జీరెడ్డి చెన్నారెడ్డి
జీరెడ్డి చెన్నారెడ్డి తెలుగు రచయిత, సంస్కృత పండితుడు, అనువాదకుడు, పరిశోధకుడు.
జీరెడ్డి చెన్నారెడ్డి | |
---|---|
జననం | |
మరణం | 1998 మే 16 | (వయసు 83)
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఎ., పి.హెచ్.డి., బి.ఎడ్., విద్వాన్ |
విద్యాసంస్థ | మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మైసూర్ విశ్వవిద్యాలయం |
వృత్తి | డైరెక్టర్ |
ఉద్యోగం | శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం |
ప్రాచ్యపరిశోధనాలయం | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, పరిష్కర్త |
గుర్తించదగిన సేవలు | దక్షిణ తార, మకుట భంగము, ప్రెసిడెంటు |
జీవిత భాగస్వామి | కమలమ్మ |
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1915, ఫిబ్రవరి 26వ తేదీన కడప జిల్లా పర్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం మద్రాసు విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో నడిచింది. ఇతడు ఎం.ఎ., బి.ఇడి., విద్వాన్ పట్టాలను పొందాడు.మైసూరు విశ్వవిద్యాలయం నుండి "తెలుగు సాహిత్యముపై వీరశైవమత ప్రభావము" అనే అంశంపై పరిశోధించి డాక్టరేటు పట్టా పుచ్చుకున్నాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా పనిచేశాడు[1]. ఇతడు 1998, మే 16న తన 83వయేట మరణించాడు.[2]
రచనలు
మార్చు- భాసుని రామనాటకమూలములు[3]
- తెలుగు సాహిత్యముపై వీరశైవ మతప్రభావము (సిద్ధాంత గ్రంథం) [4] - 1996
- ఆంధ్రమహా భారతము, విరాట పర్వము[5]
- మకుట భంగము (నవల) -1947
- దక్షిణ తార (నవల) - 1950
- బృందావనం (నవల)
- ప్రెసిడెంటు (నాటకం) -1954
- ముప్పిరాల సుబ్బరాయకవి విరచిత ప్రద్యుమ్న చరితము (పరిష్కృతం) [6] - 1974
- కావ్యము - సమీక్ష[7] -1962
- శ్రీ వెంకటాచలమహాత్మ్యము (దామెర చినవెంకటరాయకవి విరచిత చంపూకావ్యం - పరిష్కృతం) [8] - 1962
మూలాలు
మార్చు- ↑ Whos Who Of Indian Writers (1 ed.). న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ. p. 66. Retrieved 11 April 2020.
- ↑ డి.కె.చదువుల బాబు (December 2007). కడపజిల్లా సాహితీమూర్తులు (1 ed.). హైదరాబాదు: గౌరు తిరుపతిరెడ్డి. pp. 94–95.
- ↑ sources-of-bhasas-ramayana-plays
- ↑ telugu-sahityamupai-virasaiva-mata-prabhavamu
- ↑ andhramahabharatamu-virataparvamu
- ↑ muppirala-subbarayakavi-viracita-pradyumna-caritramu
- ↑ kavyamu-samiksa
- ↑ sri-venkatacala-mahatmyamu