జి.ఎస్. సంఘ్వి

భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి.

జి.ఎస్. సంఘ్వి (జ. 12 డిసెంబరు 1948) భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. 2013, డిసెంబరు 11న పదవీ విరమణ చేశాడు.[2] 2005-2007 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.

జస్టిస్
జి.ఎస్. సంఘ్వి
భారత సుప్రీంకోర్టు
In office
12 నవంబరు 2007 – 12 డిసెంబరు 2013 [1]
Appointed byప్రతిభా పాటిల్, భారత రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
In office
27 నవంబరు 2005 – 11 నవంబరు 2007
గుజరాత్ హైకోర్టు
In office
28 ఫిబ్రవరి 2005 – 26 నవంబరు 2005
వ్యక్తిగత వివరాలు
జననం (1948-12-12) 1948 డిసెంబరు 12 (వయసు 75)
జోధ్‌పూర్, రాజస్థాన్
జాతీయతభారతీయుడు
కళాశాలరాజస్థాన్ విశ్వవిద్యాయలం

జననం, విద్యాభ్యాసం మార్చు

జస్టిస్ సింగ్వి 1948, డిసెంబరు 12న రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ లో జన్మించాడు. 1968లో జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. 1971 లో రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకంతో బ్యాచిలర్ ఆఫ్ లా (ఎల్.ఎల్.బి.) డిగ్రీ పట్టా అందుకున్నాడు.[2]

వృత్తిజీవితం మార్చు

న్యాయవాదిగా మార్చు

రాజస్థాన్ హైకోర్టులో రాజ్యాంగ చట్టంలో ప్రాక్టీస్ చేశాడు. [2]

న్యాయమూర్తిగా మార్చు

1990, జూలై 20న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. 1994, ఏప్రిల్ 28న పంజాబ్-హర్యానా హైకోర్టుకు, తరువాత 2005 ఫిబ్రవరి 28న గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యాడు.[2]

2005, నవంబరు 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వచ్చింది. 2007, నవంబరు 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యాడు.[2]

గుర్తించదగిన తీర్పులు మార్చు

2జి స్పెక్ట్రం కేసు మార్చు

2008 సంవత్సరంలో జారీ చేసిన 122 2జి లైసెన్సులను 2012 ఫిబ్రవరి 2న జస్టిస్ సింగ్వి, జస్టిస్ ఎకె గంగూలీలతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. అప్పటి కేంద్ర టెలికాం మంత్రి ఎ. రాజా వాటిని "రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా చేశాడని" పేర్కొన్నారు.[3][4]

మూలాలు మార్చు

  1. "Judge Profile". Supreme Court of India website. Retrieved 15 June 2021.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Justice G.S. Singhvi – Profile". Supreme Court of India. Archived from the original on 30 December 2012. Retrieved 15 June 2021.
  3. "Supreme Court quashes 122 2G licences awarded in 2008". DNA. Retrieved 15 June 2021.
  4. "SC quashes 122 licences". The Times of India. 2 February 2012. Archived from the original on 29 October 2013. Retrieved 15 June 2021.