలు అనేది ఏర్పడింది. అడిగిన దానికి జవాబు ఇవ్వటానికి బదులు సవాలు చేయటం
జగత్ కిలాడీలుసవరించు
మోస గాళ్లు ఉదా: వారు జగత్ కిలాడీలు.
జడితివ్వటంసవరించు
ఒప్పుకోవటం లేదా అంగీకరించటం.బలికోసం సిద్ధం చేసిన జంతువు నీళ్ళు, కుంకుమలాంటివి చల్లినప్పుడు వాటి ఒళ్ళు జలదరిస్తుంది. అలా జలదరిస్తే జంతువు ఒప్పుకున్నట్టు, జలదరించకపోతే ఒప్పుకోనట్టు లెక్క.
జనగణమన పాడేశారుసవరించు
ముగింపు పలికేశారు. ఉదా: ఆ వుషయానికి వారెప్పుడో జనగణమన పాడేశారు,.
జనముద్దు బిడ్డసవరించు
అందరూ అభిమానించే వ్యక్తి, జనరంజకుడు దాత, అందరితోనూ అన్యోన్యంగా ఉంటూ స్నేహభావంతో జీవించే వాడు.
జప్ప జప్పసవరించు
జపించటంసవరించు
ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండటం
జబర్దస్తీ చేస్తున్నాడుసవరించు
బలవంతం చేస్తున్నాడు. ఉదా: ఏరా? బలే జబర్దస్తీ చేస్తున్నావు.
జలగ లాగ రక్తం పీలుస్తున్నాడుసవరించు
జల్లెడ పట్టినట్లుసవరించు
అణువణువునా వెతకడం
జమాబందీ సిరాబుడ్డీసవరించు
జామాతా దశమో గ్రహఃసవరించు
జామాత అంటే అల్లుడు. వేధించే అల్లుడే పదో గ్రహం
జిడ్డుగాడుసవరించు
ఓ పట్టాన వదలనివాడు.ఎదుటి వ్యక్తులను ఏదో వంకతో పలకరించి, గంటల తరబడి ఆ మాటా ఈ మాటా చెబుతూ కాలక్షేపం చేసేవాడు.తీరిక లేదని చెప్తున్నాపట్టించుకోరు.ఇంకోపనేదీ చేసుకోనివ్వరు.వదిలి వెళ్ళరు.
జిల్లేడు పెళ్ళిసవరించు
దొంగ పెళ్ళి .నిత్య పెళ్ళి కొడుకులు చేసుకునే వివాహం. మొదటి ఇద్దరు భార్యలు విడిచి వెళ్ళినప్పుడు మూడో పెళ్ళిలో జిల్లేడు చెట్టుకు ముందుగా తాళి కట్టడం ఆచారం. మూడు సంఖ్య అంత మంచిది కాదని జిల్లేడును మూడో పెళ్ళి కూతురుగా భావించి తాళి కడితే ఆ తరువాత పెళ్ళి చేసుకునే స్త్రీ నాలుగో భార్యగా వరుస క్రమంలో నిలుస్తుందని దురభిప్రాయం . జిల్లేడుకు తాళి కట్టడం నామకార్థం. అంతా దొంగ వ్యవహారమే
జిల్లేళ్ళు మొలవటంసవరించు
పాడుబడి పోవటం . ఎవరూ నడవని ప్రాంతాల్లో, ఇళ్లను పాడుపెట్టినప్పుడు ఆ ఇళ్ళలో జిల్లేడు జీలుగ మొక్కలు మొలుస్తుంటాయి.
జిహ్వచాపంసవరించు
ఆకలి లేకున్నా రుచికోసం తినడం
జీగంజిసవరించు
గంగా జలం, తులసి తీర్థం . ఎవరైనా చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నోట్లో గంగా జలమో, తులసి తీర్ధమో పోయడం ఓ అలవాటు. జీవికి ఆఖరుగా పోసే గంజిని జీగంజి అంటారు. చాలామంది గంగా జలం, తులసి తీర్థం లాంటివి సంపాదించుకునే స్థితి లేని వారు వాటికి బదులు గంజి పోస్తుంటారు. 'ఆయన మరణిస్తే జీగంజి పోసే దిక్కు కూడా లేకుండా పోయింది'
జీగర్ర పుల్లసవరించు
మృత సంజీవని
జీడికట్టుదాకాసవరించు
ఎంతో ఎత్తుగా ఉంది అని . తాటిచెట్టు మొవ్వు మీదకు చీమల లాంటివి వెళ్ళి పాడు చేయకుండా ఆ తాటి చెట్టు మధ్య భాగంలో బాగా జగటగా ఉండే జీడికట్టును కడుతారు. దాంతో చీమలు పైకి పోలేవు.
జీతం లేకుండానె తోడేలు గొర్రెల్ని కాస్తానన్నదటసవరించు
జుట్టూ జుట్టూ పట్టుకోవటంసవరించు
తీవ్రంగా విభేదించటం బాహా బాహీ, కొట్లాడుకోవటం, విమర్శించుకోవటం,
జుట్లో దూరి పోయేవాడుసవరించు
చాల తెలివైన వాడని అర్థం: ఉదా: వాడు మహా తెలివైన వాదు. వీడి జుట్లో దూరి పోగలడు
జుర్రుకోవటంసవరించు
అతిగా పొందటం, సంపూర్ణంగా ఆనందంగా ఆస్వాదించటం పళ్ళ రసాలు, పాయసాలను నోటితో జుర్రుకుంటే అందాలను కళ్ళతోటే జుర్రుకొంటుంటారు
జువ్వ జువ్వసవరించు
జుయ్ జుయ్ మని తొందరగా భూమిలోకి ఇంకటం
జుట్టు పీక్కొంటున్నారుసవరించు
తీవ్రంగా ఆలోసిస్తున్నారని అర్థం: ఉదా: వారు ఆ విషమై జుట్టు పీక్కొంటున్నారు.
జులాయిగా తిరుగుతున్నాడుసవరించు
పని పాట లేకుండా తిరుగు తున్నాడని అర్థం:లా ఉదా: వాడు జుయిగా తిరుగు తున్నాడు. దొంగ బుద్ధి గల వాడు ఉదా: వాడొట్టి జేబులు కొట్టే రకం.
జెర్రికో కాలు విరిగినట్టుసవరించు
ఎక్కడో కొద్దిగా నష్టం వచ్చినా ఏమీ ఇబ్బంది లేదని, జెర్రికి వంద కాళ్లు వుంటాయి. అందులో ఒక కారు విరిగినా వచ్చిన నష్టం ఏమి లేదు.
జెండా మోయటంసవరించు
కార్యభారాన్ని భరించటం, ఆయా పక్షాల బాధ్యతలన్నింటినీ భుజాన వేసుకుని పనిచెయ్యటం
జేబులు కొట్టడంసవరించు
దోచుకోవటం
జేబు చప్పరించటంసవరించు
నష్టపరచటం
జొబ్బు జొబ్బుసవరించు
చాలామంది మనుషులు ఒక చోట కూడితే గుంపు అంటారు. పశువులు ఉంటే మంద అంటారు. విపరీతంగా కుప్పలు కుప్పలుగా ఎక్కడైనా ఈగలు ముసిరితే జొబ్బుజొబ్బుగా ఈగలున్నాయి అంటారు.
జోడుగుర్రాల స్వారీసవరించు
రమాదంలో వున్నాడని అర్థం: ఉదా: జోడు గుర్రాలమీద స్వారి చేస్తున్నావు జాగ్రత్తరో?
జోరు మీదున్నాడుసవరించు
మంచి ఊపుమీదున్నాడని అర్థం: ఉదా: ఏరా మంచి జోరు మీదున్నావు, ఏంది సంగతి?
జోడుగుర్రాల స్వారీసవరించు
రెండు పనులు ఒకేసారి చెయ్యటం రెండుగుర్రాలపై చెరి ఒకదానిపై ఒక కాలు వుంచి పరుగు తీస్తే ఖచ్చింతంగా ప్రమాదమే..
జోరు మీదున్నాడుసవరించు
చాల సంతోషంగా వున్నాడని అర్థం.
జైనుడి చేతిలో పేనుసవరించు
- ఝ