జాతీయములు - య

- అక్షరంతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.

భాషా సింగారం
సామెతలు
అం అః
క్ష
జాతీయములు
ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ
క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ
ట, ఠ డ, ఢ
త, థ ద, ధ
ప, ఫ బ, భ
క్ష
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు
నీతివాక్యాలు
పొడుపు కథలు
"అ" నుండి "క్ష" వరకు


"జాతీయములు" జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిదద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్థం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్థం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్థం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.

జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్థం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.

యాతాంతర్పణంEdit

సంప్రదాయాన్ని అగౌరవపరచటం, అశ్రద్ధతో కూడిన పని. పెద్దలకు యాతాంతో తోడి నీళ్లను తర్పణమివ్వడం.

యదనంతరంగాEdit

వాటంతట అవే జరిగే పనులు.యత్+అనంతరం = యదనంతరం, ఒకటి జరిగిన తర్వాత ఇంకొకటి జరగటం

యమధూతలా వెంటబడ్డావుEdit

ఎల్లప్పుడు వెంట బడి విసిగించే వాడినుద్దేసించి ఈ మాట వాడుతారు.

యమపురికి పంపటంEdit

సంహరించటం చంపటం

యమ యాతనలుEdit

భరించరాని కష్టాలు .నరకంలో రంపాలతో కోయటం, నూనెలో వేయించటం లాంటి బాధలను యమ దూతలు పెడతారట.

యమలోకాన్ని తలపించటంEdit

క్రూరత్వంతో నిండి ఉండటం, వికృత, హింసాత్మక చర్యలు చేస్తుండటం

యమ సంకటంEdit

భరించరాని కష్టం చెప్పుకోలేని బాధ విపరీతమైన వ్యథ

యవ వరాహ న్యాయంEdit

తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడటం.యవల చేను పాడుచేసిన అడవి పంది తప్పించుకోగా వూరపందికి శిక్షపడ్డట్టు

యంబ్రహ్మEdit

యాతాం తర్పణంEdit

యుగంధరుడుEdit