జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు

జీవ వైవిద్య ఉద్యానవనం (బయోడైవర్సిటీ పార్కు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలి ఉన్న ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో దాదాపు 600 రకాల మొక్కలు పెరుగుతున్నాయి.

జీవ వైవిద్య ఉద్యానవనం
బయోడైవర్సిటీ పార్కు
పార్కు ప్రధాన ద్వారం
రకంప్రజా పార్కు
స్థానంగచ్చిబౌలి, హైదరాబాదు, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు17°25′43″N 78°22′31″E / 17.4286°N 78.3752°E / 17.4286; 78.3752
స్థితివాడుకలో ఉంది

ప్రారంభం సవరించు

2012లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా హైదరాబాదులో ఈ పార్కు స్థాపించబడింది. స్మారక స్తూపంతో ఈ పార్కును అప్పటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించాడు.[1] 2015, జనవరి 19 నుండి ప్రజల సందర్శనకోసం తెరవబడింది.[2] 2 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) ఈ ఉద్యానవనాన్ని నిర్మించింది.

స్మారక స్తూపం సవరించు

జాతుల పరిణామాన్ని (ఒక అణువు నుండి మొదలై అణువులు, ప్రోటీన్లు, వివిధ జీవిత రూపాలుగా తెలివైన మానవుడిగా పరిణామం చెందడం) వర్ణించే 32 అడుగుల ఎత్తైన దీర్ఘవృత్తాకార నిర్మాణం కలిగిన ఈ స్మారక స్తూపం సున్నపురాయితో నిర్మించబడింది. ప్రకృతిలోని ఐదు అంశాలను (భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం) సూచించేవిధంగా వృత్తాలతో స్తూపం ఉంటుంది.[3] నల్ల గ్రానైట్ యొక్క వృత్తాకార మార్గం వివిధ జాతుల పేర్లతో చెక్కబడింది. ఫైర్ రింగ్ ఎరుపు గ్రానైట్, పసుపు సున్నపురాయితో చిత్రీకరించబడింది. దిగువ "ఈథర్" రింగ్ నీలం సముద్ర జలాలతో ప్రపంచ పటాన్ని ప్రదర్శిస్తుంది. పైలాన్ పైభాగంలో DNA ను సూచించే డబుల్ హెలిక్స్ ఉంది.

పార్కు సవరించు

13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు నాలుగు భాగాలుగా విభజించబడింది. ఇందులోని ఒక్కో మొక్క, ఐక్యరాజ్య సమితిలోని ఒక్కో సభ్యదేశంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆనాటి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ పార్కును తెలంగాణ అటవీశాఖ చూసుకుంటుంది.

ఇతర వివరాలు సవరించు

  1. రాయదుర్గం మెట్రో స్టేషనుకు 1.6 కి.మీ. దూరంలో ఈ పార్కు ఉంది.
  2. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పార్కులోకి అనుమతి ఉంటుంది.
  3. ఇక్కడ సరస్సులు, సహజ రాతి నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
  4. పార్కు జంక్షన్‌లో రూ. 30.26కోట్లు ఖర్చుతో 690 మీటర్లు పొడవు, 11.50 మీటర్లు వెడల్పు మూడు లేన్లలో నిర్మించిన బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ ను 2020, మే 21న పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[4]

చిత్రమాలిక సవరించు

ఇవికూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. Geetanath, V. (16 October 2013). "Gachibowli's Bio-Diversity Park remains out of bounds for visitors". The Hindu. Retrieved 12 June 2020.
  2. "Biodiversity Park open to public". The Hindu. 19 January 2015. Retrieved 12 June 2020.
  3. "Bio Diversity Park, Hyderabad". Odysseystone. Archived from the original on 2020-06-12. Retrieved 2020-06-12.
  4. నమస్తే తెలంగాణ, హైదరాబాదు (21 May 2020). "బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ నేడు ప్రారంభం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.

ఇతర లంకెలు సవరించు