జి. శంకర కురుప్

మలయాళ రచయిత

జి. శంకర కురుప్ జూన్ 3, 1901 లో ప్రస్తుత ఎర్ణాకులం జిల్లాలోని (నాటి కొచ్చిన్ సంస్థానం) పెరియార్ నదీతీరంలో ఉన్న నాయతోడ్ లో పుట్టాడు. ఫిబ్రవరి 2, 1978వ తేదీన వప్పలాచ్చేరి, అంగమలి, ఎర్నాకులం జిల్లాలో మరణించాడు. మహాకవిగా పేరొందిన ఈయన మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.[1][2] జ్ఞానపీఠ పురస్కారం సాహిత్యరంగంలో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాన్ని ఈయనకు 1965 లో ఒడక్కుళల్ (వెదురు వేణువు) అనే కవితా సంకలనానికి గానూ ప్రదానం చేసారు. 1968 లో ఈయనకు పద్మ భూషణ పురస్కారం కూడా అందింది.

జి.శంకరకరూప్
G.shankarakurup.jpg
జననంజి.శంకర కురూప్
1901,జూన్ 03
నయథోడ్,కొచ్చిన్
మరణం1978,ఫిబ్రవరి 02
ఎర్నాకుళం, కేరళ
నివాస ప్రాంతంకేరళ
ఇతర పేర్లుThe Great Poet G
వృత్తిఉపాధ్యాయుడు, కవి, వ్యాస రచయిత, అనువాదకుడు,గేయ రచయిత,పార్లమెంట్ సభ్యులు.
పదవి పేరుమహాకవి.G(The Great Poet G)
భార్య / భర్తసుభద్ర అమ్మ
తండ్రిశంకర వారియర్
తల్లివడక్కని లక్ష్మీకుట్టి అమ్మ

ఇతడు రాజ్యసభ సభ్యునిగా (1968-1972) నామినేట్ చేయబడ్డాడు.

మూలాలుసవరించు

  1. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 2007-10-13. Retrieved 2012-12-23.
  2. "Jnanpith". Archived from the original on 2001-12-30. Retrieved 2012-12-23.

బయటి లింకులుసవరించు