జి.ఎస్.దీక్షిత్ ప్రముఖ చదరంగ క్రీడాకారుడు. చదరంగ క్రీడలో 1950దశకంలోనే తెలుగువారి కీర్తిప్రతిష్టలు పెంపొందించిన తొలితరం క్రీడాకారుడు.

జీవిత విశేషాలు మార్చు

జి.ఎస్.దీక్షిత్ గా సుప్రసిద్ధుడైన ఈ క్రీడాకారుని పూర్తిపేరు గొల్లపూడి సుబ్రహ్మణ్య దీక్షిత్. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వ్యక్తి ఐన ఆయన తండ్రి గొల్లపూడి వెంకటరామయ్య ఆ ప్రాంతంలో చదరంగానికి మేటిగా పేరొందారు. చిన్నతనంలో తండ్రి నుంచి చదరంగ క్రీడలోని మెళకువలు తెలుసుకున్న దీక్షిత్ అకుంఠిత దీక్షతో పసివయసు వీడకుండానే తండ్రిని పలుమార్లు ఓడించారు.

చదరంగ క్రీడలో మార్చు

యౌవనకాలంలో పలుమార్లు మద్రాసు, బీహార్, ఆంధ్ర ప్రాంతాల చదరంగ క్రీడా ఛాంపియన్ షిప్ గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కస్తూరి కప్, రానడే ట్రోఫీల విజేత నిలిచారు. అంతర్జాతీయ కరస్పాండెన్స్ చదరంగం పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొనే అరుదైన గౌరవాన్ని పొందారు.[1]

వ్యక్తిత్వం మార్చు

దీక్షిత్ చదరంగక్రీడలో తాను అత్యున్నత స్థాయికి ఎదగడమే కాక ప్రతిభావంతులైన యువకులను తనంతట తానుగా చేరదీసి వారికి గురువుగా వ్యవహరించి మెళకువలు నేర్పడం ఆయన వ్యక్తిత్వాన్ని పట్టి ఇస్తుంది

ప్రాచుర్యం మార్చు

ఇండియన్ చెస్ పత్రిక దీక్షిత్ ఆటతీరు గురించి శ్రీ దీక్షిత్ 20 ఎత్తుల వరకూ ఆలోచించి ఆడగల మేధావి. ఎత్తులలో ఆయనను బోల్తాకొట్టించగలమని ప్రత్యర్థులు భావించడం తమను తామే వంచించుకోవడం అని రాసింది. చదరంగక్రీడకు సంబంధించి దేశంలోనే మొదటి ముగ్గురిలో ఒకరిగా సంవత్సరాల తరబడి పేరొందారని 20-7-1960న ప్రచురితమైన దీక్షిత్ గురించిన వ్యాసంలో ఆంధ్రసచిత్ర వారపత్రిక పేర్కొంది.

మూలాలు మార్చు

  1. ఆంధ్రసచిత్ర వారపత్రికలో తెలుగువెలుగులు శీర్షికన జి.ఎస్.దీక్షిత్ వ్యాసం(20-07-1960)

ఇవి కూడా చూడండి మార్చు

చదరంగం