భాషా సింగారం
సామెతలు
ఊ-ఋ
అం అః
గ-ఘ
చ-ఛ
డ-ఢ
శ-ష స-హ
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకుసవరించు

దృత రాష్ట్ర కౌగిలిసవరించు

చాల ప్రమాదకరమైనదని అర్థం. తప్పించుకొన వీలు కానిది.

దంచడంసవరించు

విచక్షణారహితంగా కొట్టడం. రోటిలో వడ్లనో, మరే ఇతర ధాన్యాన్నో పోసి రోకలితో దంచిన తరువాత ఆ ధాన్యం తన రూపాన్ని కోల్పోయి పిండిగా మారుతుంది. అంతలా రూపం మారిపోయేటట్లుగా కొట్టడం. ఉదా: వాడు చేసిన తప్పుకు బాగా దంచి వదిలిపెట్టారు.

దండకం చదివినట్లుసవరించు

ఒక క్రమ పద్ధతిలో వేగంగా చెప్పటం

దంపతి కలహంసవరించు

దత్తపుత్రశోకంసవరించు

ధనమొస్తే దాచు కోవాలి .... రోగమొస్తే చెప్పుకోవాలిసవరించు

ధనియాల జాతిసవరించు

దబ్బునసవరించు

తొందరగా, దబదబ, దబ్బున. ఉదా: దబ్బున రావాలి పిలిసినప్పుడు.

దడిగట్టుసవరించు

దీనికి వెళ్లమని అర్థం: రమ్మని కూడా అర్థం వస్తుంది.

ధర్మకన్నంసవరించు

ధర్మవడ్డీసవరించు

దరిద్రనారాయణుడుసవరించు

దశ తిరిగిందిసవరించు

ఉన్నట్టుండి ఎవరికైన అదృష్టం కలిగి సంపద సమకూరితే వారిని గురించి ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉదా: వాడి దశ తిరిగింది. అని. దీనికి సమానార్థమైనదే మరొక జతీయము: అది. పంట పండింది. అని.

దశమగ్రహంసవరించు

జామాతాదశమ గ్రహః

దాగుడు మూతలాడు తున్నాడుసవరించు

సందేహిస్తున్నాడు. ఉదా: వాడు ఎదో చెప్పడానికొచ్చి దాగుడుమూతలాడు తున్నాడు.

దారికడ్డం పొయ్యికెదురుసవరించు

పని పాటు లేక ఇంట్లో కూర్చొనేవాడిని, ఇతరులు పని చేసుకొంటున్నప్పుడు ఆటంకం కలిగిస్తున్నప్పుడు దీన్ని వాడతారు..

దారినబోయే దానయ్యసవరించు

ఊరు పేరు లేని వాడని అర్థం. ఎవడో ఒకడు.

ద్రావిడ ప్రాణాయామంసవరించు

దాచిపెడితే దయ్యమై పట్టినట్టుసవరించు

నిజం నిప్పులాంటిది .ఎప్పటికైనా వాస్తవం తెలియక మానదు. అసత్యం ఆడిన వారికి బాధలు తప్పవు.

దాచిపెడితే.. పాచిపోయినట్టుసవరించు

అతిగా ఆశపడి సంపాదించి కూడపెట్టటం శ్రేయస్కరం కాదని.అందరూ తినాల్సిన పదార్థాన్ని తానొక్కడే తినాలనుకొని రహస్యంగా దాచిపెడితే అది ఎన్నో రోజులు నిలువ ఉండదు. ఆ తర్వాత పాచిపోయి తినటానికి పనికిరాకుండా పోతుంది.

దాపలెద్దుతీరుసవరించు

అరక కట్టినప్పుడు ఎడమవైపు ఉండే ఎద్దును దాపటెద్దు, దాటలెద్దు అని అంటుంటారు. దాపట, దాపల అనే పదాలకు ఎడమవైపు అని అర్థం. వెలపట, వెలపల అని అంటే కుడివైపు అని అర్థం. నాగలి చాలు వంకర లేకుండా చక్కగా ఉండాలంటే ఎడమవైపు నుండే ఎద్దు హుషారుగా, ఓపికగా తెలివిగా ఉండాలి. కుడి వైపు ఉన్న ఎద్దు కాస్త పక్కకు జరుగుతుంటే ఎడమవైపు పగ్గం వేసి ఉన్న ఎద్దు దాన్ని అదుపులో పెడుతూ పొలంలో నాగలి చాళ్ళన్నీ సక్రమంగా వచ్చేందుకు దోహదపడుతుంటుంది. ఈ విషయంలో కుడివైపు ఉండే ఎద్దు బలహీనంగా ఉన్నా సరిగ్గా పనిచేయలేకపోయినా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ దాపటెద్దు బలంగానూ, తెలివిగల దానిగానూ ఉండాలి. దాపటెద్దు తీరులో బాగా బలంగానూ, మంచి తెలివి తేటలు ఉన్న వ్యక్తి కనిపించినప్పుడు 'వాడిదంతా దాపటెద్దు తీరు... ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటాడు' అంటారు.

దారిలో పెట్టటంసవరించు

అదుపు చేయటం ఎదుటి వ్యక్తిని తన అభిప్రాయానికి అనుగుణంగా మార్చుకోవటం, తన మాట వినేలా చేయటం దారికి తెచ్చుకోవటం.

దివిటీ కింది దీపంసవరించు

ప్రతిభావంతుల ముందు, శక్తిసామర్థ్యాలు ఎక్కువగా ఉన్నవారి ముందు తక్కువ ప్రతిభ, తక్కువ శక్తిసామర్థ్యాలు ఉన్న వారు గుర్తింపు పొందలేరని

దిక్కు తోచ లేదుసవరించు

ఏమి తోచడం లేదు; ఉదా: ఇన్ని కష్టాలనెలా ఎదుర్కోవాలో దిక్కు తోచడం లేదు.

దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడుసవరించు

గట్టిగా అరిచాడు.

దిక్కున్న చోట చెప్పుకోసవరించు

ఉదా: ఆ పని నేను చేసేది లేదు: నీకు దిక్కున్న చోట చెప్పుకోపో.

దిక్కు లేని చావు చచ్చాడుసవరించు

ఉదా: వాడు ఇంత బతుకు బతికి దిక్కు లేని చావు చచ్చాడు.

దిక్కు లేని వాడుసవరించు

ఎవరూ ఆధారం లేని వాడు.

దిగదుడుపేసవరించు

తక్కువే; ఇద్దరిని పోల్చేటప్పుడు ఒకనికన్నా మరొకడు అతి తక్కువ స్థాయిలో వున్నప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిసారు. ఉదా: వానిముందు వీడు దిగదుడుపే.

ద్వితీయ బాల్యంసవరించు

దిండు కింద పోక చెక్కసవరించు

సిద్ధంగా అందు బాటులో వున్న వస్తువు, ధనము.

దింపుడు గాలం ఆశసవరించు

చివరి ఆశ. వివరణ: పూర్వం ఎవరైనా మరణిస్తే వారు మరణించారని నిర్ణయించ డానికి వైద్యులు వుండే వారుకాదు. శవ యాత్రలో వూరు బయట శవాన్ని దించి శవం చెవిలో అతని పేరు పెట్టి పిలుస్తారు. ఒక వేళ బతికి వుంటే అతను పలుకతాడు. అలా కొన్ని సందర్భాలలో జరిగింది. దాన్నే దింపుడు గాల ఆశ అంటారు. ఈ పద్ధతి ఈ నాటికి కొన సాగుతున్నది. ఇప్పుడు ఒకడు మరణించాడని వైద్యుడు నూటికి నూరు పాళ్లు నిర్ణయించినా పాత పద్ధతి ప్రకారం దింపుడు గాలం పద్ధతిని ఈ నాటికి కొనసాగిస్తున్నారు.

దింపుడు కళ్ళం ఆశసవరించు

దీపాలార్పే వాడుసవరించు

ధుర్మార్గుడు: ఉదా: వాడు దీపాలార్పే వాడు వాన్ని చేరదీయకండి. లేని పోని మాటలు చెప్పి ఇతరులను మోసపుచ్చి వారిని నాశనము చేయడమో.... లేక అనవసర భయబ్రాంతులను కల్పించి ఇతరుల మనసు విరిచి జీవితం పై విరక్తి కలిగేటట్లు చేసి వారిని ఆత్మ హత్యకు పురికొల్పేటట్లు చేయడమో కొంతమంది చేస్తుంటారు. అలాంటి వారి గురించి ఈ జాతీయము వాడుకలో ఉంది.

దుక్కిటెద్దుసవరించు

దుఃఖాన్ని దిగ మింగారుసవరించు

సమాలించు కున్నారు ; ఉదా: అతని మరణం వీరికి తీరని లోటే. విధిలేక దుఃఖాన్ని దిగ మింగు కున్నారు.

దురదగా వున్నదాసవరించు

ఉదా: వారితో పోట్లాడాలని నీకు అంత దురదగా వున్నదా?

దుంపనాశనం కావటంసవరించు

సమూలంగా నాశనమై పోవటం, నిశ్శేషంగా నశించి పోవటం ఉదా: వాడు చేసిన పని దుంప నాశనమై పోయింది.

దుడ్డే కావాలాసవరించు

కుక్కను కొట్టటానికి దుడ్డే కావాలా . ఏదో ఒక వంక పెట్టి చెప్పిన పనిని చెయ్యకుండా తప్పించుకోటం

దున్నపోతే దూడ మెయ్యబోతే ఎద్దుసవరించు

సోమరులు తినటానికే పుట్టినట్టు ఎప్పుడూ తింటూ పనిచేయమంటే శక్తి లేని దూడల్లాగా కూర్చుంటారు. ఎద్దులాగా ఎక్కువగా తింటారే కానీ దానికి తగ్గట్టు పనిచేయరు.

దులిపి వదిలి పెట్టడంసవరించు

దులపటం అంటే శుభ్రం చేయటం. తిట్టడం, విమర్శించటం కూడా. ఉదా: వాడు చేసిన తప్పుకు పట్టుకొని దులిపి వదిలి పెట్టారు.

దూలతీరిందాసవరించు

దుమ్ముతూరుపెత్తుసవరించు

చెడతిట్టు, దూషించు. అని అర్థము వాడు దుమ్ము తూరుపెత్తు చున్నాడు అని అంటే వాడు తిడుతున్నాడని ఆర్థము

దుమ్ము దులిపేశాడుసవరించు

బాగా కొట్టాడని అర్థం.

దుమ్ము రేగ్గొటాడుసవరించు

బాగా కొట్టాడని అర్థం

దెబ్బకు దెయ్యం కూడ వదులు తుందిసవరించు

ఉదా: వాడు నిజం చెప్పడం లేదు: రెండు తగిలిస్తే వాడె నిజం చెప్పతాడు. దెబ్బకు దెయ్యంకూడ వదులుతుంది.

దెబ్బ మీద దెబ్బ తగిలిందిసవరించు

కష్టాల మీద కష్టాలు వచ్చాయి.

దెబ్బకు దెబ్బ తీశారు-సవరించు

ప్రతీకారం తీర్చు కున్నారు. ఉదా: వారు దెబ్బకు దెబ్బ తీశారు.

దెయ్యం పట్టినట్టుసవరించు

విపరీతంగా ప్రవర్థింస్తుంటే ఇలా అంటారు

దేవతా వస్త్రాలుసవరించు

దేవుడిని ఎత్తుకురావడంసవరించు

దబాయించడం, అతిగా బొంకడం, అడ్డూ అదుపూ లేకుండా మోసం చేసి తాను మోసగాడిని కాదని నమ్మబలకడం.దోషి దేవుడి మీద అబద్ధపు ప్రమాణాలు చేస్తే దేవుడు శిక్షిస్తాడని కొందరు నిజాలను ఒప్పుకునేవారు. కానీ మరికొందరు తప్పు చేసినా చేయలేదని దబాయించి గుళ్లో దేవుడి మీద ప్రమాణం చేయడమే కాక ఆ దేవుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకొచ్చి తాము తప్పు చేయలేదని నమ్మపలుకుతుండేవారు.నిజం చెప్పమని అడుగుతున్నప్పుడు తప్పు చేసినప్పటికీ చేయలేదని తనను తాను సమర్ధించుకోటం.

దేవుడు కనిపించాడుసవరించు

ఉదా: ఈ పని పూర్తయ్యే సరికి దేవుడు కనిపించాడు. చాల కష్టమైందని అర్థం.

దేవుడు చల్లగా చూశాడుసవరించు

కష్టాలు తొలిగితే ఇలా అంటారు

దేవుడు కరుణించాడుసవరించు

ఉదా: దేవుడు చల్లగా చూడ బట్టి ఈ పని సక్రమంగా జరిగింది.

దైవాదీన సర్వీసుసవరించు

అనుమానాస్పదం: రావొచ్చు రాకపోవచ్చు: సందేహాస్పదము.

ధైర్యం దండి చేయి మొండిసవరించు

ఎంతో ధైర్యంగా అందర్నీ పనులు చేయమని ప్రోత్సహిస్తూ కొద్దిపాటి సాయం కూడా చేయక మొహం చాటుచేయటం.

దొప్పెడం బలి కోసం దోసిడంబలి ఒలకపోయటంసవరించు

అత్యాశకు పోయి నష్టాల పాలు కావటం.ఓ వ్యక్తి తన దోసిట్లో అంబలి పోస్తే తాగకుండా ఇంతలో ఇంకా ఎక్కువ అంబలి ఆ పక్కనెక్కడో ఉందని ఎవరో చెప్పింది విని దోసిట్లో ఉన్న దాన్ని కిందపారబోసి దొప్ప కోసం వెళ్ళాడట. తీరా అక్కడకు పోతే దొప్పాలేదు, దాంట్లో అంబలీ లేదు.

దొంగపోయిన తర్వాత ధోవతి ఎగ్గట్టినట్టుసవరించు

కొంతమంది ఏదైనా నష్టం జరుగుతున్నంతసేపూ ఏమీ చేయకుండా వూరుకొని, ఆ తర్వాత ఆ నష్టానికి కారకులైన వారిని అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలుకుతుంటారు. ఓ వ్యక్తి ఇంట్లో దొంగలుపడి దోచుకుంటున్నంత సేపూ భయం వల్ల ఏమీ మాట్లాడకుండా కూర్చుని, దొంగలెంచక్కా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళను పట్టుకొంటానంటూ పంచె ఎగ్గట్టి అందరి ముందూ బీరాలు పలికాడట. ఇలాంటిదే మరొకటున్నది: ===దొంగలు పోయిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగి నట్టు===

దొంగకు తేలు కుట్టినట్టుసవరించు

బయటకు చెప్పుకోలేని బాధ.

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుసవరించు

చాల ఆలస్యంగా పనిచేసే వారని అర్థం.

దోబూచు లాడు తున్నాడుసవరించు

సందేహిస్తున్నాడు.

దోమ చప్పుడుసవరించు

బలహీనుడు వెంటపడి ఎంతో పెద్దవారిని, బలవంతులను వేధించటం. దోమ అన్నిటా చాలా అల్పజీవి. మనిషి తలుచుకుంటే ఒక్క దెబ్బతో దాన్ని నలిపేయగలడు. కానీ అంతటి మనిషిని గదిలో ఉన్న ఒక్క దోమ శబ్దం చేస్తూనో, కుట్టి పారిపోతూనో తెగ వేధిస్తుంది.

దోమాడ కరణంసవరించు

కార్యసాధకుడు, కార్యదక్షుడు.కాళ్ళు పట్టుకునో, బతిమిలాడో, దండించో అనుకున్న పనిని మాత్రం సాధించుకొచ్చేవాడు.వాడికి పని అప్పజెప్తే అది అయిపోయినట్టే.

దోసకాయ మూతిసవరించు

మనిషి మంచివాడు మాట దురుసు.దోసకాయ అంతా బాగున్నా దాన్ని అగ్రభాగాన చేదుగా ఉంటుంది.

దోసపండులా ఉండటంసవరించు

అందంగా, ఆరోగ్యంగా, బంగినపల్లి మామిడి పండులా ఉండటం

దోస తిన్న కడుపుసవరించు

దోసతోటసవరించు

దౌర్భాగ్యదామోదరుడుసవరించు

సవరించు

ధర్మకన్నంసవరించు

కన్నం వేయటం అంటే దొంగతనం చేయటం.ధన వంతుల ఇళ్ళల్లో దొంగతనాలు చేసి ఆ ధనాన్ని పేదలకు పంచితే ధర్మ కన్నం అంటారు.